ఈ అక్టోబర్ 30వ తేదీన రాహువు మేషరాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తులారాశి నుంచి కన్యా రాశిలోకి మారతారు. మీరు ఈ రాశుల్లో మే 18, 2025 వరకు సంచరిస్తారు. చాయాగ్రహాలైన వీరి గోచార ప్రభావం ఆయా రాశులపై ఏవిధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొంత కాలంగా మానసిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న మీకు ఈ గోచారం కొంత ఉపశమనాన్నిస్తుంది. అయితే ఈ సమయంలో ఖర్చులు పెరగడం, మీ ఇష్టంతో ప్రమేయం లేకుండా ప్రయాణాలు చేయాల్సి రావడం జరుగుతుంది. విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఆటంకాలతో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా తొందరపాటుకు గురి కాకుండా ప్రయత్నించడం వలన విదేశీ యాన విషయంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అతి శ్రమ కారణంగా వెన్నెముక మరియు మేడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా లేని రోగాన్ని భయాల్ని శత్రువుల్ని ఊహించుకొని నిద్రకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
ఆరవ ఇంట్లో కేతు గోచారం కొన్ని అనుకూల ఫలితాలతో పాటు ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలను ఇస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో నిర్లక్ష్యం కారణంగా మీ పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. అంతే కాకుండా మీ వృత్తిలో పోటీ దారులు పెరిగారని భయం కారణంగా మీరు మానసికంగా సంఘర్షణకు లోనవుతారు. అయితే ఈ సమస్యలు కేవలం ఆలోచన వరకే పరిమితమవుతాయి తప్ప నిజానికి ఉద్యోగం లో ఇబ్బంది పెట్టే సమస్యలేవీ ఉండవు. మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం వలన మీకు వచ్చే సమస్యల నుంచి బయట పడగలుగుతారు.
పదకొండవ ఇంట్లో రాహు సంచారం అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరగడమే కాకుండా మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు ఫలించి మీరు విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ ఉన్నవారు ఈ సమయంలో వాటిల్లో విజయం సాధిస్తారు. అలాగే సామాజికంగా కూడా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వృత్తిలో కానీ సామాజికంగా కానీ మీరు చేసే పనిలో సాధించిన విజయాల కారణంగా మీరు ప్రజల గుర్తింపు తో పాటు ప్రభుత్వ గుర్తింపును కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి దాని కారణంగా గతంలో చేసిన అప్పుల నుంచి బయటపడతారు.
ఐదవ ఇంటిలో కేతు సంచారం కారణంగా మీరు మంచి ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు. అయితే విలాసాల కారణంగా కానీ లేదా ఇతర అలవాట్ల వల్ల కానీ మీ సృజనాత్మకతకు దూరమవుతారు. ఒక రకంగా మానసికంగా ఒకలాంటి స్తబ్దతకు గురవుతారు. ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో అనుకోని సమస్యలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లల ఆరోగ్య విషయంలో కానీ వారి చదువుల విషయంలో కానీ మీరు సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
రాహువు పదవ ఇంటిలో సంచరించే సమయంలో మీరు మీ వృత్తిలో విజయాలు సాధిస్తారు. అయితే పేరు ప్రతిష్టల కొరకు ఎక్కువగా కష్టపడటం కుటుంబాన్ని కానీ ఇతర విషయాల్ని కానీ నిర్లక్ష్యం చేయడం వలన కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉత్సాహంగా పని చేయడం వలన వృత్తిలో ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పటికీ మీ అహంకారం లేదా ఇతరులను లేదా మీ సహ ఉద్యోగులను తక్కువగా చేసి మాట్లాడటం కానీ, ప్రవర్తించటం కానీ చేస్తారు. ఈ గుణం కారణంగా మీరు సాధించిన విజయాలు చాలామందికి కంటగింపుగా తయారవుతాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఇది మీకు సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ విజయాలకు పొంగిపోకుండా వినయంగా ఉండటం మంచిది. ఈ సమయంలో వృత్తి పరంగా మీరు కొన్ని సవాళ్లను కానీ వివాదాలను కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీటిలో విజయం సాధించినప్పటికీ ఈ వివాదాలు మీరు మానసికంగా ఆందోళనకు గురయ్యేలా చేస్తాయి.
