అక్టోబర్ 29 తేదీన సంభవించే చంద్రగ్రహణం ఏ రాశి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం అంటే శుభకృత్ (శోభన) సంవత్సరం ఆశ్వయుజ పూర్ణిమ, శనివారం, అక్టోబర్ 28వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది.
భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయాలు.
గ్రహణ ప్రారంభం - అర్ధరాత్రి 01గం.ల 05ని.లకు
గ్రహణ మధ్యకాలం - అర్ధరాత్రి 01గం.ల 44ని.లకు
గ్రహణ మోక్ష కాలం - తె. ఝా.న 02గం.ల 23ని.లకు
ఇది పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది.
సూర్య గ్రహణ సమయంలో సూర్య గ్రహణానికి నాలుగు ఝాముల ముందు (అంటే 12 గంటల ముందు), చంద్ర గ్రహణానికి మూడు ఝాములు (అంటే తొమ్మిది గంటల ముందు) ఆరోగ్యవంతులు ఆహారము తీసుకోకూడదు. అయితే ఈ నియమం ముసలివారికి, గర్భిణులకు, పిల్లలకు మరియు అనారోగ్య వంతులకు వర్తించదు వారు గ్రహణానికి ఒకటిన్నర ఝాము ముందు వరకు అంటే గ్రహణానికి నాలుగున్నర గంటల ముందు వరకు ఆహారం తీసుకోవచ్చు.
ఇది రాత్రి మూడవ ఝాములో ఏర్పడుతున్నది కాబట్టి నిత్య భోజనాదులు, అలాగే శ్రాద్ధాదులు పగలు 3వ ఝాములోపు అంటే సుమారు మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తి చేసుకోవాలి. (ఇది స్థానిక సూర్యోదయ సమయం మరియు పగటి కాలం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ స్థానిక సూర్యోదయం మరియు పగటి కాలం ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.) గ్రహణ మోక్షము అర్ధరాత్రి తరువాత గనుక సమర్ధులు మోక్ష స్నానానంతరము కూడా ఆహారాదులను స్వీకరించరాదు. అంటే తెల్లవారి సూర్యోదయానంతరం నిత్యపూజాధికాలు ముగించుకొని భోజనాదులు స్వీకరించవచ్చు.
గ్రహణ గోచారము :- ఈ గ్రహణము అశ్వినీ, మఘ, మరియు మూల నక్షత్రము వారికి, అధమ ఫలము ఇస్తుంది కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గ్రహణము చూడకపోవటం మంచిది.గ్రహణ ప్రభావము ఆహార పదార్థాలపై అలాగే ఇంటిలో పూజాసామాగ్రి మరియు దేవతా విగ్రహాలపై ఉండకుండా దర్భలు కానీ, గరిక కానీ వేయటం అనాదిగా వస్తున్న ఆచారం మరియు శాస్త్రీయంగా కూడా ఈ వీటికి సూర్య, చంద్రులనుంచి వచ్చే చెడు కిరణాల ప్రభావం తగ్గించే శక్తి ఉందని చెప్తారు.
గ్రహణ సమయములో వృధా కార్యములు చేయకుండా గాయత్రి మొదలగు (గురు ముఖతః ఉపదేశము పొందిన మంత్రముల జపము) జపములు చేయవలెను. గ్రహణ సమయమున చేసెడి జపము ఎక్కువ రెట్లు ఫలితములు ఇచ్చును. అంతే కాకుండా మంత్రోపదేశము స్వీకరించుటకు కూడా ఇది మంచి సమయము. చాలామంది గ్రహణ సమయంలో నూతన మంత్రోపదేశము గురు ముఖతః తీసుకుంటారు.
గ్రహణము విడిచిన తర్వాత మళ్లీ స్నానం చేయాల్సి ఉంటుంది. అర్థరాత్రి స్నానం చేయటానికి వీలులేనివారు ఉదయం పూట చేయటం మంచిది. అలాగే దగ్గర్లో నది ఉన్నట్లైతే నదీస్నానం ఆచరించటం మరింత శ్రేష్టం.
గ్రహణం పూర్తయ్యాక అధమ గ్రహణ ప్రభావం ఉన్న మేష, వృషభ, కన్య, మకర, సింహ, తుల, ధను, మీన రాశులలో జన్మించిన వారు, అశ్వినీ, మఘ, మరియు మూల నక్షత్రములలో జన్మించిన వారు చంద్రుడు మరియు రాహువు ప్రతిమను తమ శక్త్యనుసారం దానం చేయాలి.
ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించే నగరాల్లో కొన్నింటిని ఇక్కడ ఇవ్వటం జరిగింది.
