Adaya Vyayamulu 2026-2027 in Telugu
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర మేషాది 12 రాశుల ఆదాయ వ్యయములు
మీ రాశికి ఈ సంవత్సరం ఆర్థిక స్థితి, గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
ఆన్‌లైన్ జ్యోతిష్ (OnlineJyotish.com) పాఠకులకు నమస్కారం. కొత్త సంవత్సరం రాగానే ఆర్థికంగా మనం ఎలా ఉండబోతున్నాం? సమాజంలో మనకు ఎలాంటి గుర్తింపు దక్కబోతోంది? అన్న ఆలోచన అందరికీ వస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉగాది నాటికి ఉన్న గ్రహస్థితులను బట్టి, సంతోష్ కుమార్ శర్మ గొల్లపల్లి గారి గణితం ద్వారా పరాభవ నామ సంవత్సరానికి (2026-27) మేషాది 12 రాశుల ఆదాయ వ్యయాలు, మరియు రాజపూజ్య, అవమానాలను ఖచ్చితమైన పట్టిక రూపంలో ఇక్కడ అందిస్తున్నాము.
ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు
ఈ సంవత్సర రాజు: గురువు
| వ.సం. | రాశులు | రాజపూజ్యం | అవమానం | ఆదాయం | వ్యయం |
|---|---|---|---|---|---|
| 1 | మేషం | 2 | 4 | 11 | 5 |
| 2 | వృషభం | 5 | 4 | 5 | 14 |
| 3 | మిథునం | 1 | 7 | 8 | 11 |
| 4 | కర్కాటకం | 4 | 7 | 2 | 11 |
| 5 | సింహం | 7 | 7 | 5 | 5 |
| 6 | కన్య | 3 | 3 | 8 | 11 |
| 7 | తుల | 6 | 3 | 5 | 14 |
| 8 | వృశ్చికం | 2 | 6 | 11 | 5 |
| 9 | ధనస్సు | 5 | 6 | 14 | 11 |
| 10 | మకరం | 1 | 2 | 2 | 8 |
| 11 | కుంభం | 4 | 2 | 2 | 8 |
| 12 | మీనం | 7 | 2 | 14 | 11 |
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు కేవలం స్థూలంగా సంవత్సర శుభాశుభాలనే చెపుతాయి తప్ప మనకు వచ్చే ఆదాయ, వ్యయాలు కానీ, రాజపూజ్య అవమానాలు కాదని మనవి. ఆదాయం కానీ, రాజపూజ్యం ఎక్కువ ఉన్న సంవత్సరం స్థూలంగా బాగుంటుందని అర్థం. సంవత్సర మంచీచెడులు మన గోచారం మరియు మన జాతకం ఆధారంగా ఉంటాయి. కేవలం పైన ఇచ్చిన పట్టికనుబట్టి కాదని గమనించగలరు.