OnlineJyotish.com

నవగ్రహ కరావలంబ స్తోత్రం

నవగ్రహాల అనుగ్రహాన్ని, ఆసరాను కోరే శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి.

పారాయణానికి ముందు

స్తోత్రం అంటే దేవతను స్తుతించే ప్రార్థన. కవచం రక్షణను కోరే ప్రార్థన; నామస్తోత్రంలో దేవత నామాలు ఉంటాయి. నెమ్మదిగా చదవండి. సందేహం ఉన్న పదాలు, బీజాక్షరాల ఉచ్చారణను గురువు వద్ద నేర్చుకోండి. ఫలశ్రుతిలోని వర్ణనలను భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలుగా అర్థం చేసుకోవాలి.

శ్లోకాలు చదవండి

Navagraha Karavalamba Stotram

నవగ్రహాల అనుగ్రహం పొందడానికి, జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పఠించే "నవగ్రహ కరావలమ్బ స్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. ఈ స్తోత్రంలో ప్రతి గ్రహాన్ని సమస్యలు తొలగిపోవటానికి చేయూత నిమ్మని శరణు వేడుకుంటూ, వారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

సూర్యుడు

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన|
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్|| ౧||

చంద్రుడు

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే|
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్|| ౨||

కుజుడు

రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్|
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్|| ౩||

బుధుడు

సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే|
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౪||

గురుడు

వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే|
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్|| ౫||

శుక్రుడు

ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్|
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౬||

శని

శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట|
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్|| ౭||

రాహువు

మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ|
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౮||

కేతువు

ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ|
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్|| ౯||

ఫలశ్రుతి

మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః|
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్|| ౧౦||

|| ఓమ్ శాన్తిః శాన్తిః శాన్తిః||
|| ఓమ్ తత్ సత్||

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వేద జ్యోతిష్కులు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.
ప్రకటన

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.