అప్పుడే పుట్టిన పిల్లల రాశి, నక్షత్రం, జన్మనామం, దోషాలు మొదలైనవి చెప్పే ఉచిత శిశుజాతక సేవ

Know Rashi, Nakshatra and Naming Letters for your Newborn child

మీ పిల్లల మొదటి జన్మ పత్రిక

పిల్లలు పుట్టిన వెంటనే రాశి, నక్షత్రం, జన్మనామం, దోషాలు మొదలైనవి తెలుసుకోవటానికి ఉపయోగపడే ఉచిత నవజాత శిశుజాతకం.

భారత దేశంలో పిల్లలు పుట్టగానే వారి రాశి, నక్షత్రం, జన్మనామం, ఏమైనా దోషాలున్నాయా లేదా తెలుసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా చాలా మందికి విదేశాల్లో విద్యా, ఉద్యోగాలు ఉండటం వలన అక్కడే స్థిర పడటం జరుగుతోంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు పుట్టినప్పుడు ఆ పట్టణంలో జ్యోతిష్కులు అందుబాటులో ఉండటం సాధ్యం కాకపోవటం వలన జ్యోతిష వెబ్ సైట్లపై తల్లిదండ్రులు ఆధార పడాల్సి వస్తోంది. అయితే చాలా వెబ్సైట్లలో పెద్దవారికోసం జాతకాలు అందుబాటులో ఉన్నాయి కానీ, అప్పుడే పుట్టిన పిల్లల జాతకం, వారి రాశి నక్షత్రాలతో పాటు జన్మనామం, పేరు పెట్టడానికి తగిన అక్షరాలు, జనన కాల దోషాలు, తదితర వివరాలు ఆయా వెబ్సైట్లలో దొరకవు. ఉన్నా ఆ రిపోర్టుకు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఆ లోపం పూరించటానికే ఈ ఉచిత నవజాత శిశుజాతకం సేవను ప్రారంభించటం జరిగింది. దీని ద్వారా పైన చెప్పిన అన్ని వివరాలు మీ పిల్లలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో పుట్టినా తెలుసుకోవచ్చు.ప్రతి తల్లిదండ్రులకు సంతానం జన్మించిన మరుక్షణంలో కలిగే ప్రధాన సందేహం పుట్టిన వారి జాతకం ఎలా ఉన్నది, ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరాలు పేరుకు అనుకూలంగా ఉంటాయి, జాతకంలో ఏవైనా దోషాలున్నాయా, ఉంటే వాటి నివారణకు ఏం చేయాలి అని, ఇలా చాలా సందేహాలు మనసులో మెదులుతుంటాయి. వాటన్నింటికి సమాధానం ఈ ఉచిత నవజాత శిశుజాతకం సేవ. దీని ద్వారా మీ పిల్లల జాతకం తెలుసుకోవటమే కాకుండా, వారి పేరుకు తగిన అక్షరాలు, జాతక దోషాలు, నక్షత్ర, తిథి సంబంధ దోషాల వివరాలు అందిస్తుంది. పూర్వకాలంలో శిశువు జన్మించిన వెంటనే స్థానిక జ్యోతిష్కుల ద్వారా శిశువుయొక్క తాత్కాలిక జాతకచక్రం గణన చేయించి మంచి, చెడులు తెలుసుకునే వారు. అయితే ఈ ఆధునిక యుగంలో జ్యోతిష్కుడు అన్ని వేళల్లో అందుబాటులో ఉండటం సాధ్యం కాదు కాబట్టి, అలాగే కొన్ని దేశాల్లో శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే పేరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నందున, ప్రపంచంలో ఏ ప్రాంతంలో పుట్టిన పిల్లల తాత్కాలిక జాతకమైనా తెలుసుకునే విధంగా ఈ ఆన్లైన్ సాష్ట్వేర్ రూపొందించటం జరిగింది. ఇది ప్రధానంగా అప్పుడే పుట్టిన పిల్లల జాతకవివరాలు తెలుసుకోవటానికి ఉపయోగ పడుతుంది. మీకు పూర్తి జాతకం, ఫలితాలతో కావాలంటే మా ఉచిత తెలుగు జాతకం సేవ ద్వారా కానీ, లేదా E-Janmakundali సర్వీసు ద్వారా కానీ పొందవచ్చు.

This free Newborn Astrology report is also available in Hindi and English Languages.
Click here for English version
हिंदी केलिये यहा क्लिक करे .

జాతక చక్రముతో పాటు అవకహడా చక్రం, ఘాత చక్రం, అదృష్ట అంశములు, దశాంతర్దశా పట్టికలు మొదలైనవన్నీ తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో చూడటంతో పాటు ప్రింట్ తీసుకోవచ్చు లేదా పిడిఎఫ్ డాకుమెంట్ లా మార్చుకోవచ్చు.

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  


Success is a combination of hard work, determination, and perseverance.