OnlineJyotish


జనవరి 2025 రాశి ఫలాలు - తులా రాశి - జనవరి నెల తులా రాశి జాతకం


తులారాశి January జనవరి 2025 రాశిఫలములు

Tula Rashi - Rashiphalalu January 2025

జనవరి నెలలో తులా రాశి జాతకుల కోసం ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు

image of Tula Rashiతుల రాశి, రాశి చక్రంలోని ఏడవ రాశి. ఇది రాశి చక్రం యొక్క 180-210th డిగ్రీలను కలిగి ఉంటుంది. చిత్తా నక్షత్ర (3, 4 పాదాలు), స్వాతి నక్షత్ర (4పాదాలు), విశాఖా నక్షత్ర (1, 2, 3 పాదాలు) కింద జన్మించిన వారు తులా రాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు.


తులా రాశి - జనవరి నెల రాశి ఫలాలు


జనవరి 2025 నెలలో తులా రాశి గ్రహ గోచారం

సూర్యుడు
మీ రాశికి 11వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈనెల 14వ తేదీ వరకు 3వ ఇల్లైన ధనస్సు రాశిలో సంచరించి, ఆ తర్వాత 4వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు
మీ రాశికి 9వ మరియు 12వ ఇండ్ల అధిపతి అయిన బుధుడు ఈనెల 4వ తేదీ వరకు 2వ ఇళ్లైన వృశ్చిక రాశిలో సంచరించి, ఆ తర్వాత 3వ ఇల్లైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు, తిరిగి ఈ నెల 24వ తేదీన 4వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రుడు
మీ రాశ్యాధిపతి మరియు 8వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈనెల 28వ తేదీ వరకు 5వ ఇల్లైన కుంభరాశిలో సంచరించి, ఆ తర్వాత 6వ ఇల్లు, తన ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజుడు
మీ రాశికి 2వ మరియు 7వ ఇండ్లకు అధిపతి అయిన కుజుడు, వక్రగతుడై ఈ నెల 21వ తేదీ వరకు తన నీచ రాశి మరియు 10వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో సంచరించి, ఆ తర్వాత 9వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.

గురుడు
మీ రాశికి 3వ మరియు 6వ ఇండ్లకు అధిపతి అయిన గురువు వక్ర గతుడై ఈ నెలలో కూడా 8వ ఇల్లైన వృషభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

శని
మీ రాశి నుంచి 4వ మరియు 5వ ఇండ్లకు అధిపతి అయిన శని ఈ నెలలో కూడా 5వ ఇల్లైన కుంభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

రాహువు
రాహువు 6వ ఇల్లైన మీన రాశిలో ఈ నెల కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

కేతువు
కేతువు 12వ ఇల్లైన కన్య రాశిలో ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.



జనవరి 2025 నెలలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది?

ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్దంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పనిలో ఒత్తిడి తగ్గడం వల్ల మీరు సంతోషంగా గడపగలుగుతారు. కార్యాలయ సంబంధిత ప్రయాణాలు కూడా సూచించబడతాయి. అయితే, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొన్ని అపార్థాలు లేదా ప్రతికూలమైన మాటలు మీపై వ్యాపించవచ్చు. కుజ గ్రహం 2వ ఇంటిపై సంచరించడం వల్ల, మీరు కొంత మొండి స్వభావంగా ఉండే అవకాశం ఉంది. మీ వాగ్దానం మరియు మాట్లాడే తీరు మీద నియంత్రణ అవసరం. అధికంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవవచ్చు. ద్వితీయార్థంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మరియు మీ మాటలను మీ సహ ఉద్యోగులు సరిగా అర్థం చేసుకోకపోవడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవ్వటం వలన కొంత ఇబ్బంది పడతారు. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండటం మరియు ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయటం వలన ఇబ్బందులు తొలిగిపోతాయి.

జనవరి 2025 నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెల ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రుణం లేదా లబ్ధి పొందగలుగుతారు. మూడో వారం నుంచి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మరియు ఆదాయంలో కొంత తగ్గుదల కనిపించవచ్చు. పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఈ నెలలో ప్రధానంగా విలాస వస్తువులు మరియు వినోదయాత్రలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది.

