Hindu Jyotishమీ జ్యోతిష మార్గదర్శి తెలుగు
OnlineJyotish.com

స్వస్తిశ్రీ పరాభవ 2026-27 ఉగాది రాశి ఫలములు, ఉగాది పంచాంగం

మీ జన్మ చంద్రరాశి ప్రకారం ఫలాలను చదవండి. రాశి తెలియకపోతే ఉచిత జాతకంలో తెలుసుకోవచ్చు.

మరో రాశిని ఎంచుకోండి
రాశి, నక్షత్రం, దశ, గోచారం అంటే ఏమిటి?

పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న రాశి జన్మరాశి. నక్షత్రం అంటే ఆకాశాన్ని విభజించిన 27 భాగాల్లో ఒకటి; దానిలో నాలుగో వంతు పాదం. జన్మజాతకం నుంచి గణించే గ్రహ కాలాన్ని దశ అంటారు. గోచారం అంటే గ్రహాల ప్రస్తుత సంచారం.

ఉగాది ఫలాలు తెలుగు చాంద్రమాన సంవత్సరానికి సంబంధించినవి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే వార్షిక ఫలాలతో వీటి కాలపరిమితి భిన్నంగా ఉంటుంది.

గ్రహ సంచార తేదీలు చూడండి

Ugadi Panchangam 2026 Telugu Rasi Phalalu

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగము - రాశి ఫలములు

Telugu Panchangam details | Telugu Rashi phalaalu (Ugadi Rashiphalalu)

Telugu Rashi phalaalu (Ugadi Rashiphalalu)

ఉగాది అనగానే ప్రతి తెలుగు లోగిలి మామిడి తోరణాలతో, పచ్చడి రుచులతో, పంచాంగ శ్రవణంతో కళకళలాడుతుంది. తెలుగు వారికి ఇదొక పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశలకు, భవిష్యత్తు ప్రణాళికలకు నాంది. మన ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారం అన్నీ కాలగమనం పైనే, అనగా పంచాంగం పైనే ఆధారపడి ఉంటాయి. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు లాగే, జీవితంలో ఎదురయ్యే మిశ్రమ ఫలాలను ఎలా స్వీకరించాలో ఈ ఉగాది రాశి ఫలాలు మనకు దారిచూపుతాయి.

గమనిక: ఈ పరాభవ నామ సంవత్సర ఫలితాలను మరియు గ్రహ గోచార విశ్లేషణను 2004 నుండి జ్యోతిష శాస్త్రంలో విశేష అనుభవం ఉన్న ప్రముఖ జ్యోతిషులు సంతోష్ కుమార్ శర్మ గొల్లపల్లి గారు తెలుగు ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉండేలా అందించారు.

ప్రకటన

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5127వది, ప్రభవాది 60 సంత్సరాలలో 40వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

  • కలియుగ శతాబ్దములు – 5127
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2097
  • శాలివాహన శతాబ్దములు – 1948
  • క్రీస్తు శకము – 2026 - 2027

పరాభవ నామ సంవత్సర ప్రధాన గ్రహ గోచారాలు (Planetary Transits 2026)

ఏ సంవత్సరానికైనా రాశి ఫలాలు ఆ సంవత్సరంలో జరిగే ప్రధాన గ్రహాల మార్పుల పైనే ఆధారపడి ఉంటాయి. రాబోయే పుష్కరాలకు సన్నాహకంగా కూడా ఈ గ్రహస్థితులు ముఖ్యమైనవి. ఈ పరాభవ సంవత్సరంలో గురు, కుజ, రాహు, కేతువుల సంచార తేదీలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

గ్రహం (Planet) ప్రవేశించే తేదీ (Entry Date) రాశి (Sign) నిష్క్రమించే తేదీ (Exit Date)
కుజుడు (Mars)02/04/2026మీనం (Pisces)11/05/2026
కుజుడు (Mars)11/05/2026మేషం (Aries)20/06/2026
గురువు (Jupiter)02/06/2026కర్కాటకం (Cancer)31/10/2026
కుజుడు (Mars)20/06/2026వృషభం (Taurus)02/08/2026
కుజుడు (Mars)02/08/2026మిథునం (Gemini)18/09/2026
కుజుడు (Mars)18/09/2026కర్కాటకం (Cancer)12/11/2026
గురువు (Jupiter)31/10/2026సింహం (Leo)25/01/2027
కుజుడు (Mars)12/11/2026సింహం (Leo)10/03/2027
రాహువు (Rahu)06/12/2026మకరం (Capricorn)24/06/2028
కేతువు (Ketu)06/12/2026కర్కాటకం (Cancer)24/06/2028
గురువు (Jupiter - వక్రగతి)25/01/2027కర్కాటకం (Cancer)26/06/2027
కుజుడు (Mars - వక్రగతి)10/03/2027కర్కాటకం (Cancer)26/04/2027

పై పట్టిక ఆధారంగా, మీ రాశికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూల ఫలితాలు ఇస్తాయా అన్నది మీ వ్యక్తిగత రాశి ఫలాల్లో వివరంగా చదవవచ్చు.

ప్రకటన

రాజాధి నవనాయకుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

12 రాశుల ఆదాయ, వ్యయముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

27 నక్షత్రాల కందాయ ఫలముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

2026 - 2027 తెలుగు సంవత్సర రాశి ఫలములు (Select Your Sign)

తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిందూజ్యోతిష్ ఆప్ (Hindu Jyotish - Astrology App) ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.


పరాభవ సంవత్సర పంచాంగం & రాశి ఫలాలపై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ఈ సంవత్సరంలో గురువు జూన్ 2న కర్కాటక రాశిలోకి, అక్టోబర్ 31న సింహ రాశిలోకి మారుతాడు. అలాగే రాహు కేతువులు డిసెంబర్ 6, 2026న వరుసగా మకర, కర్కాటక రాశులలోకి ప్రవేశిస్తారు. ఈ మార్పులు వివిధ రాశులపై విశేష ప్రభావాన్ని చూపుతాయి.

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీక. మన రాశి ఫలాలు కూడా గ్రహస్థితుల ఆధారంగా ఈ సంవత్సరంలో మనం ఎదుర్కోబోయే మంచి, చెడులను సూచిస్తాయి. ముందుస్తుగా గ్రహస్థితులు తెలుసుకోవడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

రాశి ఫలాలు చదవడం వల్ల భవిష్యత్తులో రాబోయే ఆర్థిక, ఆరోగ్య, వృత్తిపరమైన ఒడిదుడుకులను ముందుగానే అంచనా వేసి, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు తగిన పరిహారాలు పాటించవచ్చు.

చెల్లింపు జాతక నివేదికలు

మీ జనన వివరాలతో రూపొందించే విస్తృత PDF నివేదికలను పొందవచ్చు. కొనుగోలు చేసే ముందు నివేదికలోని అంశాలు, నమూనా, అందుబాటులో ఉన్న భాషలు మరియు ధరను చూడండి.

ప్రకటన
Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వైదిక జ్యోతిష్కుడు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.