Click here for Vilamba (Vilambi) rashiphal in Telugu (తెలుగు ఉగాది(విలంబ(విలంబి) రాశి ఫలములు) 2018 -19
Click here for Year 2018 Rashiphal (Rashifal)
click here for April, 2018 monthly rashiphal (Rashifal) (Monthly Horoscope) based on your Moon sign
हिंदी जनमपत्री के लिए यहा क्लिक करे
శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.
శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో 20 డిగ్రీలలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో 20 డిగ్రీలలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను,దీర్ఘ కాల రోగులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం,ఉపరత్నాలు ఎమితెస్ట్,ఫిరోజా,లాఫిజ్ . గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.పెద్ద గిన్నెలో నీటిని తీసుకొని శనిగ్రహన్ని నీటిలో వేస్తే తేలుతుంది.ఎందుకంటే ఆగ్రహం సాంద్రత చాలా తక్కువ.తూచి తూచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి తులారాశి ఉచ్చ స్థానం అయింది.దశా కాలం;- 19 సంవత్సరాలు..
సాదారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది.గోచారంలో జన్మ రాశికి వ్యయంలోను,జన్మ రాశిలోను,జన్మరాశికి ద్వితీయంలోను శని గ్రహ సంచారం జరుగుతుంటే దానిని ఎలిన నాటి శని కాలం అంటారు.ప్రతి రాశిలోను 2 సంవత్సరాల 6నెలల చొప్పున మొత్తం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశా కాలంలో, చతుర్ధంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అని,అష్టమంలో శని సంచారాన్ని అష్టమశని అని అంటారు.ఈ సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి , మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు..
ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం,చొంగకార్చుట, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు,సన్యాసులు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెంట్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు.భవిష్యత్ చెప్పువారికి శని అవసరం చాలా వుంది.ఇంగ్లీష్ భాషను సూచించును.ఇంగ్లీష్ భాషను సూచించును.రిక్షా తొక్కేవారు,ఇతరులను మోసం చేసేవారు,విష ప్రయోగాలు చేసేవారు,వేదాంత విజ్ఙానం చేసేవారు,చీకటిని,రహస్యాన్ని,క్రమశిక్షణని,అవినీతి,అశుభ్రత శని కారకాలు.శుక్ర దశాభుక్తులలో శని రాజునయినను బిక్ష్కకునిగా మారుస్తుంది.కుటుంబ బంధాలపై తగువుపెట్టి వ్యక్తిని ఒంటరిని చేసి తపస్సుకు దారి తీస్తుంది.కర్మబలంచే శని మనల్ని భ్రష్టు పట్టించిన ఆత్మజ్ఞానాన్ని,స్వయంప్రకాశిక శక్తిని ఇచ్చి ఉన్నత ప్రమాణాలను,విలువలను ఇస్తాడు.శని కుజుల కలయిక వలన పూర్వజన్మలో అనేక నీచ దుష్కర్మలు చేసిన వాడై ప్రస్తుత జన్మలో ఘోరాలు చేస్తాడు.రాహువు శని కలయిక వలన ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళి పతనానికి దారితీస్తాడు..
శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాదులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాదులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాదులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరోచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు..
జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు.రిక్షాకార్మికులు,బరువులు మోయువారు,తోలు పరిశ్రమలు,గనులు,చేతబడి,క్షుద్ర ప్రయోగాలు చేసే వారిని శని సూచిస్తాడు.
శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం సమస్యలకు పరిస్కారంగా చేయాలి. శని క్షేత్రాలయిన తిరునల్లారు, శని సింగినాపురం లాంటి క్షేత్ర దర్శనం. శ్రీకూర్మ దేవాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం. ఉదయాన్నే ప్రాణాయామం,యోగా,మెడిటేషన్,తపస్సు,దేవాలయ ప్రధక్షణలు,వాకింగ్ చేయటం మంచిది.నల్ల కుక్కకు ఆహారం పెట్టటం,చీమలకు తేనె పెట్టటం,ముసలి వారికి సేవచేయటం,భిక్షకులకు దానం చేయటం.శని వారం రోజు ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించి వేడి నీటితో స్నానం చేయటం మంచిది.నీలం రత్నాన్ని గాని ఉపరత్నాలు గాని వాడాలి.సప్తముఖి రుధ్రాక్ష గాని,చతుర్ధశ ముఖి రుద్రాక్షని గాని వాడాలి.పూర్వజన్మ పాపాలు పోవాలంటే శ్రీదక్షిణకాళికాదేవిని పూజించాలి. 19 శనివారాలు ఉపవాసం ఉండటం మంచిది.ఆవాలు కలిపిన పెరుగన్నం గేదెలకు పెట్టాలి.పిల్లలకు నువ్వులౌండలు పంచి పెట్టాలి.గోదుమపిండితో చేసిన చిన్న చిన్న ఉండలను చేపలకు ఆహారంగా వేయాలి.కాకులకు అన్నం తినేముందు ఆహారం పెట్టాలి. శని యంత్రానికి పూజ చేయాలి.గుర్రపు నాడాను ఇంటికి తగిలించాలి.గుర్రపు నాడా రింగ్‌ని గాని స్టీల్ రింగ్ గాని మద్య వ్రేలుకి ధరించాలి.ఎమితెస్ట్ పిరమిడ్‌ని రాత్రి పూట కాపర్ చెంబులో వేసుకొని ఉదయం పూట ఆ నీటిని త్రాగాలి.
Analysis of birth chart of couple for compatibility and suggestions and remedies for better married life.
Read more...
Daily panchanga service which tells accurate rashi, nakshatra, tithi, rahu kala, varjyam, durmuhurta and many more..
Read more...
Want to know what Lalkitab telling about you and find suitable remedies..
Read more...
Connect with onlinejyotish.com for more updates
Note! onlinejyotish.com uses cookies like many other websites to improve user experience. By using our website you consent to all cookies in accordance with our Cookie Policy. Read more..
No!
Namaste!This website is designed and developed by an Astrologer not by a programmer so if you find any errors/ bugs in my website or in Android and windows mobile apps please do inform me by sending a mail to admin@onlinejyotish.com . I will try my level best to give you accurate Astrology programmes and predictions.