ఒరిజినల్ కేపి ఆయనాంశతో జ్యోతిష్కులు సరైన విధంగా జాతక విశ్లేషణ చేయడానికి, అలాగే కృష్ణమూర్తి పద్ధతి (కేపి)లో జాతకం కావాలనుకునే వారికి సరైన గణితం మరియు ఫలితాలు అందించడానికి ఈ ఆన్ లైన్ కేపి జ్యోతిష సాఫ్ట్ వేర్ రూపొందించటం జరిగింది. కేపి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలతో పాటు 100 సంవత్సరాల దశాంతర్దశా ఫలితాలు కూడా మీరు పొందవచ్చు.
కృష్ణమూర్తి పద్ధతి లేదా కేపి పద్ధతి అనే ఈ జాతక విశ్లేషణా పద్ధతిని తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు సోత్తిదమన్నన్, జ్యోతిషమార్తాండ బిరుదాంకితులు అయిన శ్రీ కే.ఎస్. కృష్ణమూర్తి గారు 1960 ప్రారంభంలో కనిపెట్టారు. ప్రొఫేసర్ కృష్ణమూర్తి గారు 1908 లో జన్మించారు. సంప్రదాయ వైదిక జ్యోతిషంతోపాటుగా ఆయన పాశ్చాత్య జ్యోతిషం, ఇతర జ్యోతిష పద్ధతులను క్షుణ్ణంగా అభ్యసించారు. అయితే ఈ పద్ధతుల్లో వేటిలో ఆయన మదిలో మెలిగే ప్రశ్నలకు సరైన సమాధానం దొరకలేదు. ముఖ్యంగా జనన సమయం స్వల్ప తేడా కలిగిన కవలల జాతక విశ్లేషణ లో సంప్రదాయ పద్ధతులేవీ ఆయనను సంతృప్తి పరచలేదు. కంచి శంకరాచార్య ఆశీర్వచనంతో ఉచ్ఛిష్టగణపతి ఉపాసన ఆయనకు సరైన మార్గాన్ని సూచించింది. సంప్రదాయ జ్యోతిషంలో ఒక చంద్రుని నక్షత్ర ఆధారంగా చేసే దశాంతర్దశలను మిగతా గ్రహాలకు, భావాలకు ఆపాదించటం ద్వారా జాతక విశ్లేషణలో ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. దీని ద్వారా కవలల జాతక విశ్లేషణనే కాకుండా, సంఘటనల సమయాలను, జాతక ఫలితాలను ఖచ్ఛితంగా చెప్పగలిగారు.
ఈ ఆన్ లైన్ కేపి సాఫ్ట్వేర్ లో రాశి, నక్షత్ర వివరాలతో పాటు, లగ్న నవాంశ చక్రములు, గ్రహస్థితి, భావస్థితి, ఘాతచక్రము, అవకహడా చక్రము, అదృష్టవిషయములు, కేపి సబ్ అధిపతుల వివరములు, వింశోత్తరి దశాంతర్దశలు, జాతక ఫలితములు మరియు దశాంతర్దశ ఫలితములు పొందవచ్చు.
గణిత విషయంలో కేపి ఆయనాంశకు సంప్రదాయ లాహిరి ఆయనాంశకు స్వల్ప వ్యత్యాసం ఉంటుంది కాబట్టి గ్రహస్థితిలో, భావస్థితిలో అలాగే దశాంతర్దశ సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read More