నాలుగవ ఇంటిలో కేతువు గోచారం మీ పని కారణంగా లేదా ఇతర సమస్యల కారణంగా మిమ్మల్ని ఇంటికి దూరం చేస్తుంది. లేదా మీరు మీ కీర్తి ప్రతిష్టల కొరకు కుటుంబాన్ని ఇంటిని మర్చిపోయి పనిచేయడం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దానికి కారణంగా వారితో మనస్పర్థలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఆస్తులకు సంబంధించిన వివాదాల వల్ల కూడా మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. మీరు కొన్న లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తుల విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది కాబట్టి లావాదేవీల విషయంలో రాతకోతల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
తొమ్మిదవ ఇంటిలో రాహు సంచారం కారణంగా ఈ సమయంలో విదేశీ యానంపై ఆసక్తి పెరిగి దాని గురించి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అయితే తొందరపడి సరైన అవకాశం లేకుండా ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదు. అంతేకాకుండా మతం, రాజకీయాలు తదితర విషయాలపై ఎక్కువగా వాద వివాదాల్లో పాల్గొనాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయాలపై మీకున్న జ్ఞానాన్ని, అవగాహనను నలుగురికి తెలియజేయాలని చూస్తుంటారు. అయితే ఈ విషయంలో మిమ్మల్ని మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించే వారితో వితండవాదం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించే ప్రయత్నం చేయండి. పితృ స్థానమైన తొమ్మిదవ ఇంటిలో రాహు సంచారం కారణంగా మీకు మీ తండ్రి కారణంగా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అదే సమయంలో వారితో మనస్పర్థలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. రాహు మనలోని అహంభావాన్ని ప్రేరేపిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు మీ తండ్రి గారితో కానీ, గురువులతో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంత వినయంగా ఉండటం మంచిది.
మూడవ ఇంట్లో కేతు గోచారం కొంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీలో ఉత్సాహం పెరగటం మరియు కొత్త విషయాలను కనుగొనాలని లేదా చేసే పనులను మరింత కొత్తగా చేయాలని ఆలోచన ఎక్కువ అవుతుంది. అయితే దీని కారణంగా మీరు సమయాన్ని వ్యర్థం చేయడం కానీ లేదా మిగిలిన వారితో కమ్యూనికేషన్ తగ్గించుకోవడం కానీ చేయవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ తోబుట్టిన వారితో అపార్థాలు ఏర్పడటం కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధకు గురవడం కానీ జరుగుతుంది. దీని కారణంగా అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలనే ఆలోచన ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు మీరు చేసే ప్రయత్నం సరైన ఫలితం ఇవ్వనప్పుడు నిరుత్సాహానికి గురి కాకుండా తిరిగి ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే కేతువు నిరుత్సాహాన్ని పెంచే గ్రహం కాబట్టి ఆ గ్రహం మాయలో పడకుండా ఉండాలంటే నిరంతరం మనల్ని మనం ప్రేరేపించుకుంటూ ఉత్సాహంగా ఉండాల్సి ఉంటుంది.
రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండే సమయంలో మీరు ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించడం అలాగే ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకోవాలను కోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గొప్పలకు పోయి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంతవరకు డబ్బు అందుబాటులో ఉండకుండా చూసుకోండి. దాని ద్వారా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. అష్టమ స్థానం అవమానాలకు మరియు అప్పులకు కూడా కారక స్థానం కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు కానీ వారసత్వ ఆస్తి వచ్చే సందర్భాలు కానీ ఉంటాయి అయితే వీటితో పాటే నష్టాలు, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు అహంకారానికి లోనవకుండా ఆలోచనతో మెలిగినట్లయితే మిమ్మల్ని మీరు అనవసరమైన సమస్యల నుంచి కాపాడుకోగలుగుతారు.
