స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య, ఆదివారం జూన్ 21వ తేదీ చూడామణి నామక అఖండ గ్రాస కంకణ ఆకార సూర్య గ్రహణం సంభవిస్తున్నది. ఇది అర్థ అధిక గ్రాస రాహుగ్రస్త కృష్ణవర్ణ సవ్య సూర్యగ్రహణము.
జూన్ 21వ తేదీ ఉదయం గం. 10. 15 ని.ల నుండి పగలు గం.1. 44ని.ల. మధ్యన, మృగశిర 4 వ పాదం, ఆర్ద్ర 1 వ పాదం, మిథున రాశి యందు ఈ సూర్య గ్రహణం సంభవిస్తున్నది. గ్రహణ స్పర్శ కాలం ఆదివారం ఉదయం 10.15 గంటలకు. గ్రహణ మధ్యకాలం 11. 56 గంటలకు. మోక్ష కాలం పగలు 1.44 గంటలకు. మొత్తం గ్రహణ కాలం 3.29 గంటలు. భారతావనిలో అన్ని ప్రాంతాలు, మయన్మార్, దక్షిణరష్యా, మంగోలియా, బంగ్లాదేశ్, శ్రీలంక థాయిలాండ్, మలేషియా, ఉత్తర, దక్షిణ కొరియా, జపాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా పూర్వ భాగం, ఆఫ్రికా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ మొదలైన దేశమునందు అఖండ గ్రాస రూపంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతములందు ఓమన్, చైనా దక్షిణ ప్రాంతములలో తైవాన్, మున్నగు ప్రాంతాలలో కం కంకణాకార గ్రహణం కనిపిస్తుంది. గ్రహణ స్పర్శ మొదలుకొని మోక్ష పర్యంతం కల సమయాన్ని గ్రహణ పుణ్యకాలం అంటారు.ఈ గ్రహణానికి సంబంధించి 20వ తేదీ శనివారం రాత్రి 10.15 నుండి గ్రహణ వేధ ప్రారంభమై, 21వ తేదీ ఆదివారం పగలు 1.44 వరకు గ్రహణ మోక్ష కాలం ఉండును. కనుక నిత్య భోజనాలు, అమావాస్య ప్రయుక్త ప్రాత్యాబ్దికములు, నిర్దేశిత సమయాల్లోపుగా పూర్తి చేసుకోవడం ఉత్తమం.
సూర్య గ్రహణం అయితే గ్రహణానికి 4 జాములు అంటే 12 గంటల ముందు, చంద్రగ్రహణం అయితే మూడు జాములు ముందు అనగా 9 గంటల ముందు పూజలు, వ్రతాలు, శ్రాద్ధములు, నిత్య భోజనాదులు పూర్తి చేయాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 8 గంటల వరకు భోజనాలు ముగించడం, కనీస పక్షంలో గ్రహణ స్పర్శ, మోక్ష కాలం మధ్యన నియమాలు పాటించడం మంచిది. గ్రహణము సంభవించిన నక్షత్ర రాశుల యందు గ్రహణ గోచారము అదనంగా ఉన్న రాశుల యందు జన్మించినవారు సువర్ణ లేదా రజత లేదా తామ్రములో సూర్య, రాహువుల ప్రతిమలు చేయించి నేతితో నింపిన తామ్ర పాత్ర లేదా కంచు పాత్రలో ఉంచి (ఇవి దొరకని పక్షములో కాలానుగుణముగా స్టీలు గిన్నెలో), తిల, వస్త్ర, దక్షిణాదులను ఉంచి, సంకల్పించి, సూర్య, రాహువులను, ధ్యానించి, దానం చేయాలి. నదీ స్నానం చేసి జప పారాయణ, దానధర్మాలు ఆచరించాలి. (ప్రస్తుతం Corona COVID19 ప్రభావం అధికంగా ఉన్నందున గ్రహణం పూర్తయ్యాక ఇంట్లోనే స్నానాదు ముగించుకోవటం, పైన చెప్పిన వస్తువులు దొరకని పక్షంలో తోచిన డబ్బు దానం చేయటం ఉత్తమం) గ్రహణ మోక్షం కాలంలో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. గ్రహణారంభ, అంత్య స్నానాలు చేయాలి గ్రహణ స్పర్శ కాలాన్ని అనుసరించి సంప్రదాయ క్రతువులు ఆచరించాలి. మంత్రోపదేశం ఉన్న వాళ్ళు ఆమంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో జపం చేయడం వలన అధిక ఫలితం ఉంటుంది.అలాగే మంత్రోపదేశం లేని వారు కూడా, కుల దేవత, ఇష్టదేవత నామ స్మరణ చేయడం మంచిది.
గర్భవతులకు పిండం ఎదుగుతున్న సమయం కనుక వారి శరీరానికి గ్రహణం కారణంగా ఏర్పడే నెగటివ్ పవర్ ని తట్టుకునే శక్తి ఉండదు. దీని కారణంగా గర్భంలోని శిశువులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని వారిని బయటకు వెళ్ళనీయరు.
దర్బకు (రెల్లుగడ్డి) కి ఈ నెగటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంది మన పూర్వికులు గమనించి గ్రహణ సమయంలో ఆహారపదార్థాలపై, ఇంటిపై. దర్బ వేయడం వల్ల ఆ చెడుశక్తి తగ్గి పోతుందని చెపుతారు. గ్రహణం పూర్తయ్యాక దానిని తీసి బయట పడేయాలి. గ్రహణం పూర్తయ్యాక తల స్నానం చేసి ఇల్లు, దేవుళ్ళు శుభ్రం చేసి దీపం పెట్టుకోవడం సంప్రదాయం.
గ్రహణఫలితాలు వివిధరాశులలో జన్మించిన వారిపై ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే
శ్లో.త్రిషడ్దశాయేషుపగతం నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్తనవమేషు మధ్యమంస్యాత్
శేషేష్వనిష్టం కథితం మునీంద్రైః"
అనే శ్లోకాన్ని బట్టి
జన్మరాశినుండి 3,6,10,11 రాశులలో గ్రహణం శుభ ఫలితాన్ని,
2,7,9 లయందు మధ్యమ ఫలితాన్ని. మిగలిన రాశులయందు అనగా 1,4,5,8,12 అశుభ ఫలితాన్ని ఇస్తుందని అర్థం. ఈ సారి సూర్య గ్రహణం మిథున రాశిలో సంభవిస్తున్నది కాబట్టి, 3, 6, 10, 11 రాశులైన మేష, మకర, కన్యా మరియు సింహ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ, ధను మరియు తులా రాశుల వారికి మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. మిగిలిన రాశుల వారికి అంటే మిథున, కర్క, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారికి అధమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రాశుల వారు గ్రహణాన్ని చూడక పోవటం మంచిది.
గ్రహణ కాల దాన మంత్రము : మిథున రాశివారు.. మమ జన్మరాశివశాత్ ప్రథమ స్థానే స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.
కర్కాటక రాశివారు మమ జన్మరాశివశాత్ ద్వాదశ స్థానే స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.
వృశ్చిక రాశివారు.. మమ జన్మరాశివశాత్ అష్టమ స్థానే స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.
మీనరాశివారు మమ జన్మరాశివశాత్ చతుర్థ స్థానే స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.
తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!!
అను మంత్రముచే చదివి
గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం రాహుబింబ, సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే న మమ. అని దానమీయవలయును.
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read More