జనవరి 17, 2023 నుంచి శని కుంభరాశిలో సంచరిస్తాడు. ఈరోజు నుంచి మీన రాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది మరియు ధను రాశికి పూర్తవుతుంది. చాలామందికి ఏల్నాటి శని అంటే ఒకలాంటి భయం ఉంటుంది. శని ఏం చేస్తాడో, ఎన్ని కష్టాలు పెడతాడో అనే ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే నిజంగా శని ఆ విధంగా కష్టపెడతాడా లేక మంచి చేస్తాడా అనేది ఒకసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం మకర కుంభరాశి వారికి అలాగే 17వ తారీకు నుంచి మీన రాశి వారికి ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శని అంటే శని గోచారం మన రాశి నుంచి 12వ, ఒకటవ మరియు రెండవ స్థానంలో ఉండటం. ఈ మూడు స్థానాలకు ఇంత ప్రాధాన్యత ఉండటానికి కారణమేమిటంటే ఇవి మన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, మరియు జీవన విధానాన్ని సూచించేవి కావటం. ఒకటవ ఇల్లు మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మరియు మన జీవన విధానాన్ని సూచిస్తుంది. రెండవ ఇల్లు మన కుటుంబాన్ని మరియు ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 12వ ఇల్లు మన ఖర్చులను, ఆరోగ్య సమస్యలను మరియు స్వయంకృతాపరాధాలను సూచిస్తుంది. ఈ స్థానాల్లో కర్మ కారకుడైన శని సంచరించడం వలన ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఆ వ్యక్తులు అనుభవిస్తారు. నిజానికి శని ఇచ్చేది కష్టంలో కనిపించినప్పటికీ అది మనలో ఉన్న లోపాలను, మనం మనం చేసిన పురాకృత కర్మను తొలగించేది తప్ప మనం ఇబ్బందులకు గురిచేసేది కాదు. శని గోచారం ఈ మూడింటిలోని కాకుండా, నాలుగవ ఇంటిలో, మరియు ఎనిమిదో ఇంటిలో కూడా చెడు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వాక్యం. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఇది మిగిలిన గ్రహాల కంటే ఎక్కువ సమయం ఒక రాశిలో ఉంటుంది కాబట్టి మన జీవితంలో శని గోచారానికి అందుకే అంత ప్రాధాన్యత ఉంటుంది. శని మనం చేసే పనికి, మన వృత్తికి, మన కర్మకు కారకుడు. జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఆ జాతకుడి జీవితం బాగుంటుంది. అంటే ఆ వ్యక్తి ఏ పనైనా సక్రమంగా చేస్తాడు. శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్ధకానికి, వాయిదా వేసే స్వభావానికి దూరంగా ఉంటాడు. ఏ పని అయినా సమయానుసారం చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతి సాధిస్తాడు. శని ఆలోచనలకంటే కూడా పనికి ప్రాధాన్యత ఇచ్చే గ్రహం. అందుకే మన ఆలోచనలకు కారకుడైన చంద్రుడు, మన అహంకారానికి అధికారానికి కారకుడైన సూర్యుడు శత్రులయ్యారు. జాతకంలో శని బాగాలేకుంటే ఆ వ్యక్తి బద్ధకస్తులుగా, చెడు పనులు చేసే వాడిగా మరియు పని మధ్యలో మానేసే వాడిగా ఉంటాడు. దాని కారణంగా జీవితంలో అభివృద్ధి తొందరగా జరగదు. శరీరం సరిగా అర్థం చేసుకుంటే శని ఇచ్చే ఫలితాలు మన జీవితాన్ని అభివృద్ధిపరిచేవే తప్ప, నష్టపరిచేవి కావని అర్థమవుతుంది.