రెండవ ఇంటిలో కేతు గోచారం కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు మీ ఇంటికి దూరంగా ఉండాలని ఆలోచన పెరుగుతుంది. మీ భావోద్వేగాలను, మీ బాధను మీ కుటుంబ సభ్యులు సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆలోచన కారణంగా మానసికంగా ఒంటరితనానికి గురవుతారు. అయితే కేతువు ఆత్మ న్యూనతకు కారకుడు కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆలోచన అన్నీ కూడా కేవలం తాత్కాలికమే అని గుర్తించండి అంతే కాకుండా ఇవి ఎక్కువ శాతం ఊహాజనితాలని గుర్తించగలిగితే మీరు బాధల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో మీ మాట తీరు విషయంలో అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీటి కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. తక్కువ మాట్లాడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ ఎక్కువగా మీరు చేసే పని పట్ల దృష్టి పెట్టడం మంచిది.
రాహు గోచారం ఏడవ ఇంట్లో ఉండే సమయంలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అనవసర విషయాల కారణంగా వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకరి కంటే ఒకరిది పై చేయి ఉండాలని భావన ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో వీలైనంతవరకు ఎదుటివారి మాటకు ఆలోచనకు విలువ ఇచ్చే ప్రయత్నం చేయటం వలన చాలావరకు సమస్యలు ఆరంభంలోనే ముగిసిపోతాయి. అహంకారానికి తావివ్వకుండా మీరిద్దరూ మెలగడం వలన మీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో కూడా మీ భాగస్వామితో ఈ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఒకరికంటే ఒకరిది పై చేయిగా ఉండాలనే భావన, తన మాటే నెగ్గాలని మొండితనం ఎక్కువ అవటం వలన భాగస్వామ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ శ్రేయోభిలాషుల సలహా సంప్రదింపుల కారణంగా ఈ సమస్యల నుంచి బయట పడగలుగుతారు. రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి దుర్గా ఆరాధన చేయటం లేదా రాహు పూజ చేయడం మంచిది.
ఒకటవ ఇంటిలో కేతు సంచారం కొన్ని విషయాల్లో మంచిని కొన్ని విషయాల్లో చెడును పెంచుతుంది. ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా మీలో ఉన్న తొలగించుకునే అవకాశాలను ఈ సమయం ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు మానసికంగా ఒంటరితనానికి, దిగులుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆలోచన కంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం అలాగే ఎదుటివారిని బాగు చేద్దాం అనే ఆలోచన తగ్గించుకోవడం వలన మీరు మానసిక సమస్యల నుంచి బయట పడగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ గురించి మీ ఆత్మీయుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి ఏ సమస్య లేనప్పటికీ ఏదో ఒక సమస్య ఉందని భయం మీలో ఎక్కువవుతుంది. ఇటువంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయట పడగలుగుతారు. అలాగే గణేశ ఆరాధన చేయటం, కేతు పూజ చేయడం వలన కూడా మీరు కేతు ఇచ్చే చెడు ఫలితాల నుంచి బయట పడగలుగుతారు.
ఆరవ ఇంటిలో రాహు సంచారం కారణంగా ఈ సమయంలో మీరు శత్రువులపై అలాగే పోటీలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం కానీ లేదా లోన్లు రావడం వలన కానీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ సమయంలో అత్యుత్సాహానికి లోను కాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మీ అత్యుత్సాహం మిమ్మల్ని వ్యసనాలకు బానిస చేయడం లేదా మీలో నిర్లక్ష్యాన్ని పెంచడం కానీ చేయవచ్చు. అలాగే మీ ఆహార అలవాట్ల విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీలో సేవాభావం ఎక్కువ అవుతుంది.
12వ ఇంటిలో కేతువు సంచారం మీలో ఆధ్యాత్మికతను పెంచుతుంది. మీరు ఈ సమయంలో ఏకాంతంగా ఉండాలని కోరుకోవడం లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా చేయాలని కోవటం చేస్తారు. కొన్నిసార్లు మీలో నిరుత్సాహం కానీ, ఒంటరితనం కానీ పెరుగుతుంది. మరి కొన్నిసార్లు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయం మీలో ఉండే ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచుకోవడానికి అలాగే దైవ సంబంధ కార్యాలు చేయటానికి మీకు అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ వెళ్లే అవకాశం ఉంటుంది.
వృశ్చికరాశి వారికి ఈ నెల 30 వ తేది నుంచి రాహువు 5వ ఇంటిలో కేతు 11వ ఇంటిలో సంచరిస్తారు.
