OnlineJyotish


ఫిబ్రవరి 2025 రాశి ఫలాలు - కుంభ రాశి - ఫిబ్రవరి నెల కుంభ రాశి జాతకం


కుంభ రాశి February ఫిబ్రవరి 2025 రాశి ఫలములు

Kumbha Rashi - Rashiphalalu February 2025

ఫిబ్రవరి నెల కుంభ రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు

image of Kumbha Rashiకుంభరాశి, రాశి చక్రంలోని పదకొండవ రాశి. ఇది రాశిచక్రం యొక్క 300-330th డిగ్రీలను కలిగి ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర (3 వ, 4 వ పాదాలు), శతభిష నక్షత్ర (4 పాదాలు), పూర్వాభాద్ర నక్షత్ర (1 వ, 2 వ, 3 వ పాదాలు) లో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశివారికి అధిపతి శని.

కుంభ రాశి - ఫిబ్రవరి నెల రాశి ఫలాలు


ఫిబ్రవరి 2025 నెలలో కుంభ రాశి గ్రహ గోచారం

సూర్యుడు

మీ రాశి నుంచి 7వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఫిబ్రవరి 12, బుధవారం రోజున 12వ ఇల్లైన మకర రాశి నుంచి, 1వ ఇల్లైన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు

మీ రాశి నుంచి 5వ మరియు 8వ ఇళ్లకు అధిపతి అయిన బుధుడు, ఈ నెల మొదట ఫిబ్రవరి 11, మంగళవారం రోజున 12వ ఇల్లైన మకర రాశి నుంచి, 1వ ఇల్లైన కుంభ రాశిలోకి వెళ్ళి సూర్యుడితో కలుస్తాడు. ఆ తరువాత, ఫిబ్రవరి 27, గురువారం రోజున మీ రాశికి 2వ ఇల్లు, తన నీచ రాశి అయిన మీన రాశిలోకి వెళతాడు.

శుక్రుడు

మీ రాశి నుంచి 4వ మరియు 9వ ఇళ్లకు అధిపతి అయిన శుక్రుడు, ఈ నెలంతా 2వ ఇల్లు, తన ఉచ్చ రాశి అయిన మీన రాశిలో సంచరిస్తాడు.

కుజుడు

మీ రాశి నుంచి 3వ మరియు 10వ ఇళ్లకు అధిపతి అయిన కుజుడు, ఫిబ్రవరి అంతా 5వ ఇల్లైన మిధున రాశిలో సంచరిస్తాడు.

గురువు

మీ రాశి నుంచి 2వ మరియు 11వ ఇళ్లకు అధిపతి అయిన గురువు ఈ నెలంతా 4వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు.

శని

మీ రాశి నుంచి లగ్నాధిపతి మరియు 12వ ఇంటి అధిపతి అయిన శని, ఈ నెలలో కూడా 1వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు.

రాహువు మరియు కేతువు

ఈ నెలంతా రాహువు మీ రాశి నుంచి 2వ ఇల్లైన మీన రాశిలో, కేతువు 8వ ఇల్లైన కన్య రాశిలో సంచరిస్తారు.



ఉద్యోగం

ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు ప్రమోషన్, లేదా ఆర్థిక పరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, అయితే అదే సమయంలో, మీ పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని కోల్పోకండి. ఎందుకంటే పనిభారం వల్ల మీ పై అధికారులతో లేదా మీ సహోద్యోగులతో వాగ్వివాదం జరగవచ్చు. మీ పనులు పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైమ్ పనిచేయాల్సి రావొచ్చు. అయితే ఈ నెల అంతా కుజుని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం మరియు శుక్రుని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగ పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత మేరకు అనుకూల ఫలితం లభిస్తుంది.

ఆరోగ్యం

ఈ నెల ఆరోగ్యం పరంగా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్ధంలో మీకు మానసిక ఒత్తిడి, తలనొప్పి, కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ విషయంలో సహాయపడుతుంది. ద్వితీయార్థంలో తల మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుజుని గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయట పడగలుగుతారు.

ఆర్థిక స్థితి

ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్ధంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ జీవిత భాగస్వామి కారణంగా లేదా కుటుంబ సభ్యుల కారణంగా డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం. ద్వితీయార్థంలో మీ పెట్టుబడులపై మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. చిన్న, చిన్న తరహా పెట్టుబడులు పెట్టొచ్చు కానీ ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడులపై మీ డబ్బు పెట్టడం మంచిది కాదు.



కుటుంబం

ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్ధంలో సూర్యుడు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారితో మనస్పర్థలు ఏర్పడడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మరియు ఏ విషయం అయినా కూడా ఎక్కువగా పట్టించుకోవడం చేయకండి. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ శ్రేయోభిలాషులు లేదా కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడి సమస్యలు తగ్గిపోతాయి మరియు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

వ్యాపారం

వ్యాపారస్తులకు ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్ధంలో వ్యాపారం సరిగా సాగక పోవటం జరగవచ్చు. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామితో కూడా సరైన అవగాహన లేకుండా పోవడం వలన వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేక పోతారు. ద్వితీయార్థంలో కొంత వ్యాపార వృద్ధి ఉంటుంది, అయితే, అదే సమయంలో మీరు చాలా ఖర్చు లేదా అనవసరమైన పెట్టుబడులను చూస్తారు. ఈ నెల అంతా శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సంస్థల సహాయం కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

చదువు

విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది, మరియు ఆశించిన ఫలితాలను సాధించడం కొరకు కష్టపడి పనిచేయాల్సి వచ్చే నెల ఇది. ఈ నెల అంతా సూర్యుని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి చదువుపై శ్రద్ధ తగ్గటం మరియు ఆటంకాలు ఎదురవడం ఆటంకాలు ఎదురవటం జరుగుతుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఒత్తిడి ఉండటం వలన ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం చేస్తారు. ఈ సమయంలో గురువుల లేదా పెద్దలు సహకారంతో వారు ఈ సమస్యల నుంచి బయట పడగలుగుతారు.



మీకు వీలైతే ఈ పేజీ లింకును లేదా https://www.onlinejyotish.com ను మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సాయం మరిన్ని ఉచిత జ్యోతిష సేవలు అందించటానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు




Aries (Mesha Rashi)
Imgae of Aries sign
Taurus (Vrishabha Rashi)
Image of vrishabha rashi
Gemini (Mithuna Rashi)
Image of Mithuna rashi
Cancer (Karka Rashi)
Image of Karka rashi
Leo (Simha Rashi)
Image of Simha rashi
Virgo (Kanya Rashi)
Image of Kanya rashi
Libra (Tula Rashi)
Image of Tula rashi
Scorpio (Vrishchika Rashi)
Image of Vrishchika rashi
Sagittarius (Dhanu Rashi)
Image of Dhanu rashi
Capricorn (Makara Rashi)
Image of Makara rashi
Aquarius (Kumbha Rashi)
Image of Kumbha rashi
Pisces (Meena Rashi)
Image of Meena rashi
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Free Astrology

Marriage Matching with date of birth

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceIf you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Malayalam,   French,   Русский,   Deutsch, and   Japanese . Click on the desired language to know who is your perfect life partner.

Newborn Astrology, Rashi, Nakshatra, Name letters

Lord Ganesha blessing newborn Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in  English,  Hindi,  Telugu,  Kannada,  Marathi,  Gujarati,  Tamil,  Malayalam,  Bengali, and  Punjabi,  French,  Russian,  German, and  Japanese. Languages. Click on the desired language name to get your child's horoscope.