Details of Kingdom for the year Krodhi
స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగము - ఫలితములు
Telugu Panchang details
Telugu Rashi phalaalu (Rashiphalalu)
తెలుగు వారికి ఉగాది అంటే కొత్త సంవత్సరమనే కాకుండా, ఆ సంవత్సరానికి భవిష్యత్తును, గ్రహస్థితిని మరియు వర్షాలు, గ్రహణాలు తదితరాలను తెలిపే పండగ. ఉగాది రోజు ఉగాది పచ్చడి తినని వారు, పంచాంగం వినని వారు ఎవరు ఉండరు. అలాంటి ఉగాది రాశిఫలాలు మరియు ఇతర వివరాలు మీరు ఇక్కడ చదవ వచ్చు.
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
- కలియుగ శతాబ్దములు – 5125
- శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2095
- శాలివాహన శతాబ్దములు – 19443
- ఫసలీ శతాబ్దములు – 1432– 33
- హిజరీ శతాబ్దములు – 1443 – 44
- శ్రీ రామానుజాబ్దములు – 1007
- క్రీస్తు శకము – 2024 -25
క్రోధి నామ సంవత్సర ఫలము
ఈ క్రోధి నామ సంవత్సరంలో అన్ని రకాల పంటలు బాగా దిగుబడిని ఇస్తాయి. దంపతులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గుతుంది. రాజులకు మరియు అధికారులకు పరస్పర ఘర్షణలు పెరుగుతాయి.
రాజాధి నవనాయక నిర్ణయం
రాజు | చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి | కుజుడు |
మంత్రి | మేష సంక్రమణ దినాధిపతి | శని |
సేనాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
సస్యాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | కుజుడు |
ధాన్యాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | సూర్యుడు |
అర్ఘాధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
మేఘాధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | శుక్రుడు |
రసాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | గురువు |
నీరసాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | కుజుడు |
2024 - 2025 Rasi Phalalu
ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహగమనాలను ఒకసారి పరిశీలిస్తే గురువు మే ఒకటవ తేదీన అంటే చైత్ర బహుళ అష్టమి బుధవారం రోజున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో సంచరించి పాల్గొన్న అమావాస్య రోజున అంటే ఈ సంవత్సరం చివరి రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఈరోజు నుంచి మేష రాశి వారికి ఏల్నాటి శని ప్రారంభం అవుతుంది. రాహువు సంవత్సరం అంతా మీనరాశిలో కేతువు సంవత్సరం అంతా కన్యరాశిలో సంచరిస్తారు.
క్రోధి నామ సంవత్సరంలో తెలుగు నెలలు ప్రారంభ తేదీలు
నెల | ఆరంభ తేదీ |
---|---|
చైత్ర మాసం | 09/04/2024 |
వైశాఖ మాసం | 09/05/2024 |
జ్యేష్ట మాసం | 07/06/2024 |
ఆషాఢ మాసం | 06/07/2024 |
శ్రావణ మాసం | 05/08/2024 |
భాద్రపద మాసం | 04/09/2024 |
ఆశ్వయుజ మాసం | 03/10/2024 |
కార్తీక మాసం | 02/11/2024 |
మార్గశిర మాసం | 02/12/2024 |
పుష్య మాసం | 31/12/2024 |
మాఘ మాసం | 30/01/2025 |
ఫాల్గుణ మాసం | 28/02/2025 |
క్రోధి నామ సంవత్సర గురు, శుక్ర మౌఢ్య వివరములు
శుక్ర మౌఢ్యం
క్రోధి నామ సంవత్సర చైత్ర బ. చతుర్థి, ఆదివారం, తేది. 28.04.2024 రోజున ఉ. 07.37 నుంచి ప్రారంభం
క్రోధి నామ సంవత్సర ఆషాఢ శు. పంచమి, గురువారం, తేది. 11.07.2024 రోజున ఉ. 08.30 లకు సమాప్తం
తిరిగి
క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ బ. చతుర్థి, మంగళవారం, తేది. 18.03.2025 రోజున ఉ. 07.15 నుంచి ప్రారంభం
క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ బ. చతుర్దశి, శుక్రవారం, తేది. 28.03.2025 రోజున ఉ. 06.33 నుంచి సమాప్తం
గురు మౌఢ్యం
క్రోధి నామ సంవత్సర చైత్ర బ. దశమి, శుక్రవారం, తేది. 03.5.2024 రోజున రాత్రి 10.59 నుంచి ప్రారంభం
క్రోధి నామ సంవత్సర వైశాఖ బ. ద్వాదశి, ఆదివారం, తేది. 03.06.2024 రోజున తె. ఝా. 04.18 లకు సమాప్తం
గురు, శుక్ర మౌఢ్య సమయంలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు
గ్రహణముల వివరములు
క్రోధి నామ సంవత్సరంలో భారత దేశములో కనిపించే గ్రహణములేవి లేవు.
2024 - 2025 తెలుగు సంవత్సర రాశి ఫలములు
తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిందూజ్యోతిష్ ఆప్ (8 భాషల్లో జాతకం మొదలైన సేవలు పొందవచ్చు) ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
12 రాశుల ఆదాయ, వ్యయాలు
27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Hindu Jyotish App
The Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App