Telugu Rashi Phalalu (Rasi phalamulu), Meena Rashi, మీన రాశి - 2017 -18 తెలుగు రాశి ఫలములు


Click here for Hemalamba (Hemalambi) rashiphal in Telugu (తెలుగు ఉగాది రాశి ఫలములు) 2017- 2018
Click here for Year 2017 Rashiphal (Rashifal)
click here for August, 2017 monthly rashiphal (Rashifal) (Monthly Horoscope) based on your Moon sign
हिंदी जनमपत्री के लिए यहा क्लिक करे


మీన రాశిఫలములు

హేమలంబనామ సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

Ugadi Rashi phalaalu
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2017 - 2018 Hemalamba samvatsara Meena rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Meena Rashi in Telugu

Kanya rashi telugu year predictions

పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)

మీన రాశి వారికి ఈ హేమలంబ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. సెప్టెంబర్ వరకు గురు గోచారం సప్తమ స్థానంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ విషయంలో, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్నిసార్లు పనులు ఆలస్యమయినప్పటికీ, వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సెప్టెంబర్ నుంచి గురువు అష్టమంలో సంచరిస్తాడు కాబట్టి ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశముంటుంది. అలాగే శని పదవ ఇంట సంచారం వృత్తిలో మార్పులను ఇస్తుంది. ఆగష్టు వరకు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. కొర్టు కేసుల్లో, వివాదాల్లో విజయం సాధిస్తారు.

కుటుంబం

ఈ సంవత్సరం ప్రథమార్థం కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం, రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో గొడవల కారణంగా దూరమైన వారు తిరిగి కలుసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. పెళ్లికాని వారికి సప్తమ గురువు వివాహ యోగాన్నిస్తాడు. సెప్టెంబర్ వరకు వివాహ విషయంలో చాలా అనుకూల సమయం. రాహు గోచారం ఆగష్టు వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వివాదాలు పరిష్కరించబడతాయి. అలాగే శతృవుల కారణంగా తలెత్తిన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సెప్టెంబర్ నుంచి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించటం లేదా అపోహలు ఏర్పడటం జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. రాహు గోచారం పంచమంలో ఉంటుంది కాబట్టి మీ సంతానం ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. అలాగే వారు చదువు మీద శ్రద్ధ తగ్గించటం జరగవచ్చు. అయితే కేతువు పదకొండవ ఇంట అనుకూలంగా ఉంటాడు కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు అలాగే సమస్యలను ఎదుర్కోగలుగుతారు.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. గురు, రాహువుల గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. రాహువు ఆరవ ఇంట గోచారం కారణంగా దీర్ఘకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే సప్తమ గురు గోచారం కూడా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవటంలో సహకరిస్తుంది. సెప్టెంబర్ నుంచి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. మీ రాశ్యాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేవారు కానీ, తరచూ ప్రయాణాలు చేసే వారు కానీ కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే కాలేయం, తల, కాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. గురువు కు పరిహారాలు ఆచరించటం వలన చాలావరకు సమస్యలు తగ్గుతాయి.

ఆర్థిక స్థితి

ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటే, ద్వితీయార్థం సామాన్యంగా ఉంటుంది. గురు, రాహువుల గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ వరకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. రావలసి డబ్బులు తిరిగి రావటం, అలాగే పెట్టుబడులలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావటం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా ఆదాయం పెరుగుతుంది. రాహు గోచారం అనుకూలంగా ఉన్నంత కాలం పనులు సమయానికి పూర్తయ్యి ఆర్థిక లాభాలను ఇస్తాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, స్థిరాస్థులు కొనుగోలు చేయాలనుకునేవారు ఆగష్టులోపు చేయటం మంచిది. సెప్టెంబర్ నుంచి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆదాయం తగ్గినప్పటికీ ఖర్చులు పెరగటం కారణంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆగష్టు నుంచి రాహువు పంచమ స్థానంలో సంచకరిస్తాడు కాబట్టి షేర్ మార్కెట్ లో కానీ, ఇతరత్రా పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టడం మంచిది. తొందరపడి డబ్బుపెట్టి తర్వాత బాధపడటం మంచిది కాదు.

ఉద్యోగం - వ్యాపారం

ఈ సంవత్సరం ఉద్యోగస్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురు, రాహు గోచారం అనుకూలంగా ఉండటం, ద్వితీయార్థంలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగస్థులు అనుకూలమైవ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే అష్టమ గురు గోచారం కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా ప్రథమార్థంలా ద్వితీయార్థం కలిసిరాదు. విదేశీయానం కోరుకునే వారికి ప్రథమార్థం అనుకూలిస్తుంది. అక్టోబర్ తర్వత వృత్తిలో కానీ, పదవిలో కానీ మార్పులు ఉంటాయి. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి జూనులోపు తిరిగి అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలిస్తుంది. గురు గోచారం, రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలకునునే వారు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సెప్టెంబర్ లోపు పెట్టడం మంచిది. ఆ తర్వాత గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సరైన లాభాలు రాకపోవచ్చు. సెప్టెంబర్ నుంచి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేయటం అంతగా అనుకూలించదు.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మంచి విద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు. చదువులో మిగతా వారికంటే మంచి మార్కులు సాధిస్తారు. అయితే సెప్టెంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువులో నిర్లక్ష్యం పెరుగుతుంది. అహంకారం కారణంగా చదువుకంటే ఎక్కువ మిగతా విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. చెడు ఫలితాలు తగ్గటానికి గురువుకు పరిహారాలు చేయటం మంచిది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రథమార్థంలో కేతువు, ద్వితీయార్థంలో గురు, రాహువులు అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకోవటం మంచిది. కేతు గ్రహ దోష నివారణకు కేతువుకు కానీ, గణపతికి కాని పూజ చేయటం మంచిది. అలాగే రాహు గ్రహ దోష నివారణకు దుర్గా దేవికి కాని, రాహువుకు కానీ పూజ చేయటం మంచిది. అలాగే గురు గ్రహ దోష నివారణకు గురు పూజ చేయటం, గురు స్తోత్రం కాని, గురు చరిత్ర కానీ పారాయణం చేయటం మంచిది.



రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

హేమలంబ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2017 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2017 rashi phal
Gemini
Mithuna rashi, year 2017 rashi phal
Cancer
Karka rashi, year 2017 rashi phal
Leo
Simha rashi, year 2017 rashi phal
Virgo
Kanya rashi, year 2017 rashi phal
Libra
Tula rashi, year 2017 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2017 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2017 rashi phal
Capricorn
Makara rashi, year 2017 rashi phal
Aquarius
Kumbha rashi, year 2017 rashi phal
Pisces
Meena rashi, year 2017 rashi phal


Career Prospects

Know about your career and better career options and remedies for successful career.Read more...

  

Birthtime rectification

This service helps you to find your correct time of birth based on KP Astrology.
Read more...

  

Marriage Matching

Analysis of birth chart of couple for compatibility and suggestions and remedies for better married life.Read more...

  


Free Kundali Matching

Check your marriage matching along with kuja dosha checking and other doshas (like santana dosha etc..) information. Read more...