ఐదవ ఇంటిలో రాహువు ప్రేమ వ్యవహారాల్లో, అలాగే సృజనాత్మకత విషయంలో అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో ప్రేమ ఫలించడం కానీ లేదా నచ్చిన వారితో వివాహం అవటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు కళా రంగంలో కానీ లేదా సృజనాత్మక రంగంలో కానీ ఉన్నట్లయితే అది మీకు మంచి విజయాలను ఇస్తుంది. కొత్త ఆలోచనలు ఫలించి నలుగురి మెప్పు పొందుతారు. అయితే కొన్నిసార్లు మీరు చేసే ఆలోచనలు కానీ, ప్రేమ విషయంలో మీ ప్రవర్తన కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యుత్సాహానికి పోకుండా ఎదుటివారి ఆలోచనలు కూడా అర్థం చేసుకొని మెరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లల విషయంలో నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా వారిపట్ల తగినంత శ్రద్ధను కనబరచాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ నిర్లక్ష్యం కారణంగా వారి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
11వ ఇంటిలో కేతువు మీకు లాభాలను ఇస్తాడు అయినప్పటికీ ఏదో ఒక విషయంలో అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నానికి కానీ పనికి కానీ రావలసినంత ఫలితం రాలేదనే భావన మీకు వచ్చిన లాభాలను కానీ, విజయాలను కానీ పూర్తి స్థాయిలో అనుభవించేలా చేయనివ్వదు. మీ తోబుట్టిన వారితో కానీ, మిత్రులతో కానీ ఈ సమయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీలో ఏర్పడిన ఒంటరితనం అనే భావన వారికి దూరమయ్యేలా చేస్తుంది. అలాగే మీరు అనుకున్నది సాధించాలని భావనతో అతిగా ప్రయత్నించడం వలన కూడా మీరు మీ ఆత్మీయులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు వ్యక్తిగత విషయాలతో పాటుగా కుటుంబ జీవితానికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వటం, సాధించడానికి సంతృప్తిని చెందటం వలన మీలో ఏర్పడే మానసిక సమస్యలు దూరం అవుతాయి.
నాలుగవ ఇంటిలో రాహువు గోచారం కొంత సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శారీరకంగా విపరీతమైన శ్రమ చేయాల్సి రావడం అలాగే కుటుంబంలో సరైన సహకారం లేకపోవడం వలన తెలియని ఆవేశానికి, ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. వాహనాల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ మీలో ఒకరకమైన అత్యాశ ఎక్కువ అవుతుంది. దాని కారణంగా వాటిని సాధించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తల్లి గారితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఉండే ప్రదేశంలో మార్పు కలగడం కానీ లేదా విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ జరుగుతుంది. విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించడం వలన వెన్నెముక మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో వీలైనంతవరకు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వటం అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. పదవ ఇంట్లో కేతువు గోచారం వృత్తి విషయంలో అసంతృప్తిని పెంచుతుంది. మీరు చేస్తున్న పనిలో తృప్తి లేకపోవడం మరియు ఇంకా ఏదో సాధించాలని ఆలోచన పెరగటం వలన మీరు మీ వృత్తిని మార్చాలనుకుంటారు. అయితే మీ పరిస్థితి కారణంగా దానిని మార్చ లేకపోవటం కానీ లేదా మీరు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగం లభించకపోవడం వలన కానీ మీరు అసంతృప్తికి లోనవుతారు. దాని కారణంగా ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో కూడా పై అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. అంతేకాకుండా మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు రావడం లేదని అసహనానికి లోనవుతారు. మీ ఆలోచనలను, చేసే పనిని ఎవరు గుర్తించటం లేదని మీలో మీరే బాధపడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు వృత్తి విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
మూడవ ఇంటిలో రాహు గోచారం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మీలో ధైర్యాన్ని పెంచుతుంది. గత కొద్ది కాలంగా ఉన్న మానసిక ఆందోళనలు దూరమవుతాయి. కొత్తగా ఏదైనా సాధించాలని పట్టుదల, స్ఫూర్తి పెంపొందుతాయి. మీ ఆలోచనలు మీకు విజయాలను అందిస్తాయి. అంతేకాకుండా మీ తోబుట్టువులవల్ల కానీ, ప్రయాణాల వల్ల కానీ మీకు అనుకొని లాభాలు వస్తాయి. మీరు కమ్యూనికేషన్ లేదా రచన వ్యాసంగాల్లో ఉన్నట్లయితే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సేల్స్ మరియు రవాణా రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. గత కొద్ది కాలంగా మీలో ఉండే అసహనం కానీ ఆవేశం కానీ తగ్గుముఖం పడతాయి మరియు ఉత్సాహంగా మీ పనులు మీరు చేయగలుగుతారు. మీతో పాటు నలుగురిని ముందుకు నడిపిస్తారు.
