సూర్య గ్రహణం- ఏ రాశివారు ఏ విధంగా పూజా, సంకల్పం చేయాలి

సూర్య గ్రహణం - సంకల్పము



ఈనెల 26న కేతు గ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తున్నది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనదేశంలో నివసించేవారు గ్రహణానికి సంబంధించిన కొన్ని ఆచారవ్యవహారాలను పూజలను నియమాలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టి వేరే దేశంలో అంటే ఈరోజు గ్రహణం సంభవించని దేశాల్లో ఉన్నవారు ఏ రకమైన నియమాలు పాటించడం అవసరం లేదు. ఈ గ్రహణం ధనురాశిలో మూలా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ధను రాశిలో జన్మించిన వారు వారికి జన్మరాశిలో గ్రహణం కాబట్టి వారు, మకర రాశి జన్మించిన వారికి పన్నెండవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు, కన్య కన్య రాశి వారికి నాలుగవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు అలాగే వృషభ రాశి వారికి ఎనిమిదవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. వారు ఈ గ్రహానికి సంబంధించి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మిగతా అన్ని రాశుల వారు గ్రహణం చూడవచ్చు. గురుముఖతః మంత్రోపదేశం పొందిన వారు గ్రహణ సమయంలో ఆ మంత్ర జపం చేయటం మంచిది. పైన చెప్పిన ధను రాశి వారు, మకర రాశి వారు, కన్య రాశి వారు, అలాగే వృషభ రాశి వారు గ్రహణం అయ్యాక అంటే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. అది అయ్యాక స్నానం చేసి వెండి లో సర్ప కారము అంటే పాము బొమ్మ అలాగే సూర్యుడి ఆకారము అంటే సూర్యుడు బొమ్మ ఒక రాగి గిన్నెలు రాగిణి దొరకని వారు స్టీలు గిన్నెలో ఈ సూర్యుడి బొమ్మ మరియు పాము బొమ్మ వేసి అవి మునిగేలా నెయ్యి పోసి నదీతీరం దగ్గరలో ఉన్న వారు నదిలో స్నానం చేసి అది దగ్గర్లో లేనివారు ఇంట్లో స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ బ్రాహ్మణులతో సంకల్పం చేపించుకొని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణులు అందుబాటులో లేని సందర్భంలో కింద ఇచ్చిన విధంగా సంకల్పం చేసుకుని అవి దానం చేయాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి వారు :
మమ జన్మ రాశి వశాత్, జన్మస్థానే ( మీది మూలా నక్షత్రం అయితే ఈ వాక్యం కూడా చదవాలి - తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే) సంభవిత కెేతు గ్రస్త త్రిపాదాధిక సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం. ఆజ్య పూరిత కాంస్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష రజత జ్యోతి సహిత సౌర బింబదానమహం కరిష్యే

వృషభ రాశివారు:
మమ జన్మరాశివశాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే సంభవిత కెేతు గ్రస్త త్రిపాదాధిక సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం. ఆజ్య పూరిత కాంస్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష రజత జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
కన్యా రాశి వారు:
మమజన్మ రాశి వశాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే సంభవిత కెేతు గ్రస్త త్రిపాదాధిక సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం. ఆజ్య పూరిత కాంస్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష రజత జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
మకర రాశి వారు:
మమజన్మ రాశి వశాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే సంభవిత కెేతు గ్రస్త త్రిపాదాధిక సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం. ఆజ్య పూరిత కాంస్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష రజత జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
మిగతా రాశుల్లో జన్మించిన వారు కూడా ఈ గ్రహణం అయ్యాక నదీ స్నానం చేయటం మంచిది. ఒకవేళ నదీ తీరం దగ్గర్లో లేనివారు ఇంట్లో స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
ఈ గ్రహణం ఉదయం ఎనిమిది గంటల 9 నిమిషములకు ప్రారంభమై 11 గంటల 11 నిమిషాలకు ముగిస్తుంది. భోజనాలు 25వ తేదీ రాత్రి 8 లోపు అంటే 12 గంటల ముందు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనారోగ్య పీడితులు పిల్లలు గర్భిణీలు రాత్రి పది లోపు భోజనం చేయాల్సి ఉంటుంది. తిరిగి గ్రహణం అయ్యాక భోజనం చేయాలి. ఇది చదవండి - డిశంబర్ 26, 2019 సూర్య గ్రహణం వివరములు New

Astrology Articles

General Articles

English Articles



Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  


Be true to yourself, your personality is your greatest asset.