నవంబర్ 8 తేదీన సంభవించే చంద్రగ్రహణం ఏ రాశి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో రెండోది మరియు చివరిది అయిన చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన సంభవిస్తున్నది.
ఈ సంవత్సరం కార్తీక శు. పూర్ణిమ, మంగళవారం రోజున భరణీ నక్షత్రములో, మేష రాశిలో రాహు గ్రస్త చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 02:39 నుంచి సాయంత్రం 06:19 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం 02:39 అయినప్పటికీ సూర్యాస్తమయం తర్వాతే పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఇక్కడ భారతదేశంలోని వివిధ పట్టణాలతో పాటు ప్రపంచంలో ఈ గ్రహణం కనిపించే పట్టణాల గ్రహణ సమయాలతోపాటు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చంద్రగ్రహణం ఉత్తర మరియు తూర్పు ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.
భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.
రాష్ట్రం / రాజధాని | సూర్యాస్తమయం | ముగింపు సమయం |
---|---|---|
ఆంధ్రప్రదేశ్/ అమరావతి | 05:32 PM | 06:19 PM |
అరుణాచల్ ప్రదేశ్/ ఇటానగర్ | 04:25 PM | 06:19 PM |
అస్సాం/ డిస్పూర్ | 04:34 PM | 06:19 PM |
బీహార్/ పాట్నా | 05:01 PM | 06:19 PM |
ఛత్తీస్ గఢ్/ రాయ్ పూర్ | 05:21 PM | 06:19 PM |
గోవా/ పనాజీ | 06:00 PM | 06:19 PM |
గుజరాత్/ గాంధీనగర్ | 05:54 PM | 06:19 PM |
హర్యానా/ చండీగఢ్ | 05:27 PM | 06:19 PM |
హిమాచల్ ప్రదేశ్/ సిమ్లా | 05:24 PM | 06:19 PM |
జార్ఖండ్/ రాంచీ | 05:04 PM | 06:19 PM |
కర్ణాటక/ బెంగళూరు | 05:48 PM | 06:19 PM |
కేరళ/ తిరువనంతపురం | 05:56 PM | 06:19 PM |
మధ్యప్రదేశ్/ భోపాల్ | 05:35 PM | 06:19 PM |
మహారాష్ట్ర/ ముంబై | 05:59 PM | 06:19 PM |
మణిపూర్/ ఇంఫాల్ | 04:27 PM | 06:19 PM |
మేఘాలయ/ షిల్లాంగ్ | 04:34 PM | 06:19 PM |
మిజోరాం/ ఐజ్వాల్ | 04:34 PM | 06:19 PM |
నాగాలాండ్/ కోహిమా | 04:25 PM | 06:19 PM |
ఒడిషా/ భువనేశ్వర్ | 05:06 PM | 06:19 PM |
పంజాబ్/ చండీగఢ్ | 05:27 PM | 06:19 PM |
రాజస్థాన్/ జైపూర్ | 05:37 PM | 06:19 PM |
సిక్కిం/ గ్యాంగ్ టక్ | 04:45 PM | 06:19 PM |
తమిళనాడు/ చెన్నై | 05:37 PM | 06:19 PM |
తెలంగాణ/ హైదరాబాద్ | 05:39 PM | 06:19 PM |
త్రిపుర/ అగర్తలా | 04:39 PM | 06:19 PM |
ఉత్తర ప్రదేశ్/ లక్నో | 05:16 PM | 06:19 PM |
ఉత్తరా ఖండ్/ డెహ్రాడూన్ | 05:22 PM | 06:19 PM |
పశ్చిమ బెంగాల్/ కోల్ కతా | 04:53 PM | 06:19 PM |
దయచేసి గమనించండి, ఈ కథనంలోని అన్ని సమయాలు భారతీయ టైమ్‌జోన్ కోసం ఇవ్వబడ్డాయి, క్రింద ఇవ్వబడిన దేశం/నగర పట్టిక తప్ప (స్థానిక సమయాలు ఈ దేశం/నగర పట్టికలో ఇవ్వబడ్డాయి). దయచేసి మీ స్థానిక సూర్యోదయం/చంద్రాస్తమయ సమయాలు మరియు గ్రహణం ముగిసే సమయాలను తనిఖీ చేయండి.
