onlinejyotish.com free Vedic astrology portal

మీ జాతకం: గ్రహాలు మీ గురించి ఏమి చెబుతున్నాయి? (Complete Vedic Horoscope)


మీ సంపూర్ణ జాతకం (జన్మ కుండలి) - తెలుగులో

జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు తెలుసుకోవడానికే కాదు, మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఉపయోగపడే దిక్సూచి. మీ పుట్టిన సమయాన్ని బట్టి, గ్రహాలు మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇక్కడ తెలుసుకోండి.

Updated: April 2026 | Method: Chitra Paksha (Lahiri) Ayanamsa

మీ జాతకాన్ని ఉచితంగా తెలుసుకొండి



ఈ జాతక రిపోర్ట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?

సాధారణంగా మనం జాతకం కోసం పండితుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారు పంచాంగాన్ని, గ్రహ స్థితులను గణించి ఫలితాలు చెబుతారు. సరిగ్గా అదే పద్ధతిలో, ఈ సాఫ్ట్‌వేర్ క్షణాల్లో మీ జాతకాన్ని విశ్లేషిస్తుంది.

సంపూర్ణ గ్రహ స్థితి

లగ్నం నుండి శని వరకు... ఏ గ్రహం ఏ రాశిలో ఉంది? అది మీకు మిత్రమా లేక శత్రువా? దానికి ఎంత బలం (Shadbala) ఉంది?

దోషాలు & వైదిక పరిహారాలు

వివాహానికి అడ్డంకిగా మారే కుజ దోషం, లేదా అభివృద్ధిని ఆపే కాలసర్ప దోషం ఉందా? ఉంటే దానికి సులభమైన పరిహారాలు.

దశాంతర్దశ ఫలితాలు

రాబోయే రోజుల్లో మీకు ఏ దశ నడుస్తుంది? గురు దశలో అభివృద్ధి ఉంటుందా? శని దశలో జాగ్రత్తలు అవసరమా?

ముద్రణ (Print) సౌకర్యం

ఈ జాతకాన్ని మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నేరుగా ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవచ్చు.

onlinejyotish.com ప్రత్యేకత ఏమిటి?

గత రెండు దశాబ్దాలుగా (Since 2004), మేము జ్యోతిష్యాన్ని ఒక వ్యాపారంగా కాకుండా, ఒక సేవగా అందిస్తున్నాము.

  • ప్రామాణికత: మేము కేవలం "లాహిరి" (Lahiri Ayanamsa) పద్ధతిని మాత్రమే అనుసరిస్తాము. ఇది భారతీయ జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రామాణికమైనది.
  • గోప్యత (Privacy): మీరు నమోదు చేసే వివరాలు ఎక్కడా సేవ్ చేయబడవు. జాతకం చూసుకున్న వెంటనే అవి చెరిగిపోతాయి.
  • తెలుగుదనం: కంప్యూటర్ అనువాదంలా కాకుండా, వాడుక భాషలో, అర్థమయ్యే రీతిలో ఫలితాలు ఉంటాయి.

సాధారణ సందేహాలు (FAQ)

Frequently Asked Questions

జ్యోతిష్యం అనేది నమ్మకం మాత్రమే కాదు, అది ఖగోళ గణితం. మా సాఫ్ట్‌వేర్ 'దృక్ సిద్దాంతం' (Drik Ganitha) మరియు 'లహరి ఆయనాంశ' (Lahiri Ayanamsa) పద్ధతులను ఉపయోగిస్తుంది. నాసా (NASA) వారి గ్రహ స్థితుల డేటాను వాడటం వల్ల, మాన్యువల్‌గా రాసే జాతకాల కంటే ఈ కంప్యూటర్ జాతకం డిగ్రీలతో సహా అత్యంత ఖచ్చితంగా ఉంటుంది.

జాతక చక్రంలో 'లగ్నం' మారకూడదు అంటే పుట్టిన సమయం చాలా ముఖ్యం. సుమారుగా సమయం తెలిస్తే, రాశి మరియు నక్షత్రం సరిగ్గా రావచ్చు కానీ, లగ్నం మరియు నవాంశ మారే అవకాశం ఉంది. మీకు సమయం అస్సలు తెలియకపోతే, మా 'ప్రశ్న శాస్త్రం' (Horary Astrology) విభాగాన్ని ఉపయోగించడం మంచిది.

