దృవ నక్షత్రాలు:-ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు.స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి.నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా: -గృహ నిర్మాణం, ఉద్యోగం.
చర నక్షత్రాలు:-స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష నక్షత్రాలు చర నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, వివాహం, గృహారంభం, నూతన కార్యములు.
ఉగ్ర నక్షత్రాలు:-భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు మంచిది కాదు.ఆయుధాల ప్రయోగానికి, మందులు తయారు చేయటానికి పనికి వస్తాయి.
మిశ్రమ నక్షత్రాలు:-విశాఖ, కృత్తిక నక్షత్రాలు.ఇవి మిశ్రమ నక్షత్రాలు. ఇవి యజ్ఞ క్రియలు, దేవాలయ కార్యములు చేయుటకు మంచివి.నిప్పు, బాంబులు, పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది.
క్షిప్ర నక్షత్రాలు:-అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు.విద్యారంభానికి, అమ్మకాలకి, ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి, వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి.
మృదు నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ నక్షత్రాలు మృదునక్షత్రాలు. ఇవి లలిత కళలు, స్నేహం చేయటానికి , నూతన వస్త్రాలు కొనటానికి, దరించటానికి, దౌత్య కార్యాలకు, వివాహములకు మంచిది.
దారుణ నక్షత్రాలు:-మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, ఆరుద్ర నక్షత్రాలు దారుణ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు హింస, దొంగతనం, ఆందోళన కార్యములకు, ఎదుటివారిని జయించటానికి, తాంత్రిక విద్యలకు, చేతబడులు చేయటానికి, ఇతరులపైన ప్రభావం చూపటానికి పనికి వస్తాయి.
ఊర్ధ్వముఖ నక్షత్రాలు:-ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రోహిణి, ఉత్తరాత్రయ నక్షత్రాలు వీటి దృష్టి ఆకాశం వైపుకు ఉంటుంది.కాబట్టి రాచ కార్యాలకు, వ్యవహారాలకు, గృహప్రవేశాలకు, దనుర్విద్యలకు,విమాన చోదనం,గృహ నిర్మాణం, విత్తనాలు చల్లుటకు, దేవాలయ నిర్మాణాలు, రాకెట్ ప్రయోగాలకు మంచివి.
అధోముఖ నక్షత్రాలు:-మూల, ఆశ్లేష, విశాఖ, కృత్తిక, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాబాద్ర నక్షత్రాలు వీటి దృష్టి క్రింది వైపుకు ఉంటుంది.బావులు త్రవ్వటానికి, నాగలి పట్టుటకు, పునాదులు త్రవ్వటానికి పనికి వస్తాయి.
తిర్యఙ్మఖ నక్షత్రాలు:-మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్విని, జ్యేష్ఠ ఇవి రోడ్లు వేయుటకు, ముందుకు సాగే వాటికి, ద్వజ స్తంభ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠలకు మంచిది.
పంచక నక్షత్రాలు:-ధనిష్ఠ, స్టాభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, శుభకార్యాలకు మంచిది.క్రూర కర్మలు ప్రారంభించుటకు, సాహస కార్యములకు ఈ నక్షత్రాలు పనికి రావు.
గండ నక్షత్రాలు:-ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్వని నక్షత్రాలలో శిశువు జన్మించిన విశేషంగా గ్రహ శాంతులు చేయవలెను.
Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read More