OnlineJyotish.com

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ పీఠిక - నవనాయకులు

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ పీఠిక - నవనాయకులు

సంవత్సరం, ఊరు ఎంచుకుని పట్టికలను చూడండి. ఆదాయ–వ్యయ, కందాయ సంఖ్యలు సంప్రదాయ సూచికలు; అవి డబ్బు మొత్తాలను సూచించవు. పంచాంగ పీఠికలో దేశం, వర్షాలు, పంటలు వంటి సామూహిక అంశాలపై సంప్రదాయ ఫలితాలు ఉంటాయి.

ఆదాయ–వ్యయాలు · కందాయ ఫలాలు · పంచాంగ పీఠిక

గ్రహ సంచార తేదీలు చూడండి

Ugadi Panchangam 2026-2027 Rajadhi Navanayakulu

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర రాజాధి నవ నాయకులు పూర్తి ఫలితాలతో

ఈ పరాభవ నామ సంవత్సరంలో దేశ, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి

ఆన్‌లైన్ జ్యోతిష్ (OnlineJyotish.com) పాఠకులకు నమస్కారం. ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా పడతాయి, ప్రజల జీవన విధానం, మార్కెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది 'రాజాధి నవనాయకుల' పై ఆధారపడి ఉంటుంది. ప్రముఖ జ్యోతిషులు సంతోష్ కుమార్ శర్మ గొల్లపల్లి గారి విశ్లేషణతో, స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర నవనాయకులు మరియు ఉపనాయకుల ఫలితాలను ఇక్కడ మీకు అందిస్తున్నాము.

పరాభవ నామ సంవత్సర రాజాది నవ నాయకులు

ఇక్కడ ఇవ్వబడిన ఫాం పూర్తి చేసి ఈ సంవత్సరం రాజాది నవ నాయకుల ఫలములు, ధరవరలు తెలుసుకొండి. పంచాంగాల్లో ఒకే ప్రదేశానికి ఇవి లెక్కిస్తారు కాబట్టి వేరే ప్రాంతాల్లో కానీ, వేరే దేశాల్లో ఉన్నవారికి సరైన ఫలితాలు రాకపోవచ్చు. అందుకో ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా ఉపయోగ పడేలా ఉండటానికి దీన్ని రూపొందించటం జరిగింది.

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5127వది, ప్రభవాది 60 సంవత్సరాలలో 40వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

  • కలియుగ శతాబ్దములు – 5127
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2097
  • శాలివాహన శతాబ్దములు – 1948
  • ఫసలీ శతాబ్దములు – 1436-37
  • హిజరీ శతాబ్దములు – 1448-49
  • శ్రీ రామానుజాబ్దములు – 1009
  • క్రీస్తు శకము – 2026-27

శ్రీ పరాభవ నామ సంవత్సర హిందూ చాంద్రమాన మాసాల ప్రారంభ తేదీలు (2026-2027)

నగరం: Hyderabad

అధిక మాసం మరియు క్షయ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కావు; అయితే నామకరణం, సీమంతం, అన్నప్రాశన చేయవచ్చు.

హిందూ మాసం (అమాంత) ప్రారంభ తేదీ
చైత్రంగురువారం, 19 మార్చి 2026
వైశాఖంశనివారం, 18 ఏప్రిల్ 2026
అధిక జ్యేష్ఠంఆదివారం, 17 మే 2026
నిజ జ్యేష్ఠంసోమవారం, 15 జూన్ 2026
ఆషాఢంబుధవారం, 15 జులై 2026
శ్రావణంగురువారం, 13 ఆగస్టు 2026
భాద్రపదంశనివారం, 12 సెప్టెంబర్ 2026
ఆశ్వయుజంఆదివారం, 11 అక్టోబర్ 2026
కార్తీకంమంగళవారం, 10 నవంబర్ 2026
మార్గశిరంబుధవారం, 09 డిసెంబర్ 2026
పుష్యంశుక్రవారం, 08 జనవరి 2027
మాఘంఆదివారం, 07 ఫిబ్రవరి 2027
ఫాల్గుణంమంగళవారం, 09 మార్చి 2027

ఈ సంవత్సర వర్ష యోగాలు - పంటల దిగుబడులు (సారాంశం)

వర్ష యోగం (మేఘాధిపతి - చంద్రుడు): వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు దేశవ్యాప్తంగా సమృద్ధిగా విస్తరించి అద్భుతమైన వర్షపాతాన్ని ఇస్తాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటాయి. పశువులకు, రైతులకు ఇది స్వర్ణయుగం.

మెట్ట పంటలు (సస్యాధిపతి - శుక్రుడు): ఉల్లి, వెల్లుల్లి, పత్తి, పూల తోటలు, ఉద్యానవనాలు (హార్టికల్చర్) అద్భుతమైన లాభాలు ఇస్తాయి. పండ్లు, ఫలసాయం సమృద్ధిగా లభిస్తుంది. ఆధునిక పద్ధతుల్లో చేసే హైడ్రోపోనిక్స్, గ్రీన్‌హౌస్ వ్యవసాయం యువతను ఆకర్షిస్తుంది.

ఆహార ధాన్యాలు (ధాన్యాధిపతి - బుధుడు): ఆన్‌లైన్ గ్రెసరీ, అగ్రి-కామర్స్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. మేఘాలు గాలిచే చెదరగొట్టబడటం వల్ల అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పంపిణీ వ్యవస్థలు, లాజిస్టిక్స్ రంగం లాభపడుతుంది.

నవ నాయకులు మరియు వారి ఫలితాలు
ప్రకటన
ఉపనాయకులు

12 రాశుల ఆదాయ, వ్యయముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

27 నక్షత్రాల కందాయ ఫలముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


చెల్లింపు జాతక నివేదికలు

మీ జనన వివరాలతో రూపొందించే విస్తృత PDF నివేదికలను పొందవచ్చు. కొనుగోలు చేసే ముందు నివేదికలోని అంశాలు, నమూనా, అందుబాటులో ఉన్న భాషలు మరియు ధరను చూడండి.

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వైదిక జ్యోతిష్కుడు మరియు వైదిక జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.