గురు, శుక్ర గ్రహ కారకత్వములు


How is the transit effect of Rahu over Meen Rashi and Ketu over Kanya Rashi on your zodiac sign? Read article in
English, Hindi , and Telugu

Click here for Year 2023 Rashiphal (Yearly Horoscope) in
English, हिंदी తెలుగు, বাংলা , ಕನ್ನಡ, മലയാളം, मराठी,and ગુજરાતી
December, 2023 Horoscope in
English, हिंदी, मराठी, ગુજરાતી , বাংলা , తెలుగు and ಕನ್ನಡ

గ్రహ కారకత్వములు

గురు, శుక్ర గ్రహ కారకత్వములు



గురువు: ధనము, విద్య, పుత్రులు, జ్యేష్టభ్రాత, దేహపుష్టి, బుద్ధి, అర్థసంపద, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిషము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహనసౌఖ్యం, ఆందోళికము, గజము, యజ్ఞయాగాది క్రతువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనము, వాగ్ధోరణి, పసుపురంగు, నృపసన్మానం, ధర్మం, వెండి, బ్రాహ్మణులు, జ్ఞానము, కోశాగారం, నవీనగృహం, బంధుసమూహం, సుబుద్ధి, ఉత్తరదిశ, కావ్యజ్ఞానము, నిక్షేపము, వైడూర్యము, ఊరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదవేదాంతజ్ఞానము, బ్రాహ్మణభక్తి, శ్రద్ధ, పాండిత్యం, బ్రాహ్మణవృత్తి, ఉపాధ్యాయవృత్తి, ముద్రాధికారం, భ్రాతృసుఖం, సంపత్తి, బహువిధ విద్వత్తు, వ్యాకరణం, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నతవిద్యలపై అధికారము, వాణిజ్యవిషయములు, ధనవిషయములు మొదలైనవి గురుని కారకత్వములు.

శుక్రుడు: వివాహం, భార్య, భాగ్యం, భోగం, వాహనం, కామసుఖం, సంగీతం, విద్యాది రహస్యం, నృత్యం, సంగీతం, లలితకళలు, సరససల్లాపము, శిల్పం, జ్యోతిషం, కవిత్వం, స్త్రీ సౌఖ్యం, ఆభరణం, మణిమాణిక్యాది కారకుడు, నాటకాలంకార సాహిత్యాదులు, వ్యభిచారం, నృత్తము, ఆభరణం, ఐశ్వర్యం, ముద్రాధికారం, హాస్యం, రహస్యమోహము, వేశ్యాసంభోగం, సౌమ్యం, సౌందర్యం, శ్వేతవర్ణం, సునేత్రం, ఖండశరీరం, పొట్టి, గర్వం, దృడత్వం, ఆజ్ఞ, శుక్లం, శయనాగారం, మంత్రం, ఆగ్నేయదిశ, మధ్యవయస్సు, రాజముద్ర, సత్యవచనం, యజుర్వేదము, భరతశాస్త్రం, శ్వేతఛత్రం, వింజామరలు, ఐశ్వర్యము, సింహాసనము, సుగంధము, హేమము, రాజు, రతి, స్త్రీసుఖం, గానం, కాంతి, కళాకౌశలం, స్పర్ష, గొంతు, మూత్రపిండములు, అండకోశము, అంతఃకరణముమీద ప్రభావం, భూతదయ, ఉన్నతమైన మేధాశక్తి, సంగీతము, నాట్యము, నాటకశాలలు, పద్యకవిత్వము, చిత్రలేఖనము మొదలైన వాటికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు.


Monthly Horoscope

Check December Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  


Set achievable goals and work towards them, success is within reach.