నవగ్రహాలలో మిగతా అన్నింటికన్నా మనిషిని భయపెట్టే గ్రహం శని. చాలామందికి శని అంటే ముఖ్యంగా ఎల్నాటి శని అంటే ఒక రకమైన వణుకు, భయం వస్తుంది. శని తమను ఎన్ని కష్టాలు పెడతాడో అని ఆందోళన పడుతుంటారు. నిజానికి శనిని సరిగా అర్థం చేసుకుంటే ఈ భయం చాల వరకు దూరం అవుతుంది. శని కర్మ కారకుడు. ఒక మనిషి చేసిన పాప కర్మను తొలగించే గ్రహం శని. ఒక రాయిని శిల్పంగా మార్చేటప్పుడు అది ఉలి దెబ్బలకు భయపడితే ఎప్పటికి శిలగానే ఉంటుంది తప్ప శిల్పంగా మారదు. అలాగే మనిషికూడా శని ఇచ్చే బాధలను, కష్టాలను సరిగా అర్థం చేసుకుంటే ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొనవచ్చు. శనిని ప్రభావం ఓపిక, నిజాయితీ మరియు శారీరక శ్రమతో తగ్గించుకోవచ్చు.
ఈ రోజు (26-01-2017) రాత్రి నుంచి శని వృశ్చిక రాశి నుంచి ధనురాశిలో సంచరిస్తాడు. శీఘ్రగామి గా సంచరించే శని మళ్ళి ఈ సంవత్సరం జూన్ 21 నుంచి అక్టోబర్ 26 వరకు తిరిగి వక్రగతుడై వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. తిరిగి అక్టోబర్ 26 నుంచి 24 జనవరి 2020 వరకు ధనురాశిలో సంచరిస్తాడు. ఈ ధనురాశిలో శని సంచార ప్రభావం భారత దేశం పైన అలాగే 12 రాశులపైనా ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
భారతదేశం మకర రాశి కిందకు వస్తుంది. శని ధను రాశిలో గోచారం ప్రారంభం అవటంతో ఏల్నాటి శని ప్రభావం భారతదేశానికి ప్రారంభమైనట్టు లెక్క. ఇది ఒకరకంగా దేశానికి మంచి జరిగే సమయం. భవిష్యత్తులో మన దేశానికి జరగబోయే అభివృద్ధికి ఈ సంవత్సరం నాంది పడుతోంది. శని ప్రభావం కారణంగా రాబోయే రెండున్నర సంవత్సరాలలో భారతదేశంలో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
భౌగోళిక జ్యోతిషం ప్రకారం ధనుస్సు రాశి విద్యాసంస్థలు, రాజకీయ పార్టిలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, న్యాయస్థానాలు, మత సంస్థలు మొదలైనవాటిని సూచిస్తుంది. ధను రాశిలో శని గోచారం ఈ సంస్థలపై వీటి అధిపతులపై ప్రభావం చూపిస్తుంది. శని ధనురాశిలో ఉన్నప్పుడే భారతదేశంలో ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. భారతదేశ ఆర్ధిక స్థితిలో కూడా రాబోయే రోజుల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 2018 మార్చ్ – మే మధ్యలో శని, కుజుల సంచారం ధను రాశిలో ఉంటుంది. ఈ సంచారం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మళ్ళి ఒకసారి ప్రభావం చూపించేది గా ఉంటుంది. అయితే ఈ సారి సామాన్యజనం పై దీని ప్రభావం ఉండదు. ఈ సమయంలో మొన్న నోట్ల రద్దు లాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సారి పైన చెప్పిన సంస్థలపై (విద్యాసంస్థలు, రాజకీయ పార్టిలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, న్యాయస్థానాలు, మత సంస్థలు మొదలైనవి..) ఈ ప్రభావం ఉంటుంది. వాటికీ సంబంధించి ఎవైన నిర్ణయాలు, సంస్కరణలు వెలువడే అవకాశం ఉంటుంది.
అలాగే వ్యాపార రంగంలో వైద్యం, రియల్ ఎస్టేట్, విద్య రంగాలపై ఈ శని గోచార ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రంగాలలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులన్నీ కూడా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్ళటానికి ఉపయోగ పడతాయి
ఈ రాశి వారికి ఈ రోజుతో అష్టమ శని పోతోంది. గత రెండున్నర సంవత్సరాలుగా వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, ఆర్థికం మీరు పడ్డ కష్టాలు ఈ రోజునుంచి తగ్గటం ప్రారంభం అవుతుంది. శని మారిన తెల్లారే జీవితం మారుతుంది అనుకోవద్దు. కానీ రాబోయే రెండున్నర సంవత్సరాలు మాత్రం గతంలో లా సమస్యాత్మకంగా ఉండదు. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు సమస్యలు తగ్గినా అభివృద్ధి అనుకున్నంత వేగంగా ఉండదు. అక్టోబర్ లో శని తో పాటు గురువు కూడా అనుకూలంగా వస్తున్నాడు. అప్పటి నుంచి మీకు అన్ని అనుకూలిస్తాయి.
