OnlineJyotish.com

నవగ్రహ పీడాహర స్తోత్రం

నవగ్రహాలను స్తుతిస్తూ గ్రహశాంతిని కోరే ప్రార్థన ఇది.

పారాయణానికి ముందు

స్తోత్రం అంటే దేవతను స్తుతించే ప్రార్థన. కవచం రక్షణను కోరే ప్రార్థన; నామస్తోత్రంలో దేవత నామాలు ఉంటాయి. నెమ్మదిగా చదవండి. సందేహం ఉన్న పదాలు, బీజాక్షరాల ఉచ్చారణను గురువు వద్ద నేర్చుకోండి. ఫలశ్రుతిలోని వర్ణనలను భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలుగా అర్థం చేసుకోవాలి.

శ్లోకాలు చదవండి

Navagraha Peedahara Stotra

నవగ్రహాల వల్ల కలిగే పీడల నుండి ఉపశమనం పొందడానికి పఠించే ఈ "నవగ్రహపీడాహరస్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం వలన జాతకంలో కానీ, గోచారంలో కానీ అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి శుభఫలితాలు వస్తాయి.

నవగ్రహపీడాహరస్తోత్రమ్

సూర్యుడు

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః|
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః|| ౧||

చంద్రుడు

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః|
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః|| ౨||

కుజుడు

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా|
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః|| ౩||

బుధుడు

ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః|
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః|| ౪||

గురుడు

దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః|
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః|| ౫||

శుక్రుడు

దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః|
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః|| ౬||

శని

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః|
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః|| ౭||

రాహువు

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః|
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ|| ౮||

కేతువు

అనేకరూపవర్ణైశ్చ శతశోऽథ సహస్రశః|
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః|| ౯||

|| ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సంపూర్ణమ్||

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వేద జ్యోతిష్కులు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.
ప్రకటన

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.