వృషభ రాశి 2022 సంవత్సర రాశి ఫలములు

వృషభ రాశి రాశిఫలములు

2022 సంవత్సర రాశి ఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2022 Rashi phalaalu (rasi phalamulu)


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలాలు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2022 samvatsara Vrishabha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishabha Rashi in Telugu

vrishabha rashi telugu predictions vijaya telugu year

 కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదములలో (వే,వో) జన్మించిన వారు వృషభ రాశి జాతకులు

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 11వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 12వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 6వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 10వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 9వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.

2022 సంవత్సరం ఉద్యోగ జాతకం

వృషభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురు, శని, అలాగే కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన, మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. వృత్తిలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులను ఈ సంవత్సరం పొందుతారు. మీరు అనుకున్న ఏ విధమైన అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా ఏప్రిల్ వరకు వృత్తిలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్లో గురువు పదకొండవ ఇంటికి రావడంతో మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు చేసే పనికి గుర్తింపు రావడమే కాకుండా గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు కూడా మెచ్చుకుంటారు. మీరు ప్రభుత్వ లేదా ఇతర సంస్థల నుంచి అవార్డులను, రివార్డులను పొందే అవకాశం ఉంటుంది. గతంలో మీరు కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాలేదని బాధపడిన విషయాల్లో ఇప్పుడు గుర్తింపు రావడమే కాకుండా అది మీ వృత్తి అభివృద్ధిలో తోడ్పడుతుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా లేనందువలన మీకు లభించిన విజయాలను చూసి ఇ కొంత గర్వం పెరగడం కానీ లేదా కొన్ని విషయాల్లో తల బిరుసు గా ప్రవర్తించడం కానీ చేస్తారు దాని వలన అనుకోని శత్రువులను కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలు మిమ్మల్ని మరింత ముందుకు పోయేలా చేయాలి తప్ప వెనకడుగు వేసేలా చేయకూడదు. మీ అసహనాన్ని, కోపాన్ని లేదా మొండి స్వభావాన్ని తగ్గించుకొని వినయంతో వెళ్ళినప్పుడే మరింత మందికి చేరువవుతారు. ఏప్రిల్ నుంచి రాహువు 12వ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు, లేదా వారి అవసరం కొరకు మీ చుట్టూ చేరే వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా జూలై డిసెంబర్ మధ్య వక్రగతుడైన శని గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన విదేశీ ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సమాచారం కారణంగా కానీ లేదా ఇతరులు మోసం చేయడం వల్ల గాని మీరు నష్టపోవడం జరుగుతుంది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్య నుంచి కొంత ఆలస్యంగానైనా బయటపడే అవకాశం ఉన్నది. కొత్త కోర్సులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఉద్యోగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. 12వ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొంత బద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అకారణంగా ముఖ్యమైన పనులను వాయిదా వేయడం చేస్తారు లేదా సమర్థులైన వారికి ఆ పనిని అప్పగించి తర్వాత బాధ పడతారు. ఈ సంవత్సరంలో మీకు వచ్చిన విజయాలను మీరు పూర్తిగా అనుభవించాలంటే ఈ బద్ధకాన్ని అలాగే నిర్లక్ష్యాన్ని వదిలేయడం మంచిది.

2022 సంవత్సరం ఆరోగ్య జాతకం

వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయానికొస్తే కొన్ని చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలకు మినహా, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఏప్రిల్ వరకు గురువు, రాహువు, మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తల, వెన్నెముక, మరియు కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకూ ఆహార విషయంలో, అలాగే అలవాట్ల విషయం లో జాగ్రత్త అవసరం. అంతే కాకుండా అంటు వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ లో గురువు, రాహు, కేతువులు అలాగే శని రాశి మార్పు కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఏప్రిల్ నుంచి సంవత్సరమంతా రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మెడ, కడుపు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వీలయినంత వరకు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం వలన చాలావరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే అనారోగ్య సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి గా ఉండవు. కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. మంచి ఆరోగ్యపు అలవాట్ల తో పాటుగా దైవారాధన చేయటం వలన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు.