బ్రస్సెల్స్, బ్రస్సెల్స్, బెల్జియం
బ్యాంకాక్, థాయిలాండ్
లిస్బన్, పోర్చుగల్
న్యూఢిల్లీ, భారతదేశం
హైదరాబాద్, భారతదేశం
బుడాపెస్ట్, హంగేరి
కైరో, ఈజిప్ట్
అంకారా, టర్కీ
జకార్తా, ఇండోనేషియా
ఏథెన్స్, గ్రీస్
రోమ్, ఇటలీ
యాంగోన్, మయన్మార్
మాడ్రిడ్, స్పెయిన్
కోల్‌కతా, భారతదేశం
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
పారిస్, పారిస్, ఫ్రాన్స్
లాగోస్, లాగోస్, నైజీరియా
టోక్యో, జపాన్
బీజింగ్, బీజింగ్ మునిసిపాలిటీ, చైనా
మాస్కో, రష్యా
ఈ గ్రహణం ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అలాగే ఏ రాశి వారు చూడొచ్చు ఏ రాశి వారు చూడకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మేష రాశి, అశ్విని నక్షత్రములో సంభవిస్తున్నది కాబట్టి మేష, వృషభ, మకర, మరియు కన్యా రాశులలో జన్మించినవారికి అనుకూలంగా ఉండదు కనక వారు గ్రహణం చూడకపోవటం మంచిది. ఈ గ్రహణం మిథున, కర్క, వృశ్చిక, మరియు కుంభ రాశులలో జన్మించిన వారు శుభ ఫలితాలు, మిగతా రాశుల వారు మధ్యమ ఫలితం పొందుతారు.
మేష రాశి. ఈ రాశి వారికి 1వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
వృషభ రాశి వారికి ఈ గ్రహణం 12వ సంభవిస్తుంది కాబట్టి మీరు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
మిథున రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
సింహ రాశి. ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వారి రాశి నుంచి 9 వ రాశి లో వస్తుంది కాబట్టి వారు గ్రహణాన్ని ని చూడవచ్చు అలాగే ప్రత్యేకించి ఏ రకమైన నియమాలు పాటించటం అవసరం లేదు. నదీతీరంలో లో నివసించేవారు నదీ స్నానం చేయటం లేదా గ్రహణానంతరం దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
కన్యా రాశి. ఈ రాశి వారికి 8 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
తులా రాశి. ఈ రాశి వారికి 7 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
ధనూ రాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
మకర రాశి. ఈ రాశి వారికి 4 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
కుంభ రాశి. ఈ రాశి వారికి మూడవ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
మీన రాశి. ఈ రాశి వారికి 2 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
చంద్రుడు మనస్సుకు, ఆలోచనకు కారకుడు, రాహువు మనలోని అహంకారానికి, మూర్ఖత్వానికి మరియు మొండి ధైర్యానికి కారకుడు. ఈ చంద్ర గ్రహణ సమయంలో జరిగే చంద్ర, రాహు సంయోగం వలన మేష, వృషభ, కన్య, తుల, మకర, మరియు మీన రాశుల వారికి మానసిక ఆందోళన పెరగటం, ఎవరినీ లెక్క చేయని స్వభావం పెరగటం, మూర్ఖ నిర్ణయాల కారణంగా ఆత్మీయులకు దూరం అవటం, ఖర్చులు పెరగడం అలాగే మొండి ధైర్యం కారణంగా అనవసర సమస్యలకు లోనవటం జరగవచ్చు. అంతేకాకుండా బంధువులతో, మిత్రులతో వైరం ఏర్పడటం కాని, లేదా మీ గురించి తప్పు విషయాలు ప్రచారం జరగడం గాని ఈ గ్రహణం కారణంగా రాబోయే రోజుల్లో (అంటే దాదాపు 6 నెలల వరకు) ఈ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు శివారాధన చేయడం, దుర్గా ఆరాధన చేయటం, అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చాలా వరకు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ గ్రహణం వలన ఏర్పడే ఫలితాలు కూడా నామమాత్రంగానే ఉంటాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా ఊహించుకొని బాధ పడే అవసరంలేదు.
గ్రహణాల విషయంలో అనవసరంగా భయపడటం తగదు. మీ రాశిలో లేదా మీ రాశికి చెడు స్థానంలో గ్రహణం వచ్చినంత మాత్రాన మీకు అంతా చెడే జరుగుతుందని భావించే అవసరం లేదు. ఏ గ్రహణ ప్రభావం అయినా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మన జాతకంలో లేని ఫలితాలేవి గ్రహణాల కారణంగా కొత్తగా రావు. గ్రహణం అనేది ఖగోళ అద్భుతం, అదే సమయంలో శాస్త్రీయంగా నిరూపించలేనంత మాత్రాన గ్రహణ సమయంలో భోజనం చేయక పోవటం, లేదా గ్రహణం చూడకపోవటం మొదలైనవి మూఢ విశ్వాసాలు కాదు. జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి గర్భిణీ స్త్రీలు పనిగట్టుకొని గ్రహణం చూడటం వలన పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మన పూర్వికులు తమ అపారమైన అనుభవంతో మరియు దివ్య జ్ఞానంతో చెప్పిన ప్రతి విషయం మానవాళి మరింత అభివృద్ధి చెందటానికే తప్ప, దిగజారి పోవటానికి కాదు. శాస్త్రం చేసే పని మంచి, చెడు చెప్పటం వరకే. దానిని ఆచరించటం, ఆచరించక పోవటం అనేది వ్యక్తిగత విషయం.