వరలక్ష్మీ వ్రత నిర్ణయం: ఆగష్టు 21 లేదా 28? శాస్త్రం ఏం చెబుతోంది?
శ్రావణ మాసం రాగానే ముత్తైదువలందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. అయితే, ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని ఆగష్టు 21న చేయాలా లేక 28న చేయాలా అనే సందేహం చాలా మందిలో నెలకొం. సాధారణంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఒకవేళ పౌర్ణమి రోజున శుక్రవారం వస్తే, ఆ రోజే వ్రతం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే, ఈ సంవత్సరం ఆగస్టు 28 న శుక్రవారం పౌర్ణమి వస్తోంది.
అయితే, మన తెలుగు పంచాంగాలన్నీ 21వ తేదీనే వరలక్ష్మీ వ్రతం అని స్పష్టంగా పేర్కొన్నాయి. కానీ, ఇతర భాషల (తెలుగుయేతర) పంచాంగాల్లో మాత్రం 28వ తేదీన వ్రతం చేయాలని రాసి ఉండటంతో గందరగోళం ఏర్పడింది. ఒక ధర్మశాస్త్ర పండితుడిగా, ఈ విషయాన్ని పురాణ శ్లోకాల ఆధారంగా మీకు స్పష్టంగా వివరిస్తున్నాను.
ధర్మశాస్త్రం ఏమంటోంది? (ప్రమాణ శ్లోకాలు)
వరలక్ష్మీవ్రతమ్
శ్రావణశుక్లపూర్ణిమోపాన్తభార్గవదినే వరలక్ష్మీవ్రతం కార్యమ్| ఉక్తంచ భవిష్యోత్తరే - శ్రావణస్య సితే పక్షే పూర్ణిమోపాన్తభార్గవే | వరలక్ష్మీవ్రతం కార్యం మోక్షసమ్పత్ఫలప్రదమ్ || ఇతి | యదా పూర్ణిమాయామేవ భృగువారస్సమ్భవతి తస్మిన్నేవ దినే వరలక్ష్మీవ్రతం కార్యమ్ | నోపాన్తభార్గవదినే | ఉక్తంచ కౌముద్యామ్ - యస్మిన్ వై శ్రావణే మాసి శుక్లాస్తే తు భృగోర్దినే | ప్రారభ్య తద్వ్రతం తత్ర వరలక్ష్మ్యా యతాత్మభిః || ఇతి |
పై శ్లోకాల ప్రకారం వ్రతం ఎప్పుడు ఆచరించాలో స్పష్టమైన నియమాలు ఉన్నాయి:
- శ్రావణ మాసం శుక్లపక్షం: ఈ వ్రతాన్ని తప్పనిసరిగా శ్రావణ నెలలో వచ్చే శుక్లపక్షంలోనే ఆచరించాలి.
- పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం: పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయాలి.
- ఒకవేళ ఆ శుక్రవారమే పౌర్ణమి కూడా వస్తే, ఆ పౌర్ణమి రోజే వ్రతం చేయాలి. దీనినే "భార్గవి" అంటారు (ఇది స్కంద పురాణం, తత్త్వకథలో స్పష్టంగా చెప్పబడింది).
స్కంద పురాణ వచనం
స్కంద పురాణం ప్రకారం, శ్రావణ మాసం శుక్లపక్షంలో, శుభమైన ఆఖరి రోజుల్లో, శుక్రవారం రోజున ఇంట్లో హరిప్రియ అయిన లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో శుక్రవారంతో కూడిన పౌర్ణమి, ప్రదోష సమయంలో ఉంటే అది వ్రతానికి చాలా శుభకరం. శుక్లపక్షంలో చేస్తే వృద్ధి, నైవేద్యం ఉంటుం. కానీ కృష్ణపక్షంలో చేస్తే ఫలం తక్కువ అవుతుంది, అంతేకాదు చేసేవారికి సర్వనాశనం వస్తుందని హెచ్చరించబడిం. అందుకే అన్ని ప్రయత్నాలు చేసి శుక్లపక్ష శుక్రవారం రాత్రి మహాలక్ష్మిని శక్తి కొద్దీ పూజించాలి.