జనవరి 2025 నెలలో కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెల కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రథమార్దంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేయటం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేస్తారు. ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ద్వితీయార్థంలో మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదాలను ఎదుర్కొనవచ్చు, ముఖ్యంగా నెల మూడో వారంలో. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే, కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవద్దు. ఒక వారం తర్వాత పరిస్థితి మళ్లీ సాదారణ స్థితికి వస్తుంది. ఓర్పుతో వ్యవహరించడం ద్వారా కుటుంబ అనుబంధం మెరుగుపడుతుంది. ఈనెల ద్వితీయార్థంలో మీరు మీ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు మామూలుగా మాట్లాడినప్పటికీ ఎదుటివారికి ఆ మాటలు పరుషంగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపిగ్గా వారికి అర్థమయ్యేలా మాట్లాడటం మంచిది. దానివలన అనవసర సమస్యలు రావు.



జనవరి 2025 నెలలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెలలో ప్రధమార్గంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ, ద్వితీయార్థంలో భావోద్వేగాలు మరియు నరాల సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తపోటు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటం మరియు ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిది. దాని కారణంగా శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

జనవరి 2025 నెలలో వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది?

వ్యాపారంలో ఈ నెల సాధారణ స్థితిలో ఉంటుంది. ప్రథమార్దంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి చూస్తారు. మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించాలని కొంటే అది ఈ సమయంలో చేయడం అనుకూలంగా ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో వ్యాపారం కొంత సామాన్యంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యాపారంపై కొన్ని ప్రతికూలమైన మాటలు వ్యాపించే అవకాశం ఉంది. దీని కారణంగా వ్యాపారం తగ్గటం కానీ లేదా చేసుకున్న ఒప్పందాలు రద్దు అవటం లేదా వాయిదా పడటం జరగవచ్చు. ఈ సమస్యపై శ్రద్ధ వహించాలి. కస్టమర్లతో గొడవపడకుండా, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి.

జనవరి 2025 నెలలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది?

విద్యార్థులకు ఈ నెల ప్రథమార్ధం అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి విద్యాసంస్థలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఈ నెలలో శుభవార్త లభించే అవకాశముంది. నిత్య అభ్యాసం ద్వారా విజయం సాధించగలుగుతారు. ద్వితీయార్థంలో చదువు విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి పెరగడం వలన చదువు వాయిదా వేయటం లేదా వేరే విషయాలపై దృష్టి పెట్టడం చేస్తారు, ఈ సమయంలో వీలైనంతవరకు చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది.



మీకు వీలైతే ఈ పేజీ లింకును లేదా https://www.onlinejyotish.com ను మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సాయం మరిన్ని ఉచిత జ్యోతిష సేవలు అందించటానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు




Aries (Mesha Rashi)
Imgae of Aries sign
Taurus (Vrishabha Rashi)
Image of vrishabha rashi
Gemini (Mithuna Rashi)
Image of Mithuna rashi
Cancer (Karka Rashi)
Image of Karka rashi
Leo (Simha Rashi)
Image of Simha rashi
Virgo (Kanya Rashi)
Image of Kanya rashi
Libra (Tula Rashi)
Image of Tula rashi
Scorpio (Vrishchika Rashi)
Image of Vrishchika rashi
Sagittarius (Dhanu Rashi)
Image of Dhanu rashi
Capricorn (Makara Rashi)
Image of Makara rashi
Aquarius (Kumbha Rashi)
Image of Kumbha rashi
Pisces (Meena Rashi)
Image of Meena rashi
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Free Astrology

Star Match or Astakoota Marriage Matching

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceWant to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages:  English,  Hindi,  Telugu,  Tamil,  Malayalam,  Kannada,  Marathi,  Bengali,  Punjabi,  Gujarati,  French,  Russian, and  Deutsch Click on the language you want to see the report in.

Marriage Matching with date of birth

image of Marriage Matchin reportIf you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Русский, and   Deutsch . Click on the desired language to know who is your perfect life partner.