చాలా మందికి ఉండే సందేహం ఇదే. మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న స్థానాన్ని 'రాశి' అంటారు (ఇది మీ మనస్సును సూచిస్తుంది). తూర్పు దిక్కున ఉదయించే రాశిని 'లగ్నం' అంటారు (ఇది మీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని సూచిస్తుంది). ఈ చిత్రం చూస్తే మీకు అర్థమవుతుంది—లగ్నం అనేది 'నేను' అయితే, రాశి అనేది 'నా ఆలోచన'. ఫలితాలు చెప్పడానికి రెండూ ముఖ్యమే.

కచ్చితంగా. ఈ రిపోర్ట్‌లో కుజ దోషం (Manglik Dosha) ఉందా లేదా అనేది స్పష్టంగా ఇవ్వబడుతుంది. అంతేకాదు, ఒకవేళ దోషం ఉంటే అది ఎంత తీవ్రంగా ఉంది? దానికి మినహాయింపులు (Exceptions) ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను కూడా మా సాఫ్ట్‌వేర్ విశ్లేషించి మీకు చెబుతుంది.

అవును. మన తెలుగు వారికి చతురస్రాకారపు (Square) జాతక చక్రం అలవాటు. ఉత్తరాది వారికి డైమండ్ షేప్ అలవాటు. మా సాఫ్ట్‌వేర్ డీఫాల్ట్‌గా మన దక్షిణ భారత పద్ధతిలోనే జాతక చక్రాన్ని అందిస్తుంది. మీకు కావాలంటే సెట్టింగ్స్‌లో మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
Santhosh Kumar Sharma - Vedic Astrologer

సంపాదకులు: శ్రీ సంతోష్ కుమార్ శర్మ గొల్లపెల్లి

Vedic Astrologer & Developer (31+ Years Experience)

జాతకం అనేది భయం కోసం కాదు, బాధ్యతగా జీవించడానికి. శాస్త్రీయమైన పద్ధతిలో, ఆధునిక సాంకేతికతను జోడించి ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాము.


గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు మరియు గ్రహణాల తేదీలు అత్యంత ఖచ్చితమైన స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంత ఆధారంగా లెక్కించబడ్డాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ మరియు చంద్రోదయ, చంద్రాస్తమయ సమయాలలో ఉండే సెకన్ల ఖచ్చితత్వం వల్ల, సంకష్టి చతుర్థి, వ్రతాలు మరియు గ్రహణాల తేదీలలో ఎలాంటి దోషం లేకుండా అత్యంత ఖచ్చితమైన ఫలితాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

OnlineJyotish.com కి మీ సహకారం అందించండి.

onlinejyotish.com

మా వెబ్ సైట్ (onlinejyotish.com) లో అందిస్తున్న జ్యోతిష సేవలు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీరు మా వెబ్సైట్ అభివృద్ధికి క్రింద ఇచ్చిన వాటిలో ఏదైనా ఉపయోగించి సహకరించండి.

1) పేజీని షేర్ చేయండి
మీ ఫేస్‌బుక్, ట్విట్టర్ (X), వాట్సాప్ మొదలైన వాటిలో ఈ పేజీని షేర్ చేయండి.
Facebook Twitter (X) WhatsApp
2) 5⭐⭐⭐⭐⭐ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి
గూగుల్ ప్లేస్టోర్ మరియు గూగుల్ మై బిజినెస్‌లో మా ఆప్/వెబ్సైట్ గురించి 5-స్టార్ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి.
మీ రివ్యూ వల్ల మరింత మంది వరకు సేవలు చేరుతాయి.
3) మీకు నచ్చిన అమౌంట్ కంట్రిబ్యూట్ చేయండి
క్రింద ఇచ్చిన UPI లేదా PayPal ద్వారా మీకు నచ్చిన అమౌంట్ పంపి కంట్రిబ్యూట్ చేయండి.
UPI UPI Pay
PayPal Email us
✅ కాపీ అయింది.