onlinejyotish.com free Vedic astrology portal

సంపూర్ణ వివాహ పొంతన (గుణమేళనం) - తెలుగులో

For Swastisri Parabhava Samvatsara (Ugadi) Yearly Horoscopes, Income, and Expenditure, etc., please choose your language: English, తెలుగు

వివాహ పొంతన: దాంపత్య జీవితానికి పునాది

తెలుగు సంప్రదాయం ప్రకారం, వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, రెండు మనసుల అనుబంధం. మా ఈ ఉచిత సాఫ్ట్‌వేర్ ద్వారా వధూవరుల జాతకాలను విశ్లేషించి, అష్టకూట గుణమేళనం, కుజ దోషం మరియు దాంపత్య సుఖాన్ని తెలుసుకోండి. మిగతా ఏ గుణమేళన సాఫ్ట్వేర్లలో లేని ఎన్నో అంశాలు కలిగిన మా టూల్ మీ అన్యోన్య దాంపత్య జీవితం కోసం శాస్త్రీయమైన దిశానిర్దేశం అందిస్తుంది.

Method: Ashtakoota Milan (Vedic) | Updated: March 2026

ఉచిత గుణమేళనం (Matching)

ఖచ్చితమైన ఫలితాల కోసం దయచేసి ఇద్దరి పుట్టిన సమయం మరియు పుట్టిన ఊరు వివరాలు సరిగ్గా ఇవ్వండి.

వరుడి వివరాలు

వధువు వివరాలు

మీరు నివసించే నగరం, భాష, కుండలి శైలి సేవ్ చేసుకుంటే ప్రతిసారి పూరించాల్సిన అవసరం ఉండదు.


వివాహ పొంతనలో మేము ఏమి పరిశీలిస్తాము?

కుజ దోషం (Mangal Dosha)

కుటుంబ కలహాలకు, విడిపోవడానికి కారణమయ్యే కుజ దోషం (Mars Check) ఉందా? ఒకవేళ ఉంటే దానికి పరిహారాలు ఉన్నాయా?

నాడీ కూటం (Health)

దీనినే "రక్త పొంతన" అంటారు. దంపతుల ఆరోగ్యం మరియు సంతానానికి సంబంధించిన అతి ముఖ్యమైన కూటమి ఇది.

గ్రహ మైత్రి (Friendship)

భార్యాభర్తల మధ్య స్నేహం ఉంటుందా లేదా శత్రుత్వం ఉంటుందా? వారి ఆలోచనలు కలుస్తాయా?

భకూట దోషం (Love)

రాశుల మధ్య దూరాన్ని (6/8, 2/12) బట్టి వారి మధ్య ప్రేమ, ఆకర్షణ మరియు ఆర్థిక స్థితిని అంచనా వేయడం.


వివాహ పొంతన - సందేహాలు & సమాధానాలు

Frequently Asked Questions & Glossary

వివాహ పొంతనలో వర్ణం, వశ్యం, తారా, యోని, గ్రహ మైత్రి, గణ, రాశి మరియు నాడీ అనే 8 కూటాలను పరిశీలిస్తారు. దీనినే 'అష్టకూట' విధానం అంటారు. ఈ పట్టికలో చూపినట్లు మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. కనీసం 18 పాయింట్లు వస్తే అది 'పాస్' అయినట్లు లెక్క. అయితే స్కోరు 30 వచ్చినా సరే, 'దోష సామ్యం' లేకపోతే ఆ జంటకు మనస్పర్థలు రావచ్చు.

జాతక చక్రంలో లగ్నం నుండి 1, 2, 4, 7, 8, లేదా 12వ స్థానాల్లో కుజుడు ఉంటే దానిని కుజ దోషం అంటారు. ఈ చిత్రంలో చూపిన స్థానాల్లో కుజుడు ఉంటే, అది దాంపత్యంలో కోపాన్ని లేదా ఆరోగ్యంపై ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే, అవతలి వారి జాతకంలో కూడా అదే స్థాయిలో దోషం ఉంటే (దోష సామ్యం), ఈ దోషం రద్దయిపోయి, ఆ జంట అద్భుతంగా జీవిస్తారు.

