జూన్ 2024 రాశి ఫలాలు - మేష రాశి - జూన్ నెల మేష రాశి జాతకం

మేష రాశి June జూన్ 2024 రాశి ఫలములు

చాంద్రమానం ఆధారంగా ఈ నెల మేష రాశి ఫలాలు

మేష రాశి వారికి June జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు


Mesha Rashi June జూన్ 2024 రాశిఫలములుమేష రాశి రాశిచక్రంలోని మొదటి రాశి, మొదటి 30 డిగ్రీల ఖగోళ రేఖాంశాన్ని స్ఫురించే విధంగా ఉంటుంది. అశ్వనీ నక్షత్ర (4 పాదాలు), భరణి నక్షత్ర (4 పాదాలు), కృత్తిక నక్షత్ర (1 వ చరణము) లో జన్మించిన వ్యక్తులు మేష రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు.

మేష రాశి - జూన్ నెల రాశి ఫలాలుమేష రాశి వారికి ఈ జూన్ నెల ఒకటవ తేదీన కుజుడు మీ రాశి నుంచి 12వ ఇల్లైన మీనరాశి నుంచి, 1వ ఇల్లైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 12వ తేదీ వరకు, రెండవ ఇల్లైన వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత, మూడవ ఇల్లైన మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈనెల 14వ తేదీన, మీ రాశికి రెండవ ఇల్లైన వృషభ రాశి నుంచి, మూడవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 29వ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత, 4వ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈనెల 15వ తేదీ వరకు సూర్యుడు, రెండవ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని, మూడవ ఇల్లైన మిధున రాశిలో కొనసాగిస్తాడు. గురువు ఈ నెలంతా తన సంచారాన్ని, రెండవ ఇల్లైన వృషభ రాశిలో కొనసాగిస్తాడు. శని 11వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు, 12వ ఇల్లైన మీనరాశిలో, మరియు కేతువు, 6వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మీకు ఉద్యోగ పరంగా, ఆర్థికంగా బాగుంటుంది. ప్రథమార్థంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, మీ మాటతీరుతో మరియు వ్యవహార దక్షతతో ఆ సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. ఈ నెలలో, మీకు తక్కువ పని ఒత్తిడి మరియు సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు ఏ పని అయినా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. అయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. కొన్నిసార్లు అత్యుత్సాహానికి పోయి మీకు సంబంధం లేని పనుల్లో తలదూర్చే అవకాశముంటుంది. మీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ద్వితీయార్థంలో వృత్తిలో కొంత మార్పు ఉంటుంది, దాని కారణంగా ఒత్తిడి తగ్గుతుంది. ఈ నెల చివరి రెండు వారాల్లో ఉద్యోగరీత్యా ప్రయాణం ఉంటుంది.
ఆర్థికంగా ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది. గడచిన రెండు నెలల్లో మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ, ఈ నెల నుంచి మీరు ఆ ఖర్చును అధిగమిస్తారు మరియు అదనపు ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ నెల మూడో లేదా నాలుగో వారంలో చేయడం మంచిది. ప్రథమార్థంలో వాహనాల కారణంగా కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.
కుటుంబ పరంగా ఈనెల మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. మీరు కుటుంబ శుభ కార్యానికి హాజరు కావొచ్చు, లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించే సంఘటనలు జరగవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశముంటుంది. ఈ నెల మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
ఈ నెలలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ నెల మొదటి వారంలో మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో, పదునైన వస్తువులతో ఆడవద్దు. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే కొన్నిసార్లు కోపం కారణంగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండటం మంచిది.
వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి ఎదుగుదలను కలిగి ఉంటారు. ప్రథమార్థంలో ఖర్చులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆదాయం పెరగడం వలన వాటిని తట్టుకోగలుగుతారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే, చివరి వారం ముందు చేయడం మంచిది. పెద్ద పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు.
విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారు తమ చదువులో బాగా పనిచేస్తారు. వారి ఏకాగ్రత మరియు అధ్యయనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మరియు ఆ విషయంగా తగిన కృషి చేస్తారు. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.


June, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)
(Updated)


Click here for Year 2024 Rashiphal (Yearly Horoscope) in
Rashiphal (English), राशिफल (Hindi), రాశి ఫలాలు (Telugu), রাশিফল (Bengali), ರಾಶಿ ಫಲ (Kannada), രാശിഫലം (Malayalam), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), and ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi)

Aries
Mesha rashi,June 2024 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, June 2024 rashi phal
Gemini
Mithuna rashi, June 2024 rashi phal
Cancer
Karka rashi, June 2024 rashi phal
Leo
Simha rashi, June 2024 rashi phal
Virgo
Kanya rashi, June 2024 rashi phal
Libra
Tula rashi, June 2024 rashi phal
Scorpio
Vrishchika rashi, June 2024 rashi phal
Sagittarius
Dhanu rashi, June 2024 rashi phal
Capricorn
Makara rashi, June 2024 rashi phal
Aquarius
Kumbha rashi, June 2024 rashi phal
Pisces
Meena rashi, June 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

Monthly Horoscope

Check June Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  
Please share this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.