OnlineJyotish.com

బుధ పంచవింశతి నామ స్తోత్రం

బుధుని ఇరవై ఐదు నామాలతో స్తుతించే నామస్తోత్రం ఇది.

పారాయణానికి ముందు

స్తోత్రం అంటే దేవతను స్తుతించే ప్రార్థన. కవచం రక్షణను కోరే ప్రార్థన; నామస్తోత్రంలో దేవత నామాలు ఉంటాయి. నెమ్మదిగా చదవండి. సందేహం ఉన్న పదాలు, బీజాక్షరాల ఉచ్చారణను గురువు వద్ద నేర్చుకోండి. ఫలశ్రుతిలోని వర్ణనలను భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలుగా అర్థం చేసుకోవాలి.

శ్లోకాలు చదవండి

Budha Panchavimshati nama stotra

Budha Panchavimshati Nama stotra helpful for those who are having ill placed Mercury in their birth charts. If you are having problems with your studies, communication, memory problems, problems from relative chanting of this stotra will give good result from above said problems. Especially chanting on Wednesday will give more favourable results.

బుధ గ్రహ దోష నివారణకు, బుధుని అనుగ్రహం పొందడానికి "బుధ పంచవింశతినామ స్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. ఈ స్తోత్రంలో బుధుని 25 నామాలతో స్తుతిస్తారు. జాతకంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నా లేదా బలహీనంగా ఉన్నప్పుడు కలిగే సమస్యలు తొలగిపోవటానికి ఈ స్తోత్రం పఠించాలి.

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీబుధపఞ్చవింశతినామస్తోత్రస్య ప్రజాపతిరృషిః,
త్రిష్టుప్ ఛన్దః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః||
బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః|
ప్రియఙ్గుకలికాశ్యామః కఞ్జనేత్రో మనోహరః|| ౧||
గ్రహపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః|
విరుద్ధకార్యహన్తా చ సౌమ్యౌ బుద్ధివివర్ధనః|| ౨||
చన్ద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః|
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః|| ౩||
లోకప్రియః సౌమ్యమూర్తిర్గుణదో గుణివత్సలః|
పఞ్చవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్|| ౪||
స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి|
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్|| ౫||
ఇతి శ్రీపద్మపురాణే బుధపఞ్చవింశతినామస్తోత్రం సమ్పూర్ణమ్||

బుధ పంచవింశతినామ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలు:

బుధ గ్రహ దోష నివారణ జరుగుతుంది.
బుధుని అనుగ్రహం లభిస్తుంది.
బుద్ధి కుశాగ్రత పెరుగుతుంది.
విద్యా విజయం సాధిస్తారు.
వాక్చాతుర్యం కలుగుతుంది.
మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది.
సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ధన ధాన్య సంపదలు వృద్ధి చెందుతాయి.
గమనిక: ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా ప్రతి బుధవారం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వేద జ్యోతిష్కులు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.
ప్రకటన

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.