మీకు ఈ రోజునుంచి అష్టమ శని ప్రారంభమవుతోంది. అయితే మీకు శని యోగాకరకుడు అవటం అలాగే అక్టోబర్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ తర్వాత ఉద్యోగంలో మార్పులు లేదా పని ఒత్తిడి పెరగటం, ఇష్టం లేని చోటుకు బదిలీ అవటం లేదా ఇష్టం లేని బాధ్యతలు చేపట్టాల్సి రావటం జరుగుతుంది. అలాగే మీరు చిన్న తప్పు చేసిన మిమ్మల్ని వేలెత్తి చూపే శత్రువులు చాలామంది తయారుగా ఉంటారు కాబట్టి ఎక్కువగా వివాదాలకు పోకుండా మీ పని మీరు సక్తమంగా, నిజాయితీగా చేయండి. అలాగే ఆవేశానికి లోనుకాకుండా ఉండండి. ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపు సగం కంటే ఎక్కువ సమయం గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా తేలికగానే బయటపడ గలుగుతారు.
శని మీకు ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది కూడా అంతగా అనుకూలమైన గోచారం కాదు. అక్టోబర్ వరకు గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్యకూడా సఖ్యత చెడుతుంది. వీలైనంత వరకు కోపానికి, అసహనానికి దూరంగా ఉండండి. మీరు రామ అన్నాకూడా ఎదుటివారికి తిట్టులాగా వినిపిస్తుంది. అపోహలు, అపార్థాలు పెరుగుతాయి. అయితే అక్టోబర్ నుంచి గురువు అనుకూలంగా వస్తున్నాడు కాబట్టి సమస్యలు చాల వరకు తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులు కూడా అక్టోబర్ వరకు కొత్త పెట్టుబడులు పెట్టక పోవటం మంచిది.
మీకు శని ఆరవ ఇంటిలో సంచరిస్తాడు. ఇది చాల మంచి గోచారం. ఉద్యోగంలో, ఆర్థికంగా మంచి అభివృద్ది సాధిస్తారు. ఇంతకాలం వాయిదాపడ్డ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉన్నవారు వాటిలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వారి సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. అయితే అక్టోబర్ నుంచి గురు గోచారం 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. వృత్తి పరంగా ఉత్సాహంతో అదనపు బాధ్యతలు స్వీకరించి తర్వాత ఒత్తిడిని తట్టుకోలేక బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్టోబర్ తర్వాత తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం.
మీకు శని ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. అర్దాష్టమ శని అయిపోతోంది కాబట్టి మీకు గడచినా రెండున్నరేళ్లుగా పడిన శ్రమకు రాబోయే రోజుల్లో ప్రతిఫలం లభిస్తుంది. ఐదవ ఇంట్లో శని సంచారం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శ్రమను తగ్గించినప్పటికీ బాధ్యతలను పెంచుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఎక్కువ బాధ్యతయుతంగా ఉండాల్సి వస్తుంది. అలాగే షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి రాబోయే సంవత్సరం వరకు పెట్టుబడులు, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విలాసాలు, వినోదాల పేరున అనవసరపు ఖర్చులు పెట్టకుండా చూసుకోండి.
మీకు శని 4వ ఇంట్లో సంచరిస్తాడు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి ఉండే సమయం ఇది. శని దృష్టి 6వ స్థానం, 10వ స్థానం మరియు జన్మ రాశి పై ఉంటుంది కాబట్టి శత్రువుల విషయంలో, ఉద్యోగం విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఎప్పుడు ఏ తప్పు చేస్తారా, మిమ్మల్ని ఎలా అవమానించాలా అని చాలామంది ఈ సమయంలో ఎదురు చూస్తుంటారు. మీ పని మీరు చేసుకోవటం, వేరే విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. అలాగే వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా వస్తోంది కాబట్టి శని ప్రభావము తగ్గుతుంది.
