గురు, శుక్ర గ్రహ కారకత్వములు - జ్యోతిష పాఠములు

భావకారకత్వములు - అంశాల వారి విభజన:



లగ్నము నుంచి వ్యయము వరకు గల భావములు మానవజీవితములో వివిధ అంశములకు కారకత్వము వహిస్తాయని గత పాఠాల ద్వారా తెలుసుకున్నారు. మరింత సులభముగా అర్థము కావటానికి ప్రధాన కారకత్వములను అంశాల వారిగా తిరిగి ఒకసారి ఇస్తున్నాను. వ్యక్తిగత కారకత్వములు, శరీరాంగములు, సమాజము, ఇతరములు అనే విభాగాలుగా ఈ కారకత్వములను అందించటం జరుగుతున్నది.

1. లగ్నం: కేంద్రము మరియు కోణము
వ్యక్తిగత కారకత్వములు: వ్యక్తియొక్క సంపూర్ణ స్వరూపము, వ్యక్తిగతము, వ్యక్తిత్వము, మనస్తత్వము, అంతరంగము, తెలివితేటలు, మనస్థైర్యం, ప్రవర్తన, గౌరవము, కీర్తిప్రతిష్టలు, జీవితములో ఉన్నతస్థానానికి ఎదగాలనే బలమైన కోరిక.
శరీరము: బాల్యావస్థ, చిన్నతనము నాటి విషయాలు, పుట్టిన సమయములోని స్థితిగతులు, శరీరము, శరీరతత్వము, రోగనిరోధక శక్తి, తల, మెదడు, వెంట్రుకలు, చర్మము, వర్ణము
సమాజము : ప్రస్తుత సమాజము, ప్రస్తుత పరిస్థితులు. ఇతరములు: జన్మస్థలము.

2. ధనస్థానము: మారకస్థానము.
వ్యక్తిగతం: భాష, తెలిసిన భాషలు, భావవ్యక్తీకరణ, నిజాయితీ కలిగి ఉండటం, ముందుచూపు, తనవారికి సహాయం చేయడానికి ముందుండటం
శరీరము: ముఖము, కన్నులు(ముఖ్యముగా కుడికన్ను), ముక్కు, నోరు, నాలుక, దంతములు. సమాజము: కుటుంబము, కుటుంబసభ్యులు మరియు వారి మంచి,చెడు, జీవితభాగస్వామి, (ముఖ్యముగా విడాకులు లేదా మొదటి భాగస్వామి మరణానంతరం వచ్చే రెండవ జీవితభాగస్వామి.)
ఇతరములు: ఆర్థిక వ్యవహారములు, ధనము, చరాస్థులు, విలువైన వస్తువులు, డబ్బు, సంపద, ఆదాయము, దగ్గరి భవిష్యత్తు.


Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  


A smile can change your day, keep a positive attitude and spread happiness.