శని, రాహు మరియు కేతు గ్రహ కారకత్వములు - జ్యోతిష పాఠములు

గ్రహ కారకత్వములు

శని, రాహు మరియు కేతు గ్రహ కారకత్వములు

శని: ఆయువు, జీవనోపాయం, మరణం, సేవకులు, జైలు, బంధనం, ప్రవాసం, నీచవిద్య, నీచదేవతోపాసన, దుఃఖము, అధర్మం, స్ఫోటకం, కురూపం, శాంతము, అనాచారం, నల్లధాన్యములు, మహిషము, పితృకారకత్వం, దుష్ప్రవర్తన, కోపము, పాపము, నరకము, నీచజీవనము, హూణవిద్య, కృషిజీవనం, శూద్రప్రియుడు, క్రిందిచూపు, అజీర్ణము, అసత్యం, అన్యకుల విద్య, కఠినము, ఔదార్యం, కఠినరోమములు, పౌరుషహీనం, మలినవస్త్రం, నీలమణి, ఇనుము, వాయువు, భూపరాగం, తిల, తైలములు, దాస్యము, విరోధం, దుఃఖం, మరణం, నపుంసకత్వం, ప్రతిబంధనం, ఈశాన్యదిశ, అడవుల సంచారం, పౌరుషం, వాతము, వాద్యధ్వని, దుస్సహాసము, కార్యభంగము, కిరాతత్వము, వ్యసనము, జ్యేష్టసోదరుడు, నౌఖరుల సుఖదుఃఖాలు, ఘాతుక స్వభావం, దారిద్య్రం, కారాగృహవాసం, కుడిచెవి, శ్రవణశక్తి, ఎముకలు, పలువరుస, మోకాలు, ప్లీహము మొదలైనవి శని కారకత్వములు.



రాహువు: మాతామహులు, మాతామహ సంబంధములు, ఛత్రం, హూణవిద్య, తటాకములు, ఆరామములు, సీసము, సన్మానము, యవ్వనం, బొమికెలు, పాపస్త్రీవలన లాభము, వ్యయము, వ్యవసాయము, వ్యాపారము, వ్యతిరిక్తత, వైధవ్యం, వృక్షపతనము, శిలలు, బలాత్కారము, సంకోచము, ఉద్యోగము, వివాహము, యుద్ధము, బొగ్గు, ధూమపానము, పొగాకు, ఛామరం, పితృచింత, విషవైద్యము, క్షుద్రమంత్రాలు, నీచజీవనము, ద్యూతం, పశుసాంగత్యం, అపసవ్యలిపి, హృద్రోగం, గారడి, లాటరీలు, కుతర్కం, పాపస్త్రీ, పాము, రాత్రి, ఏకఛత్రాధిపత్యం, నైబÁుుతిదిశ, రాజ్యము, జూదగుణం, స్వదేశ, విదేశగమనం, నీచాశ్రయం, శ్వాస, ప్రేతత్వము, కర్మ, విసనకర్ర, వైద్యశాస్త్రం, రత్నపరీక్ష మొదలైనవి రాహుకారకత్వములుగా చెప్పబడ్డాయి.



కేతువు: పితామహచింత, మట్టిపాత్రలు, మోక్షము, ఆలస్యం, నిద్ర, ముక్కు, స్వప్నము, జాగ్రదవస్థ, ప్రవాసము, ఉదరము, నేత్రసంబంధము, మూఢభక్తి, మంత్రతంత్రములు, చిత్రలిపి, క్రూరకృత్యములు, యోగాభ్యాసము, పింగాణి, బహుదాతృత్వము, వేదాంతవిచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, అన్యభాషాప్రవేశం, కిరాతకం, పాషాణం, వ్రణం, అల్పాహారము, శతృబాధ, జడత్వం, కపలత్వం, వైద్యము, కృత్రిమమణులు, కృత్రిమ వస్తువులు, స్ఫోటకము, తారు, విషాదము, గంగాస్నానము, భోగభాగ్యములు, మూఢభక్తి, లోభత్వం, అన్యభాష, మిత్రభేదము, శైవదీక్ష, మతము, మతఛాందసము, దంభము, నటనము, భిక్షాటన, కీర్తి, కపాలము, స్నేహము, బ్రహ్మవిద్య, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతు కారకత్వములు.


KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.

Read More
  
 

KP Horoscope

 

Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.

 Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  
 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

 Read More
  

Contribute to onlinejyotish.com


QR code image for Contribute to onlinejyotish.com

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.

Read Articles