నాడీ కూటం అనేది దంపతుల శారీరక తత్వాన్ని (వాత, పిత్త, కఫ) మరియు జన్యు పరమైన పొంతనను (Genes) సూచిస్తుంది. ఇద్దరిదీ 'ఆది నాడి' లేదా ఇద్దరిదీ 'అంత్య నాడి' అయితే రక్తం గడ్డకట్టడం లేదా సంతాన లేమి వంటి సమస్యలు రావచ్చు. అందుకే నాడీ దోషం ఉన్నప్పుడు, 'నక్షత్ర పాద వేధ' లేకపోతేనే వివాహం చేయాలి.

వధూవరుల రాశులు ఒకదానికొకటి 6వ మరియు 8వ స్థానాల్లో ఉంటే (ఉదాహరణకు మేషం - కన్య), దానిని 'షష్టాష్టకం' అంటారు. దీనివల్ల దంపతుల మధ్య తరచుగా గొడవలు, శత్రుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఆ రెండు రాశుల అధిపతులు మిత్రులైతే (గ్రహ మైత్రి ఉంటే) ఈ దోషం పెద్దగా వర్తించదు.

రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి - ఈ నక్షత్రాలలో ఇద్దరూ పుట్టి ఉంటే ఏక నక్షత్ర దోషం ఉండదు, నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. మిగిలిన నక్షత్రాల వారికి, ఇద్దరి నక్షత్ర పాదాలు వేరుగా ఉంటే (భిన్న పాదం) వివాహం చేయవచ్చు.
Santhosh Kumar Sharma

సంపాదకులు: శ్రీ సంతోష్ కుమార్ శర్మ గొల్లపెల్లి

Vedic Astrologer

"వివాహ పొంతన అంటే కేవలం పాయింట్లు కలపడం కాదు, రెండు మనసులను అర్థం చేసుకోవడం." - శ్రీ శర్మ గారి పర్యవేక్షణలో రూపొందిన ఈ రిపోర్ట్ మీకు శాస్త్రీయమైన ఫలితాలను అందిస్తుంది.


Horoscope

Free Astrology

సమాధానం దొరకని ప్రశ్న ఉందా? తక్షణమే సమాధానం పొందండి.

ప్రశ్న జ్యోతిషశాస్త్రం యొక్క ప్రాచీన సూత్రాలను ఉపయోగించి, కెరీర్, ప్రేమ, లేదా జీవితం గురించి మీ అతి ముఖ్యమైన ప్రశ్నలకు తక్షణ దైవిక మార్గదర్శకత్వం పొందండి.

వెంటనే మీ సమాధానం పొందండి
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Marriage Matching with date of birth

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceIf you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Malayalam,   Français,   Русский,   Deutsch, and   Japanese . Click on the desired language to know who is your perfect life partner.

Free KP Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free KP horoscope.


OnlineJyotish.com కి మీ సహకారం అందించండి.

onlinejyotish.com

మా వెబ్ సైట్ (onlinejyotish.com) లో అందిస్తున్న జ్యోతిష సేవలు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీరు మా వెబ్సైట్ అభివృద్ధికి క్రింద ఇచ్చిన వాటిలో ఏదైనా ఉపయోగించి సహకరించండి.

1) పేజీని షేర్ చేయండి
మీ ఫేస్‌బుక్, ట్విట్టర్ (X), వాట్సాప్ మొదలైన వాటిలో ఈ పేజీని షేర్ చేయండి.
Facebook Twitter (X) WhatsApp
2) 5⭐⭐⭐⭐⭐ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి
గూగుల్ ప్లేస్టోర్ మరియు గూగుల్ మై బిజినెస్‌లో మా ఆప్/వెబ్సైట్ గురించి 5-స్టార్ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి.
మీ రివ్యూ వల్ల మరింత మంది వరకు సేవలు చేరుతాయి.
3) మీకు నచ్చిన అమౌంట్ కంట్రిబ్యూట్ చేయండి
క్రింద ఇచ్చిన UPI లేదా PayPal ద్వారా మీకు నచ్చిన అమౌంట్ పంపి కంట్రిబ్యూట్ చేయండి.
UPI UPI Pay
PayPal Email us
✅ కాపీ అయింది.