కుజ, బుధ గ్రహ కారకత్వములు - జ్యోతిష పాఠములు

గ్రహ కారకత్వములు

కుజ, బుధ గ్రహ కారకత్వములు



కుజుడు: కనిష్టసోదరీ సోదరులు, సేవకాగుణం, భూమి, ప్రాకారం, రోగము, వ్రణము, సాహసం, శస్త్రములు, అగ్ని, స్పోటకము,సందర్శనము, ఉత్పాటనము, రక్తవస్త్రప్రియుడు, కాలినవస్త్రం, బÁుుణము, ఉద్యానవనము, బలము, వనచరుడు, స్వర్గకారకుడు, పిత్తము, రాగి, పొట్టి, శౌర్యము, దొంగ, యుద్ధప్రియత్వము, విరోధము, రాజు, వాక్కు, కటినాధిపత్యం, సీసం, విదేశగమనం, దక్షిణదిశ, తర్కశాస్త్రం, శస్త్రవిద్య, శతృవృద్ధి, స్పోటకము, మూర్ఖత్వము, ఆయుధధారణ, వాగ్వాదం, మూత్రకుచ్ఛము, గణితం, కటినమైన శిక్షలు విధించు ఉద్యోగం, మిల్లులు, పోలీసు, మిలటరీ, విద్యుత్తు, వ్యవసాయం, ధైర్యము, శౌర్యము, ఆత్మగౌరవము, మూత్రాశయము, కండలు, తల, ముఖము, మజ్జ, ఎడమచెవి, లింగము, రసవీంద్రియములమీద ప్రభావము, మొదలైనవాటికి కుజుడు కారకత్వము వహిస్తాడు.

బుధుడు: ప్రజ్ఞ, కర్మ, విజ్ఞానం, గణితం, కావ్యము, శిల్పము, జ్యోతిషము, విద్య, మేనమామ, చింత, బుద్ధి, సుందరస్వరూపం, శాంతం, గృహప్రవేశం, వ్యాపారం, వ్యవహారం, వేదాంతవిచారణ, సేవకులు, నాభి, గుహ్యం, విష్ణు ఉపాసన, వ్యాకరణం, నామకరణం, మైథునం, విష్ణుభక్తి, వైద్యము, యుక్తి, భుక్తి, దాసదాసీజన వృద్ధి, పరిహాసము, జ్ఞాతులు, తంత్రము, నపుంసకుడు, పాదచారి, అడ్డచూపు, యువరాజు, పికిలిన వస్త్రం, రజోగుణం, సునేత్రం, ఆకుపచ్చ, రచన, మేడలు, వినయం, రత్నశోధన, శూద్రజాతి, యాత్ర, సమదృష్టి, భయం, భూమి, స్థిరము, వాక్కు, హాస్యము, వాయవ్య దిశ, వేదాంతం, గుమాస్తా, పుస్తకములు వ్రాయుట, అమ్ముట, తీర్పుచెప్పుట, నాటకములు, సినిమాలు, వ్యాపారము, పుత్ర సుఖదుఃఖము, మాతులసుఖం, గణితం, వేదాంతం, శిల్పశాస్త్రం, వక్తృత్వం, శరీరంలోని నాడులు, నరముల మీద ప్రభావం, ప్రేగులు, ముంజేయి, నోరు, నాలుక, దృష్టి, భావము, ఇంద్రియజ్ఞానము, ఊహ, భాషాంతరీకరణము, శైలి, అలవాటు వలన విద్యనభ్యసించటం, అనుకరణ మొదలైనవి బుధకారకత్వములు.


KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  


Success is a journey, not a destination. Keep pushing forward and it will come.