దేశం/పట్టణం | ప్రారంభం | ముగింపు సమయం |
---|---|---|
నేపాల్ - ఖాట్మండు | 05:12 PM (సూర్యాస్తమయం) | 06:34 PM |
బంగ్లాదేశ్/ ఢాకా | 05:13 PM (సూర్యాస్తమయం) | 06:49 PM |
జపాన్/ టోక్యో | 06:09 PM | 09:49 PM |
ఆస్ట్రేలియా/ సిడ్నీ | 07:09 PM | 10:49 PM |
ఇండోనేషియా/ జకార్తా | 05:44 PM (సూర్యాస్తమయం ) | 07:49 PM |
అమెరికా/CA/శాన్ ఫ్రాన్సిస్కో | 02:09 AM | 05:49 AM |
అమెరికా/IL/చికాగో | 04:09 AM | 06:36 AM (సూర్యోదయం) |
అమెరికా/ వాషింగ్టన్ DC | 05:09 AM | 07:44 AM (సూర్యోదయం) |
అమెరికా/NY/న్యూయార్క్ | 05:09 AM | 06: 50 AM (సూర్యోదయం) |
అమెరికా/CA/లాస్ ఏంజలిస్ | 02:09 AM | 05:49 AM |
కెనడా/ఒట్టావా | 05:09 AM | 06:57 AM (సూర్యోదయం) |
ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 02గంటల 39 నిమిషాలకు ప్రారంభమయ్యి, సాయంత్రం 06 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణ పుణ్యకాలం సూర్యాస్తమయం తర్వాత ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు నివసించే పట్టణం సూర్యాస్తమయ సమయ ప్రకారం గ్రహణ పుణ్యకాలాన్ని ఆచరించండి. చంద్రగ్రహణం ఆరంభానికి ముందు 3 ప్రహరలు, అంటే 9 గంటల ముందు కాలం నుంచి అంటే తెల్లవారు ఝామున 05 గంటల 39 నిమిషాలకు గ్రహణ వేధ ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి స్నానం గ్రహణ వేధ ప్రారంభం కాక ముందు చేయవచ్చు. అలాగే శారీరకంగా సమర్థులు అయినవారు ఈ రోజు గ్రహణం పూర్తయ్యే వరకు భోజనాదులు చేయరాదని శాస్త్ర వాక్యం. అశక్తులు, అంటే చిన్నపిల్లలు, గర్భిణులు, రోగగ్రస్తులు, మరియు వృద్ధులు గ్రహణ వేధ సమయము నుండి ఒక యామము విడిచిపెట్టి అంటే ఉదయం 11 గంటల 39 నిమిషాల లోపు భోజనాలు పూర్తి చేయాలి.
ఈ గ్రహణం ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అలాగే ఏ రాశి వారు చూడొచ్చు ఏ రాశి వారు చూడకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మేష రాశి, భరణి నక్షత్రములో సంభవిస్తున్నది కాబట్టి మేష, వృషభ, మకర, మరియు కన్యా రాశులలో జన్మించినవారికి అనుకూలంగా ఉండదు కనక వారు గ్రహణం చూడకపోవటం మంచిది. ఈ గ్రహణం మిథున, కర్క, వృశ్చిక, మరియు కుంభ రాశులలో జన్మించిన వారికి శుభ ఫలితాలు, మిగతా రాశుల వారికి మధ్యమ ఫలితం పొందుతారు.