తొమ్మిదవ ఇంటిలో కేతువు సంచారం మీలో ఆధ్యాత్మికతను పెంచుతుంది అదే సమయంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఒకలాంటి అసంతృప్తి కూడా పెరుగుతుంది. మీరు చేసే పూజలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మీకు సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు అనే భావన మీలో ఎక్కువ అవుతుంది. దాని కారణంగా ఇంకా ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలనుకుంటారు కానీ మీకు ఉండే సమయం సరిపోక పోవడం వలన అసంతృప్తికి లోనవుతుంటారు. మీ తండ్రిగారు లేదా గురువుల విషయంలో మీరు వారికి దూరం అవుతున్నారనే భావన ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంత ఆందోళనకు గురవుతారు.
రెండవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీలో ఆర్థిక సంబంధ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అవుతుంది. మీరు ఎలా అయినా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలి ఆర్థికంగా స్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అనే ఆలోచన ఎక్కువవుతుంది. దాని కారణంగా మీరు డబ్బు సంపాదన కొరకు రకరకాల మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబం పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెరగటం లేదా మీకు ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నోరు దంతాలు కండ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే విధానం కూడా అహంకార పూరితంగా ఉండటం వలన మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఆత్మీయులకు కూడా మీరు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు సంపాదనకు కుటుంబానికి తగుపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.
ఎనిమిదవ ఇంటిలో కేతువు సంచారం మీలో నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా మీరు నిర్లక్ష్యం కారణంగా చేసే తప్పులు మీ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండటం మరియు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు చేసే పొరపాట్లు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఈ సమయంలో ఊహలకు, ఆలోచనల కంటే ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది.
ఒకటవ ఇంటిలో రాహు సంచారం కారణంగా మీ జీవితంలో మరియు మానసిక స్థితిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎవరిని లక్ష్యపెట్టని మనస్తత్వం అలవాటు అవుతుంది. మీరు మిగతా విషయాలను వదిలేసి మీరు అనుకున్న పనులు చేయడానికి మీ లక్ష్యాలు సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. దీని కారణంగా మీ కుటుంబాన్ని మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. మీరు మిగతా వారి కంటే ప్రత్యేకంగా ఉండాలని అందరికంటే ముందుండాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. గతంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మిమ్మల్ని ఈ విషయంలో ప్రేరేపిస్తాయి. అయితే విరామం లేకుండా పనిచేయడం వలన మీ ఆరోగ్యం కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నరాలు, మెడ మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు మీ లక్ష్యాలతో పాటుగా మీ కుటుంబానికి, ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించడం తప్పనిసరిగా చేసుకోవడం మంచిది. దాని కారణంగా ఈ సమయంలో మీరు సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
ఏడవ ఇంటిలో కేతువు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో అసంతృప్తి ఏర్పడటం కానీ, సమస్యలు రావడం కానీ జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో మొదలవుతుంది. దాని కారణంగా భార్యాభర్తల మధ్యన అపార్థాలు తలెత్తుతాయి. భార్యాభర్తలిద్దరూ కూడా ఎదుటివారు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావనలో ఉంటారు. వ్యాపారంలో కూడా మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు తమ మాటే నెగ్గాలని భావనలో ఉండి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయడం వలన వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ వ్యాపార భాగస్వామి వ్యాపారం నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అహంకారానికి, మొండితనానికి పోకుండా సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవడం మంచిది.
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.
Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read More