OnlineJyotish.com

అంగారక స్తోత్రం

కుజుడు, మంగళుడు అనే పేర్లతో పిలిచే అంగారకుడిని స్తుతించే స్తోత్రం ఇది.

పారాయణానికి ముందు

స్తోత్రం అంటే దేవతను స్తుతించే ప్రార్థన. కవచం రక్షణను కోరే ప్రార్థన; నామస్తోత్రంలో దేవత నామాలు ఉంటాయి. నెమ్మదిగా చదవండి. సందేహం ఉన్న పదాలు, బీజాక్షరాల ఉచ్చారణను గురువు వద్ద నేర్చుకోండి. ఫలశ్రుతిలోని వర్ణనలను భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలుగా అర్థం చేసుకోవాలి.

శ్లోకాలు చదవండి

Angaraka (kuja) Stotram

Chanting of Kuja stotra every morning will remove hurdles in getting married due to Mangal dosh and its also helpful for those having financial problems and those having problems related to land or house.

కుజ గ్రహ దోష నివారణకు, కుజుని అనుగ్రహం పొందడానికి "అంగారక స్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. మన జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నా, లేదా కుజ దోషం ఉన్నా లేదా కుజుని గోచారం అనుకూలంగా లేకున్నా ఈ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య|
విరూపాఙ్గిరస ఋషిః|
అగ్నిర్దేవతా|
గాయత్రీ ఛన్దః|
భౌమప్రీత్యర్థం జపే వినియోగః|
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః|
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః|| ౧||
ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః|
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః|| ౨||
సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః|
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః|| ౩||
రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః|
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః|| ౪||
ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి|
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్|| ౫||
వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః|
యోऽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః|| ౬||
సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్|| ౭||
|| ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్||

అంగారక స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలు:

కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది.
కుజుని అనుగ్రహం లభిస్తుంది.
ఋణ బాధలు తొలగిపోతాయి.
దారిద్ర్యం నుండి విముక్తి లభిస్తుంది.
ధన ధాన్య సంపదలు వృద్ధి చెందుతాయి.
మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది.
సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వేద జ్యోతిష్కులు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.
ప్రకటన

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.