మేష రాశి. ఈ రాశి వారికి 1వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
వృషభ రాశి వారికి ఈ గ్రహణం 12వ సంభవిస్తుంది కాబట్టి మీరు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
మిథున రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
సింహ రాశి. ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వారి రాశి నుంచి 9 వ రాశి లో వస్తుంది కాబట్టి వారు గ్రహణాన్ని ని చూడవచ్చు అలాగే ప్రత్యేకించి ఏ రకమైన నియమాలు పాటించటం అవసరం లేదు. నదీతీరంలో లో నివసించేవారు నదీ స్నానం చేయటం లేదా గ్రహణానంతరం దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
కన్యా రాశి. ఈ రాశి వారికి 8 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
తులా రాశి. ఈ రాశి వారికి 7 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
ధనూ రాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
మకర రాశి. ఈ రాశి వారికి 4 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
కుంభ రాశి. ఈ రాశి వారికి మూడవ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
మీన రాశి. ఈ రాశి వారికి 2 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
చంద్రుడు మనస్సుకు, ఆలోచనకు కారకుడు, రాహువు మనలోని అహంకారానికి, మూర్ఖత్వానికి మరియు మొండి ధైర్యానికి కారకుడు. ఈ చంద్ర గ్రహణ సమయంలో జరిగే చంద్ర, రాహు సంయోగం వలన మేష, వృషభ, కన్య, తుల, మకర, మరియు మీన రాశుల వారికి మానసిక ఆందోళన పెరగటం, ఎవరినీ లెక్క చేయని స్వభావం పెరగటం, మూర్ఖ నిర్ణయాల కారణంగా ఆత్మీయులకు దూరం అవటం, ఖర్చులు పెరగడం అలాగే మొండి ధైర్యం కారణంగా అనవసర సమస్యలకు లోనవటం జరగవచ్చు. అంతేకాకుండా బంధువులతో, మిత్రులతో వైరం ఏర్పడటం కాని, లేదా మీ గురించి తప్పు విషయాలు ప్రచారం జరగడం గాని ఈ గ్రహణం కారణంగా రాబోయే రోజుల్లో (అంటే దాదాపు 6 నెలల వరకు) ఈ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు శివారాధన చేయడం, దుర్గా ఆరాధన చేయటం, అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చాలా వరకు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ గ్రహణం వలన ఏర్పడే ఫలితాలు కూడా నామమాత్రంగానే ఉంటాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా ఊహించుకొని బాధ పడే అవసరంలేదు.
గ్రహణాల విషయంలో అనవసరంగా భయపడటం తగదు. మీ రాశిలో లేదా మీ రాశికి చెడు స్థానంలో గ్రహణం వచ్చినంత మాత్రాన మీకు అంతా చెడే జరుగుతుందని భావించే అవసరం లేదు. ఏ గ్రహణ ప్రభావం అయినా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మన జాతకంలో లేని ఫలితాలేవి గ్రహణాల కారణంగా కొత్తగా రావు. గ్రహణం అనేది ఖగోళ అద్భుతం, అదే సమయంలో శాస్త్రీయంగా నిరూపించలేనంత మాత్రాన గ్రహణ సమయంలో భోజనం చేయక పోవటం, లేదా గ్రహణం చూడకపోవటం మొదలైనవి మూఢ విశ్వాసాలు కాదు. జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి గర్భిణీ స్త్రీలు పనిగట్టుకొని గ్రహణం చూడటం వలన పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మన పూర్వికులు తమ అపారమైన అనుభవంతో మరియు దివ్య జ్ఞానంతో చెప్పిన ప్రతి విషయం మానవాళి మరింత అభివృద్ధి చెందటానికే తప్ప, దిగజారి పోవటానికి కాదు. శాస్త్రం చేసే పని మంచి, చెడు చెప్పటం వరకే. దానిని ఆచరించటం, ఆచరించక పోవటం అనేది వ్యక్తిగత విషయం.
Check June Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.
Read More