December 2019 Surya grahan, సూర్యగ్రహణం - ఫలితములు


Click here for Year 2020 Rashiphal (Rashifal) in English, हिंदी
Click here for January, 2020 Monthly Rashifal in English, हिंदी, తెలుగు
Check Today's Panchang in English, हिंदी, मराठी, ગુજરાતી and తెలుగు, ಕನ್ನಡ New.
Newborn Astrology. Rashi, Nakshatra, Naming letters and birth doshas. Available in English, हिंदी and తెలుగు.


ఆయా రాశుల పై సూర్య గ్రహణ ప్రభావము - ఫలితములు

ఈనెల 26వ తేదీ అంటే డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతు గ్రస్త కంకణ ఆకార సూర్య గ్రహణం సంభవిస్తున్నది. గ్రహణ సమయాలు ఒకసారి పరిశీలిస్తే భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మధ్యకాలం ఉదయం తొమ్మిది గంటల 31 నిమిషములకు, మోక్ష కాలం ఉదయం 11:11 నిమిషములకు అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ఇది ధనుస్సురాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని జన్మరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిది. అంటే గ్రహణ సమయం లో ఉండే చెడు కిరణాలకు దూరంగా ఉండటం, అంతే తప్ప టీవీలోనూ మొబైల్లో గ్రహణాన్ని చూడకూడదని కాదు. మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదు. ఇక్కడ గ్రహణ ప్రభావం అంటే అనుకూల ఫలితాలు లేకుండా ఉండడం తప్ప ఏదో చెడు జరుగుతుంది మరేదో కీడు సంభవిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ గ్రహణం అయినా దాని ప్రభావం అనేది చాలా తక్కువ పాళ్లు మాత్రమే మనపై ఉంటుంది. అంతే తప్ప దీని కారణంగా ఏదో ఆపద వస్తుందని, సమస్యలు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. సూర్యుడు వ్యక్తిత్వానికి, సాత్విక గుణానికి కారకుడు. రాహువు అహంకారానికి, తమోగుణానికి కారకుడు ఈ రెండింటి కలయిక మనిషి వ్యక్తిత్వం పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో చెడు స్థానాల్లో గ్రహణం సంభవిస్తున్న వారు చూడకూడదని మన పూర్వీకులు సూచించారు. అయితే ఈ ప్రభావం అనేది చాలా తక్కువ శాతం మాత్రమే మనపై ఉంటుంది ఎందుకంటే ఏ వ్యక్తి పైన అయినా కూడా అతను పుట్టిన సమయానికి ఉన్న జాతక ప్రభావం అనేదే ఎక్కువ ఉంటుంది తప్ప గ్రహణ ప్రభావం కాదు, అది జీవితాన్ని ప్రభావితం చేయదు.

ఇప్పుడు ఈ సూర్యగ్రహణం యేయే రాశులకు అనుకూల వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో ఒకసారి పరిశీలిద్దాం.
మేష రాశి వారికి ఈ గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది వీరికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తొమ్మిదో స్థానం భాగ్య స్థానం అలాగే ఆధ్యాత్మికతకు కారకత్వం వహించటం వలన ఈ స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన పెరగటం ప్రతి దానికి ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరగవచ్చు. ఆధ్యాత్మికత తగ్గటం మొదలైన ఫలితాలు ఉంటాయి.

వృషభ రాశి వారికి 8వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వలన అలాగే పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు పోకుండా ఉండటం వలన సమస్యల నుంచి దూరం కావచ్చు.

మిధున రాశి వారికి ఈ గ్రహణం ఏడవ ఇంట్లో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి అలాగే వ్యసనాలకు కారకత్వం వహిస్తుంది. సూర్య గ్రహణం వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి, వైవాహిక జీవితంలో కానీ వ్యాపార భాగస్వామ్యాలు కానీ అనవసర అహంకారానికి పట్టుదలకు పోకుండా ఉంటే ఈ గ్రహణ ప్రభావం మీపై ఏ విధమైన చూపించదు. అలాగే పట్టుదలకు పోయి వ్యసనాలకు దగ్గర కాకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించు కోవడం మంచిది

కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఆరవ ఇంట సంభవిస్తుంది. ఇది అనుకూల స్థానం కాబట్టి ఈ రాశి వారికి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ ఉన్నట్లయితే వాటినుంచి బయటపడే అవకాశం మెరుగవుతుంది అలాగే వృత్తిలో కూడా కొంత అనుకూల ఫలితాలు ఏర్పడుతుంది.