భవిష్యోత్తర పురాణ వచనం
భవిష్యోత్తర పురాణం ప్రకారం, ఒకవేళ శుక్రవారం రాత్రి పౌర్ణమి వ్యాపించి ఉంటే ఆ రోజే తీసుకోవాలి. లేకపోతే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి. కృష్ణపక్షంలో శుభమైన వరలక్ష్మీ వ్రతం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఒకవేళ తెలిసీ తెలియక చేసినా అది భర్త, పుత్రుల నాశనానికి కారణం అవుతుందని స్పష్టం చేయబడిం. పూజా వ్రతాలలో సర్వత్ర మధ్యాహ్న వ్యాపినీ కాలమే ప్రధానంగా గ్రహించాలి.
గత ఉదాహరణలు - ప్రస్తుత పరిస్థితి విశ్లేషణ
గతంలో ఆగష్టు 3, 2001 న పౌర్ణమి రోజున వరలక్ష్మీ వ్రతం వచ్చిం. ఆరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 9.08 వరకు చతుర్దశి ఉండి, ఆ తర్వాత పౌర్ణమి వ్యాపించిం. అలాగే ఆగష్టు 19, 2005 లో కూడా పౌర్ణమి రోజున వ్రతం వచ్చిం. అయితే ఆ రోజు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.22 వరకు పౌర్ణమి వ్యాపించి ఉన్నది కాబట్టి ఆరోజు వ్రతం ఆచరించడం శాస్త్ర సమ్మతమైం.
మరి ఈ సంవత్సరం ఆగష్టు 28న ఎందుకు చేయకూడదు?
వ్రతం ఎట్టి పరిస్థితులలోనూ శుక్ల పక్షంలో చేయాలి తప్ప, కృష్ణ పక్షంలో కాదు. ఈ సంవత్సరం ఆగష్టు 28వ తేదీన పౌర్ణమి భారత కాలమానం ప్రకారం కేవలం ఉదయం 09.48 వరకే వ్యాపించి ఉన్న. ఆ తర్వాత కృష్ణ పక్షం ప్రారంభమవుతుం. మనం వ్రతం చేసుకునే సమయానికి (మధ్యాహ్నం లేదా సాయంత్రం) కృష్ణ పక్షం ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో వ్రతం చేయడం మహా దోషం. పురాణాల ప్రకారం కృష్ణ పక్షంలో వ్రతాచరణ దోషప్రదం కాబట్టి, 28వ తేదీన వరలక్ష్మీ వ్రతం చేయకూడదు.
కాబట్టి, శాస్త్ర ప్రమాణాలను అనుసరించి, ఎటువంటి సందేహాలు లేకుండా ఈ సంవత్సరం ఆగష్టు 21వ తేదీనే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించండి.
వరలక్ష్మీ వ్రత పూజా ముహూర్తాలు (ఆగష్టు 21)
వ్రతాన్ని ఆచరించడానికి, అమ్మవారిని ఆవాహన చేయడానికి ఈ కింది ముహూర్త సమయాలు అత్యంత అనుకూలమైనవి:
- ప్రదోషకాల పూజా ముహూర్తం: లక్ష్మీ పూజ ఏదైనా ప్రదోష సమయం లేదా రాత్రి చేయాలి. అది కూడా స్థిర లగ్నం అయితే ఇంకా మంచిది. కాబట్టి (స్కంద పురాణం ప్రకారం ప్రదోష సమయంలో, రాత్రి పూట లక్ష్మీ పూజ చేయడం విశేష ఫలప్రదం అని శాస్త్రం చెబుతోంది). 21వ తేదీన హైదరాబాద్ కు ప్రదోష సమయం లో వచ్చే స్థిర లగ్నమైన కుంభ లగ్నం సాయంత్రం 06.20 నుంచి 07.58వరకు ఉంటుంది. మీ ప్రాంతంలో ఈ రోజు ప్రదోష సమయంలో వచ్చే స్థిర లగ్నమైన కుంభ లగ్న సమయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మీకు వీలైన సమయంలో ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి సకల సౌభాగ్యాలను పొందండి.


Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn.
This newborn Astrology service is available in
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in