2022 సంవత్సరం కుటుంబ జాతకం

కుటుంబ పరంగా ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక అపోహలు ఏర్పడడం తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంది. చెప్పుడు మాటలు వినడం వలన లేదా ఎదుటివారి మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన కుటుంబంలో కలతలు, కలహాలు ఏర్పడతాయి. ఈ సమయంలో గురు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన, మీ మధ్య వచ్చిన సమస్యలు పెద్దవారి జోక్యంతో తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎదుటి వారిపై పెత్తనం చెలాయించాలనే మీ ఆలోచన ఈ సమయంలో ఎక్కువ అవుతుంది. దాని వలన మీ జీవిత భాగస్వామి గాని, ఇతర కుటుంబ సభ్యులు గానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంవత్సర ఆరంభం మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ లో రాహు, కేతువుల తో పాటు, గురు, మరియు శని కూడా రాశి మారడం వలన, కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఏప్రిల్ నుంచి గురువు లాభ స్థానంకు మారటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడం వలన, బంధుమిత్రుల రావటంతో గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అపోహలు కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవ్వటం, అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంవత్సర ద్వితీయార్ధంలో సంతానం కలుగుతుంది. సంవత్సర ద్వితీయార్ధంలో మీ పిల్లలు వారి వారి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీ మిత్రులు మరియు బంధువుల సహకారంతో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్యలు తొలగించుకో కలుగుతారు. సంవత్సర ద్వితీయార్ధంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. మీ ఆనందం కొరకై మీ శక్తికి మించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించడం కానీ లేదా పుణ్య క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. అంతేకాకుండా నూతన గృహప్రవేశం కానీ లేదా వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు.

2022 సంవత్సరం ఆర్థిక జాతకం

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు గోచారం ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, కొత్తగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటుతో కానీ ఇతరుల మాటలు విని కానీ పెట్టుబడులు పెట్టకండి. గురు గోచారం బాగున్నప్పటికీ రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వచ్చిన లాభాలు అనవసరమైన పెట్టుబడుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని దృష్టి ఏడో ఇంటిపై 12వ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో, కొత్త ఒప్పందాలు చేసుకోవడం విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పన్నెండో ఇంటిపై శని దృష్టి కారణంగా, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ, పెట్టిన పెట్టుబడి వ్యర్థం అవ్వడం కానీ జరగవచ్చు. మీ పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా పెట్టుబడి పెట్టే సమయంలో వారి సలహాను కూడా దృష్టిలో పెట్టుకోవడం వలన నష్టాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం గృహ, వాహనాదుల కొనుగోలు చేయటం చేస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జులై తర్వాత పెట్టడం మంచిది. జూలై వరకు శని మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, పెట్టుబడుల విషయంలో తప్పుడు సలహాలు పాటించి, లేదా తొందరపడి పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి

ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు రాహు, కేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన, మీరు కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్థులకు వారి భాగస్వాములతో కానీ లేదా వారి వినియోగదారులతో కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. వ్యాపారం బాగా జరిగినప్పటికీ ఈ సమస్యల కారణంగా దానిపై పూర్తి దృష్టి పెట్టలేకపోతారు. అంతేకాకుండా గతంలో తీసుకున్న అప్పులు కానీ, బ్యాంకు లోన్ లు కానీ తప్పనిసరిగా తీర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తగినంత డబ్బులు ఉన్నప్పటికీ అవి సమయానికి చేతికి రాక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ నుంచి గ్రహస్థితి అనుకూలంగా మారటంతో ఈ సమస్యల నుంచి బయట పడతారు. అంతవరకు ఉన్న గొడవలు కానీ, కోర్టు కేసులు కానీ మధ్యవర్తుల జోక్యంతో సామరస్యంగా ముగిసిపోతాయి. మీకు రావలసిన డబ్బులు తిరిగి రావడంతో చేసిన అప్పులు కానీ, బ్యాంకు లోన్ లు కానీ తీర్చ కలుగుతారు. మీ వ్యాపార ప్రదేశంలో కూడా మార్పు రావడం లేదా చేసే వ్యాపారం లో మార్పు రావడంతో ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. గతంలో కంటే ఎక్కువ ఆదాయం రావటం, వ్యాపారం అభివృద్ధి చెందడం జరుగుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తులు కానీ, భాగస్వాములు కానీ తిరిగి మీ వద్దకు వస్తారు. అయితే వ్యాపార విషయంలో ఎవరిని నమ్మి మోసపోకండి. కొంతమంది మోసపూరిత మాటలతో తమ అవసరాలకు మిమ్మల్ని కానీ మీ వ్యాపారాన్ని కానీ వాడుకోవాలని చూస్తారు. అటువంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం మంచిది. కళాకారులు కానీ, స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ ఈ సంవత్సరం మంచి అవకాశాలు దొరికి ఆర్థికంగా, వారి వృత్తి పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంతమంది నమ్మి మోసపోవడం కానీ, అవకాశాలు చేజారిపోవడం కానీ జరగవచ్చు. అయితే ధైర్యాన్ని వీడకుండా ప్రయత్నించినట్లయితే చేజారిన అవకాశాలు తిరిగి రావడమే కాకుండా మీకు మంచి పేరు కూడా వస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీ వృత్తి కారణంగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు

వృషభ రాశి లో జన్మించిన వారికి, ఈ సంవత్సరం చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు పదవ ఇంటిలో ఉండి, నాలుగవ మరియు రెండవ ఇంటి పై దృష్టి ఉండటంతో ఈ సమయంలో చదువులో రాణిస్తారు. అయితే జన్మరాశి పై రాహు సంచారం కారణంగా, వీరు కొంత నిర్లక్ష్యాన్ని మరియు వాయిదా వేసే గుణాన్ని అలవరచుకుంటారు. దీనివలన చదువులో మంచి మార్కులు వచ్చినప్పటికీ ఇతర విద్యార్థుల దృష్టిలో వారు తలబిరుసు వారిగా మర్యాద తెలియని వారి గా గుర్తింపు పొందుతారు. అంతేకాకుండా, 9వ ఇంటిలో శని గోచారం కారణంగా, ఉన్నతవిద్యలో కొన్ని ఆటంకాలను ఎదుర్కుంటారు. అలాగే విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు, ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. దానివలన విదేశాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకడమే కాకుండా ఉన్నత విద్యను పూర్తి చేయగలుగుతారు. ఏప్రిల్లో గురువు పదకొండవ ఇంటికి రావటం వలన, వీరు చదువులో బాగా రాణిస్తారు. అయితే ఏప్రిల్ చివరి వారం నుంచి జూలై వరకు శని గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో బద్ధకానికి, అలసత్వానికి గురవుతారు. ఏకాగ్రతను కోల్పోకుండా, వినయాన్ని అలవరచుకొని ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీ విద్యలో అత్యున్నత ఫలితాలు సాధించడమే కాకుండా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు, గుర్తింపును పొందుతారు. పోటీ పరీక్షలు రాసే వారికి సంవత్సరంలో ప్రథమార్థంకంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఓపిక తో రాస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు - పరిహారములు

ఈ సంవత్సరం, వృషభ రాశిలో జన్మించిన వారికి, ప్రధానంగా రాహు మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. రాహు గోచారం ఏప్రిల్ వరకు జన్మ రాశిలో, ఆ తర్వాత సంవత్సరమంతా పన్నెండవ ఇంటిలో ఉంటుంది. దీని కారణంగా మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి కాబట్టి రాహువుకు పరిహారక్రియలు ఆచరించాలి. దీనికిగాను ప్రతిరోజు రాహు స్తోత్రం చదవడం కానీ లేదా దుర్గా స్తోత్రం చదవడం మంచిది. ఇవే కాకుండా రాహు మంత్ర జపం 18,000 సార్లు చేయటం లేదా రాహు గ్రహ శాంతి చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కేతువు గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో అలాగే వ్యాపారంలో, మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వస్తాయి కాబట్టి ఆ చెడు ప్రభావం తగ్గటానికి కేతువుకు పరిహారక్రియలు ఆచరించడం మంచిది. దీనికిగాను ప్రతిరోజు కేతు స్తోత్రం పారాయణం చేయడం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయటం మంచిది. ఇవే కాకుండా ఏడు వేల సార్లు కేతు మంత్రం జపం చేయటం వలన లేదా కేతుగ్రహ శాంతి జరిపించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు, ఏ పరిహారం అయినా పాటించవచ్చు. అంతేకానీ పైన చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2022 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2022 rashi phal
Gemini
Mithuna rashi, year 2022 rashi phal
Cancer
Karka rashi, year 2022 rashi phal
Leo
Simha rashi, year 2022 rashi phal
Virgo
Kanya rashi, year 2022 rashi phal
Libra
Tula rashi, year 2022 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2022 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2022 rashi phal
Capricorn
Makara rashi, year 2022 rashi phal
Aquarius
Kumbha rashi, year 2022 rashi phal
Pisces
Meena rashi, year 2022 rashi phal

Monthly Horoscope

Check October Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

onlinejyotish.com requesting all its visitors to wear a mask, keep social distancing, and wash your hands frequently, to protect yourself from Covid-19 (Corona Virus). This is a time of testing for all humans. We need to be stronger mentally and physically to protect ourselves from this pandemic. Thanks