సింహ రాశి వారికి ఈ గ్రహణం పంచమ స్థానంలో సంభవిస్తున్నది. పంచమ స్థానం బుద్ధికి, సంతానానికి అలాగే మనలోని సృజనాత్మకతను కారకత్వం వహిస్తుంది. ఈ గ్రహణం కారణంగా మీ సంతానంతో సరైన అవగాహన ఉండకపోవటం లేదా మీ అహంకారం కారణంగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం లాంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

కన్య రాశి వారికి ఈ గ్రహణం నాలుగవ ఇంట సంభవిస్తుంది. చతుర్ధ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు కారకత్వం వహిస్తుంది. ఇది కొంత వ్యతిరేక స్థానంలో ఉన్న స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో వాహన కొనుగోలు విషయాల్లో ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే బద్ధకానికి అలసత్వానికి ఇవ్వకుండా ఉండటం వలన గ్రహణం చెడు ఫలితాలను తగ్గించుకో గలుగుతారు.

తులా రాశి వారికి ఈ గ్రహణం మూడవ సంభవిస్తుంది. ఇది ఇది అనుకూల స్థానం అవటం వలన ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం సాధించడం అలాగే మానసికంగా శారీరకంగా అనుకూలంగా ఉండటం మొదలైన ఫలితాలు సంభవిస్తాయి

వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం రెండవ ఇంట సంభవిస్తున్నది. ద్వితీయ స్థానం ధనానికి కుటుంబానికి మాటకు కారకత్వం వహిస్తుంది. కాబట్టి గొప్పలకు పోయి డబ్బులు కానీ మాటక ఇచ్చి తర్వాత బాధ పడకుండా ఉండటం మంచిది అలాగే కుటుంబ సభ్యులతో అనవసర వాదాలకు దూరంగా ఉండండి.

ధను రాశి వారికి ఈ గ్రహణం ఒకటవ ఇంట సంభవిస్తున్నది. దీని కారణంగా అహంకారానికి తొందరపడి తనానికి లోనయి మీకు చెడు చేసే నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పనులు చేయటం చేస్తారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా లేదా ఏ పని చేసే ముందు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయడం మంచిది.

మకర రాశి వారికి ఈ గ్రహణం 12 పన్నెండవ ఇంట సంభవిస్తున్నది. ఈ స్థానం ఖర్చులకు విదేశీ యానానికి అలాగే ఆరోగ్య సమస్యలకు కారకత్వం వహిస్తుంది. ఈ రాశివారు ఖర్చుల విషయంలో పెట్టుబడుల విషయంలో తొందరపాటు పోకుండా ఆలోచించి అడుగు వేయడం మంచిది అలాగే ఆరోగ్య విషయంలో నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వలన సమస్యలకు దూరం అవొచ్చు

కుంభ రాశి వారికి ఈ గ్రహణం 11వ ఇంట సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం కావటం వలన అనుకూల ఫలితాముంటాయి. దీని కారణంగా ఆర్థిక సమస్యలు దూరం అవ్వటం, దూరమైన మిత్రులు బంధువులు దగ్గరవటం మొదలైన శుభఫలితాలుంటాయి.

మీన రాశి వారికి ఈ గ్రహణం పదవ ఇంట సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి పేరు ప్రతిష్టలకు కారకత్వం వహిస్తుంది. ఈ జాతకులకు వృత్తి పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ పై అధికారులతో అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా అలాగే పేరు కోసం కాకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఇది చదవండి - డిశంబర్ 26, 2019 సూర్య గ్రహణం విధి, విధానములు New
Newborn Astrology

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Telugu Panchangam

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More