మీకు ఎల్నాటి శని ఈ రోజుతో అయిపోతోంది. గత ఏడున్నర సంవత్సరాలుగా రకరకాల సమస్యలతో బాధపడిన మీకు ఈ సంవత్సరం నుంచి అనుకూల సమయం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి అన్ని రకాలుగా బాగుటుంది. శని 3వ ఇంటిలో సంచరించే ఈ సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్ధిక సమస్యలు తొలగి పోవటం మొదలైన శుభ ఫలితాలుంటాయి. అక్టోబర్ వరకు పెట్టుబడుల విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవటం మంచిది. విదేశీయానం లేదా ఉద్యోగంలో ఉన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరంలో అనుకూలిస్తుంది. అయితే శని మారిన వెంటనే అనుకూల ఫలితాలు ప్రారంభం అవవు కాబట్టి కొంత ఓపిక పట్టడం మంచిది.
మీకు శని రెండవ ఇంటిలో సంచరిస్తాడు. గత 5 సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన ఆరోగ్య పరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కుంటున్న మీకు ఈ శని రెండవ ఇంటిలో సంచారం కొంత సహాయకారిగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొంత అభివృద్ధి సాధిస్తారు. శని 2వ ఇంట గోచారం కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని ఇబ్బందులను ఇస్తుంది. వారికీ ఆరోగ్య సమస్యలు రావటం కానీ, లేదా వారితో గొడవలు రావటం కానీ జరుగుతుంది. పెట్టుబడుల విషయంలో అక్టోబర్ వరకు మాత్రమే అనుకూల సమయం ఆ తర్వాత గురు గోచారం బాగుండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది.
మీకు శని 1వ ఇంట్లో సంచరిస్తాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎల్నాటి శని కారణంగా గత కొద్ది కాలంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న మీకు శని జన్మాన సంచరించటం కొంత ఊరట కలిగిస్తుంది. కొత్తసమస్యలు రాకుండా కొంతకాలం సంతోషంగా గడపవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి గురువు అనుకూల గోచారం ఉంటుంది కాబట్టి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. జన్మాన శని కారణంగా మనశ్శాంతి తగ్గుతుంది అకారణ కోపం భయం పెరుగుతాయి. అలాగే ఎవరిని చూసినా శత్రువులాగే కనిపిస్తాడు కాబట్టి ఈ సమయంలో తొందరపాటు మంచిది కాదు. మీ అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మియులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.
మీకు ఎల్నాటి శని ప్రారంభం అవుతోంది. శని మీ రాశికి అధిపతి అవటం మూలాన ఈ సమయం మిగతా వారికంటే తక్కువ సమస్యలతో పూర్తవుతుంది. అయితే శని పని మన కర్మ ఫలితాన్ని తొలగించటం కాబట్టి చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావటం, అలాగే ఖర్చులు పెరగటం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు అవటం జరుగుతుంది. అలాగే అనాలోచిత నిర్ణయాల కారణంగా కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక సంబంధ విషయాల్లో ఈ రెండున్నరేళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు సలహా ఇచ్చినా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ ప్రయాణాలు చేసేవారు కూడా అక్టోబర్ తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీకు శని 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది అత్యంత అనుకూలించే గోచారం. శని మీ రాశ్యాధిపతి అవటం మూలాన అన్నిరకాలుగా ఈ రెండున్నరేళ్ళ సమయం బాగుంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది. ఉద్యోగస్థులకు ఆర్థికంగా మంచి సమయం. అలాగే ఇల్లు లేదా భూమి కొనాలనుకుంటున్న వారు అక్టోబర్ తర్వాత తీసుకోవటం మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికీ ఈ రెండున్నరేళ్ళలో మంచి ఉపశమనం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు లేదా కొట్టగా వ్యాపారం ప్రారంభం చేయలనుకునే వారికి అక్టోబర్ తర్వాత నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది.
మీకు శని 10వ ఇంట్లో సంచరిస్తాడు. వృత్తి పరంగా ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరగటం అలాగే ఎంత పని చేసిన సరైన గుర్తింపు ఉందని కారణంగా కొంత నిరుత్సాహానికి గురి అవుతారు. అయితే ప్రస్తుతం గురు గోచారం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి కొంత ప్రోత్సాహకరంగానే ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు అక్టోబర్ లోపు పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు. ఆరోగ్య విషయంలో ఈ గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఎక్కువ అవటం కారణంగా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
శని గోచారం అనుకూలంగా లేని వారు శనికి తైలాభిషేకం చేయటం, పూజ చేయటం, లేదా శని జపం చేయటం మంచిది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శని ఎంత ఎక్కువ శ్రమ చేస్తే, ఎంత ఎక్కువ సాయం చేస్తే అంట ఎక్కువగా సంత్రుప్తుడు అవుతాడు. పూజలతో పాటుగా మీకు తూచిన విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.
by
సంతోష్ కుమార్ శర్మ గొల్లపెల్లి
Check September Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.
Read More