ఏలినాటి శని సమయంలో, శని 12వ ఇంటిలో ఉన్నప్పుడు మనకు ఖర్చులు పెరుగుతాయి. అయితే శని గోచారం 11 ఇంట్లో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించడానికి చెడు మార్గాలు ఎంచుకోవడం లేదా అన్యాయంగా ఇతర డబ్బును, ఆస్తులను ఆక్రమించుకోవడం చేసినప్పుడు మాత్రమే శని గోచారం 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అన్యాయంగా సంపాదించిన డబ్బు ఖర్చవుతుంది. అంతేకాకుండా మనలో డబ్బు ఖర్చు చేయని పిసినారితనం ఉన్న ఈ సమయంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావటంతో మనలో ఉన్న ఆ లోపం తొలగిపోతుంది. దాని కారణంగా భవిష్యత్తులో మనకు ఆర్థికంగా మరియు శారీరకంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. శని 12వ ఇంటిలో ఉన్న సమయంలో డబ్బు ఖర్చు విషయంలో అహంకారానికి పోవటం, లేదా విలాసాల కారణంగా ఖర్చు చేయడం తగ్గించుకోవడం మంచిది. గతంలో విలాసాల కొరకు అధికంగా డబ్బు ఖర్చు చేసేవారు ఈ సమయంలో డబ్బు అందకపోవడం వలన ఆ లోపాన్ని తగ్గించుకోవడం కాకుండా, డబ్బు విలువ తెలుసుకోగలుగుతారు. శని మనం సంపాదించిన డబ్బునే ఖర్చు చేసేలా చేస్తాడు తప్ప అప్పలను అప్పులపాలు చేయడు. ఈ సమయంలో శని ప్రభావం తగ్గించుకోవాలంటే మనం అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేయటం అలాగే శారీరకంగా కూడా అవసరమైన వారికి సాయం చేయడం వలన శని ఇచ్చే ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది.
శని గోచారం ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనలో మానసికంగా మరియు శారీరకంగా ఉండే లోపాలు తొలగిపోతాయి. మనలో ఉండే బద్ధకం కానీ, మనపై మనకు ఉండే అతి ప్రేమ కానీ, స్వార్థం కానీ ఈ సమయంలో దూరమవుతాయి. శని ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనం చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనం బద్దకంగా ఉండడం కానీ, నిర్లక్ష్యంగా పనిచేయడం వలన కానీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనలు కూడా మనం నియంత్రించుకోవడం మంచిది. ఈ సమయంలో వృత్తిలో కానీ, మనం చేసే పనిలో కానీ బాధ్యతలు పెరగటం వలన మనలో ఉండే అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి దూరమవుతాయి. ఈ సమయంలో శని ఇచ్చే చెడు పలితాలు తగ్గడానికి మీరు బద్దకాన్ని వదిలేయటం, మరియు ఏ పనైనా పూర్తి బాధ్యతతో, ఏకాగ్రతతో పూర్తి చేయడం చేయాలి. మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగంలో మార్పులు జరగటం లేదా అనుకోని సమస్యలు రావడం జరుగుతుంది. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ సమయంలో శని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.
రెండవ ఇంటిలో శని సంచారం చేసేటప్పుడు మన కుటుంబ విషయాల్లో మరియు ఆర్థిక విషయాల్లో మనకు సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలు మన మన కుటుంబానికి మరింత దగ్గరయ్యేలా చేస్తాయి తప్ప వారికి మనను దూరం చేయవు. కుటుంబం పట్ల మనలో ఉండే అతి జాగ్రత్త కానీ, అతి ప్రేమ కానీ ఈ సమయంలో తగ్గడమే కాకుండా మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వర్తించేలా చేస్తుంది. మీరు బాధ్యతలను తప్పించుకునే వారైతే లేదా మీ కుటుంబం పట్ల ప్రేమ కంటే ఎక్కువ వారిపై అధికారం చెలాయించాలని మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మీపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను నిజాయితీ నిర్వర్తించే వారైతే మీపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. రెండవ ఇంట్లో శని సంచారం ఆర్థికంగా మీలో ఉండే లోపాలను తొలగించి మిమ్మల్ని ఆర్థికంగా పటిష్టంగా చేస్తుంది. ఈ సమయంలో మీరు అతిగా పొదుపు చేయటం కానీ, అవసరానికి తగిన విధంగా డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం కానీ చేస్తే అది మీకు ఖర్చులను పెంచుతుంది. అలాకాకుండా మీ కుటుంబం కొరకు కానీ, అవసరాల కొరకు గాని తగినంత విధంగా డబ్బు ఖర్చు చేస్తే అది మీకు మరింత డబ్బునిస్తుంది తప్ప నష్టాలనివ్వదు.
శని ఇచ్చే ఫలితం ఏదైనా ఆ సమయంలో మన కష్టంలో అనిపించిన భవిష్యత్తులో మన అభివృద్ధికి అది దోహదపడేది తప్ప మనకు చెడు చేసేది కాదు. శనిగోచారం సరిగా లేనప్పుడు మనం శారీరకంగా కష్టపడటం, ఇతరులకు సహాయం చేయటం మరియు అవసరమైన వారికి ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ సాయపడితే శని మనకు ఇచ్చే కష్టం తగ్గుతుంది.
Check February Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read Moreonlinejyotish.com requesting all its visitors to wear a mask, keep social distancing, and wash your hands frequently, to protect yourself from Covid-19 (Corona Virus). This is a time of testing for all humans. We need to be stronger mentally and physically to protect ourselves from this pandemic. Thanks