OnlineJyotish.com

రచన: సంతోష్ కుమార్ శర్మ గొల్లపెల్లి (జ్యోతిష్య పండితులు) | ప్రచురణ: ఆన్‌లైన్ జ్యోతిష్
చంద్ర గ్రహణ దోష నివారణ: శాస్త్రోక్త దానాలు మరియు శివాభిషేక పరిహారాలు
గ్రహణ శాంతి కోసం ఉపయోగించే పరిహార సామగ్రి

నమస్కారం. ఆన్‌లైన్ జ్యోతిష్ (onlinejyotish.com) కు స్వాగతం. గ్రహణం అనగానే మనందరికీ కొంత ఆందోళన కలగడం సహజం. ఈ రోజు ఏర్పడుతున్న చంద్ర గ్రహణం సింహ రాశి మరియు పుబ్బ (పూర్వ ఫల్గుణి) నక్షత్రంలో సంభవిస్తోంది. ఈ గ్రహణ ప్రభావం అందరిపై, అన్ని రాశులపై ఒకేలా ఉండదు. కొందరికి ఇది ఎంతో శుభం కలిగిస్తే, మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. మీ రాశికి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంది? ఒకవేళ దోషం ఉంటే మన పూర్వీకులు సూచించిన విధంగా ఎలాంటి పరిహారాలు (దానాలు) చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గ్రహణ సమయంలో వివిధ రాశుల ఫలితాలు (జ్యోతిష్య సలహా)

గ్రహణ సమయ రాశి ఆధారంగా, 12 రాశుల వారి ఫలితాలను మూడు రకాలుగా విభజించవచ్చు. దీన్ని చదువుతున్నప్పుడు మీ రాశి ఫలితాన్ని బట్టి ఏ పరిహారం చేయాలో గమనించగలరు:

  • శుభ ఫలితం: మిథున (3వ స్థానం), తుల (11వ స్థానం), వృశ్చిక (10వ స్థానం), మీన (6వ స్థానం) రాశుల వారికి ఈ గ్రహణం అత్యంత శుభప్రదం. వీరికి గ్రహణ దోషం ఏమీ లేదు.
  • సామాన్య ఫలితం: మేష (5వ స్థానం), కర్కాటక (2వ స్థానం), ధనుస్సు (9వ స్థానం), కుంభ (7వ స్థానం) రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మంచిది.
  • అధమ ఫలితం: వృషభ (4వ స్థానం), సింహ (1వ స్థానం అనగా జన్మరాశి), కన్య (12వ స్థానం), మకర (8వ స్థానం) రాశుల వారు కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా గ్రహణ శాంతి మరియు దానాలు ఆచరించవలెను. ముఖ్యంగా పుబ్బ నక్షత్రం వారు శాంతి నిర్వహించుకోవాలి.

గ్రహణ శాంతి ఎలా చేసుకోవాలి? (శాస్త్రోక్త పరిహారం)

గ్రహణం వల్ల అధమ మరియు సామాన్య ఫలితాలు ఉన్న రాశుల వారు, గ్రహణం పూర్తయ్యాక ఆరోజు లేదా మరుసటి రోజు ఉదయం (తెల్లవారి) దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేయాలి. నది అందుబాటులో లేనివారు ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేసి, ఈ క్రింది విధముగా దాన ధర్మాలు ఆచరించాలి:

  • ఒక రాగి, స్టీలు లేదా కంచు పాత్రను తీసుకుని, అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి.
  • ఆ గిన్నెలో వెండితో చేసిన చంద్రుని ప్రతిమను, అలాగే వెండి (లేదా బంగారంతో) చేసిన కేతువు/నాగ ప్రతిమలను ఆ ప్రతిమలు మునిగేలా నేతిలో ఉంచాలి.
  • ఈ దానంతో పాటు మీ శక్తి కొలదీ (శక్త్యానుసారం/యథాశక్తి) బియ్యం, వస్త్రం, కొబ్బరికాయ, తాంబూల దక్షిణలను కూడా ఒక సత్ బ్రాహ్మణుడికి దానం చేయాలి.
  • గ్రహణం కారణంగా కేతువు లేదా రాహువు ప్రభావం ఉంటుంది కాబట్టి, రాహు ప్రీతికరమైన మినుములను లేదా కేతు ప్రీతికరమైన ఉలవలను దానంలో తప్పక చేర్చాలి.

దాన సంకల్పం మరియు మంత్రం

దానం చేసేటప్పుడు మనసులో భక్తి శ్రద్ధలతో ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి:

"మమ జన్మ రాశి, జన్మ నక్షత్ర, చతుర్థాద్యరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే"

ఆ తరువాత ఈ శ్లోకము చదువుతూ దాన పాత్రను బ్రాహ్మణునికి ఇవ్వాలి:

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన ।
హేమతారా ప్రదానేన మమ శాంతిప్రదో భవ ॥

విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత ।
దానేనానేన నాగస్య రక్షమాం వేధజా ద్భయాత్ ॥

ప్రత్యామ్నాయ సులభ పరిహారం (అందరికీ ఆచరణ యోగ్యమైనది)

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, పైన చెప్పిన విధంగా వెండి ప్రతిమలు చేయించి, నెయ్యితో కూడిన దాన సామగ్రిని సమకూర్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన ధర్మశాస్త్రాలు భక్తికి పెద్దపీట వేశాయి.

మీకు తోచినంత దక్షిణ (యథాశక్తి దక్షిణ) సమర్పించి, దగ్గర్లోని శివాలయంలో పరమశివునికి స్వయంగా లేదా పూజారి ద్వారా అభిషేకం చేయించుకోండి. సమస్త దోషాలను, భయాలను పోగొట్టే శక్తి లయకారుడైన ఆ మహాదేవుడికి మాత్రమే ఉంది. ఇలా మనస్ఫూర్తిగా శివాభిషేకం చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి, మీ కుటుంబానికి విశేషమైన శుభ ఫలితాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.



పదకోశం మరియు తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

గ్రహణం అధమ ఫలితం మరియు సామాన్య ఫలితం ఉన్నవారు గ్రహణం పూర్తయ్యాక ఆరోజు లేదా తెల్లవారి దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి దానం చేయాలి (నది దగ్గర్లో లేని వారు ఇంట్లోనే స్నానం చేయాలి).

ఆర్థిక స్థోమత లేనివారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీకు తోచినంత దక్షిణ (యథాశక్తి) ఇచ్చి దగ్గర్లోని శివాలయంలో శివాభిషేకం చేయించుకుంటే గ్రహణ దోషం తొలగిపోతుంది.

గ్రహణ ప్రభావం వల్ల ఆయా రాశుల వారికి ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య లేదా మానసిక ఇబ్బందులను అధమ ఫలం అంటారు. అందుకే వీరికి పరిహారం తప్పనిసరి.

Vedic Astrology/ Vastu/ Hindu Culture Articles: A Comprehensive Library

Lunar Eclipse Article for people living in US & Canada

Lunar Eclipse Article for people living in India


Horoscope

Free Astrology

మీ దైవిక సమాధానం కేవలం ఒక క్షణం దూరంలో ఉంది

మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, మీరు విశ్వాన్ని అడగాలనుకుంటున్న ఒక స్పష్టమైన ప్రశ్నపై దృష్టి పెట్టండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, దిగువ బటన్‌ను నొక్కండి.

వెంటనే మీ సమాధానం పొందండి
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Hindu Jyotish App

image of Daily Chowghatis (Huddles) with Do's and Don'tsThe Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App

Free KP Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free KP horoscope.


పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.