onlinejyotish.com free Vedic astrology portal

ప్రశ్నాజ్యోతిషం కొరకు తత్కాల కుండలి మరియు పంచాంగం


ప్రస్తుత పంచాంగం మరియు గ్రహస్థితితో కూడిన తత్కాల ప్రశ్నా కుండలి

జ్యోతిషశాస్త్రంలో, ప్రశ్నా జ్యోతిషం లేదా హోరరీ ఆస్ట్రాలజీ ఒక ముఖ్యమైన విభాగం. దీనిని ఛప్పన్న శాస్త్రం అని కూడా అంటారు. ప్రశ్న యొక్క ప్రాముఖ్యత గ్రహ స్థానం మరియు పృచ్ఛకుడు ప్రశ్న అడిగిన సమయంలో ఉన్న గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కలుగుతుంది. ఏదైనా వస్తువు కోల్పోయినా, ఏవరైనా మనుషులు కనిపించకుండా పోయినా, ఈ ప్రశ్నాకుండలి ఆధారంగా సమాధానాన్ని కనుగొనవచ్చు. పోయిన వస్తువు కానీ, మనిషి కాని దొరకటం సాధ్యమేనా, మరియు అలా అయితే, ఏ దిశలో వారు ఉన్నారు? ఎప్పుడు దొరకవచ్చు మొదలైన ప్రశ్నలకు సమాధానం ప్రశ్నాజ్యోతిషం చెపుతుంది. అంతే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ప్రశ్నా జ్యోతిషం మీద ఆధారపడవచ్చు. ఈ తత్కాలిక ప్రశ్నా కుండలి లేదా ప్రస్తుత ప్రశ్నా కుండలి ప్రస్తుతం మీరున్న ప్రదేశం మరియు సమయం ఆధారంగా వేయబడినది. దీని ద్వారా నిపుణులైన జ్యోతిష్కులు సుళువుగా సమాధానం చెప్తారు.