Hindu Jyotishమీ జ్యోతిష మార్గదర్శి TE
OnlineJyotish.com

శ్రీ కాళహస్తి దేవాలయ వివరములు - ప్రాశస్థ్యం, Astrology Articles - Om Sri Sai Jyotisha Vidyapeetham

శ్రీ కాళహస్తి దేవాలయ వివరములు - ప్రాశస్థ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది. క్షేత్ర చరిత్ర/ స్థలపురాణం: ఇక్కడ కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటికేడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం... ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ మూడు జీవులు ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది! ఆలయ దర్శన వేళలు: ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!

నిత్యసేవలు/ ప్రధాన పూజలు:



రోజూ ఉదయం 4.30 గంటలకు: మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ.
* ఉదయం. 5.45, ఉదయం 6.45, ఉదయం 10 గంటలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కాల అభిషేకాలు. ద్వితీయ కాల అభిషేకానంతరం నిత్యోత్సవం, నిత్యకల్యాణం, చండీ, రుద్రహోమాలు. శనేశ్వరునికి విశేష పూజలు. అభిషేకాలు.
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాహు, కేతుసర్పదోష నివారణ పూజలు.
* సాయంత్రం 5 గంటలకు ప్రదోష కాల అభిషేకం
* సాయంత్రం 6.30 గంటలకు షోడశోపచార నివేదన
*రాత్రి 9.30 ఏకాంతసేవ
ఆర్జిత సేవల రుసుములు: సుప్రభాత సేవ రూ.50, గోమాత పూజ రూ. 50,
అర్చన రూ. 25,
సహస్ర నామార్చన రూ. 200,
త్రిశతి అర్చన రూ. 125,
సోమవారం ప్రదోష కాల సమయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రూ. 1,500,
క్షీరాభిషేకం రూ. 100,
పచ్చకర్పూర అభిషేకం (స్వామివారికి) రూ. 100,
రుద్రాభిషేకం రూ. 600,
పంచామృత అభిషేకం రూ. 300,
నిత్యదిట్ట అభిషేకం రూ. 100,
శనేశ్వర అభిషేకం రూ. 150,
అఖండ దీపారాధన రూ. 50,
ప్రత్యేక ప్రవేశం రూ. 50,
నిత్యోత్సవం రూ. 58,
నిత్య కల్యాణోత్సవం రూ. 501,
రుద్రహోమం రూ. 1116,
చండీహోమం రూ. 1116,
అష్టోత్తర స్వర్ణ కమల పుష్పార్చన( ప్రతి శుక్రవారం) రూ. వెయ్యి,
ప్రత్యేక ఆశీర్వచనం రూ. 500,
సాధారణ సర్పదోష పూజలు రూ. 300
ప్రత్యేక సర్పదోష నివారణ రూ. 750,
ఆశీర్వచన, సర్పదోష నివారణ రూ. 1,500,
ప్రత్యే ఆశీర్వచనం, సర్పదోష నివారణ రూ. 2,500
(ప్రొటోకాల్‌ మేరకు మాత్రమే), ఏకాంత సేవ రూ. 100.
వాహనపూజలు(పెద్దవి) రూ. 25( చిన్నవి) రూ. 20.



భక్తులకు ఇచ్చే బహుమానాలు..

ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టు గుడ్డ, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది ఆలయం తరఫున అందజేస్తారు. పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.
నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడ... చండీ, రుద్రహోమాలు చేయించిన వారిని ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు. వసతి.. రవాణా సౌకర్యం: విజయవాడ-రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి క్షేత్రం వుంది. రైలు.. రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ప్రతి 15 గంటలకో సర్వీసు చొప్పున బస్సులు ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి నేరుగా బస్సు సౌకర్యముంది. సమీపంలోని రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది. ఇక ఇక్కడకు శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాల్లో అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి.

ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు... ముందస్తు బుకింగ్‌ల కోసం... 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

by
Rama Chandra Rao Akula

Vedic Astrology/ Vastu/ Hindu Culture Articles: A Comprehensive Library

Past event timings, year-specific festival guides and historical one-time articles are kept here for reference.

2026 and recent one-time articles

2025 and earlier one-time articles


Horoscope

Free Astrology

సమాధానం దొరకని ప్రశ్న ఉందా? తక్షణమే సమాధానం పొందండి.

ప్రశ్న జ్యోతిషశాస్త్రం యొక్క ప్రాచీన సూత్రాలను ఉపయోగించి, కెరీర్, ప్రేమ, లేదా జీవితం గురించి మీ అతి ముఖ్యమైన ప్రశ్నలకు తక్షణ దైవిక మార్గదర్శకత్వం పొందండి.

వెంటనే మీ సమాధానం పొందండి
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Free KP Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free KP horoscope.

Hindu Jyotish App

image of Daily Chowghatis (Huddles) with Do's and Don'tsThe Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App


పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.