కర్కాటక రాశి -2021 రాశి ఫలములు

కర్కాటక రాశిఫలములు

2021 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2021 Rashi phalaalu

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Karkataka rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Karkataka Rashi in Telugu

కర్కTelugu Rashiphal, తెలుగు Telugu Rashiphal

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఏడవ ఇంటిలో, 11వ ఇంటిలో వృషభ రాశిలో రాహువు, ఐదవ స్థానంలో వృశ్చిక రాశిలో కేతువు ఈ సంవత్సరమంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభరాశిలో, ఎనిమిదవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో, 7వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో ఎనిమిదవ ఇంటిలో ప్రవేశిస్తాడు.

వృత్తి

 

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ వరకు, గురువు గోచారం అనుకూలంగా ఉండటంవలన, వృత్తి పరంగా ఈ సమయం మంచి అభివృద్ధిని ఇస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా నలుగురికి ఉపయోగపడేలా పనులు చేస్తారు. మీ ఆలోచనా విధానం వల్ల, మీరు పని చేసే విధానం వల్ల, మీకు ఉద్యోగంలో ఉన్నతి లభించడమే కాకుండా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలరు. ఏప్రిల్ నుంచి గురువు ఎనిమిదవ ఇంటిలో, శని ఏడవ ఇంటిలో ఉండటం వలన వృత్తి పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. మీ సహోద్యోగులు నుంచి కానీ, మీ పై అధికారుల నుంచి కానీ, సరైన సహకారం లేకపోవడం వలన చేసే పనిలో ఆసక్తి తగ్గుతుంది. దాని కారణంగా వృత్తిలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతవరకు ఉన్న గుర్తింపు తగ్గడం కానీ, లేదా అంతర్గత శత్రువులు పెరగడం కాని జరుగుతుంది. వృత్తిలో మార్పు కోరుకుంటున్న వారు ఏప్రిల్ లోపు మార్పు కొరకు ప్రయత్నం చేయటం మంచిది. ఆ తర్వాత ప్రయత్నం చేసినా సరైన ఫలితం రాకపోవచ్చు. అయితే లాభ స్థానంలో రాహు సంచారం కారణంగా, మీకు కలిగిన చాలా ఇబ్బందులు తక్కువ శ్రమతో తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ మిత్రులు, లేదా ఆత్మీయుల కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొన కలుగుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో వృత్తిలో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మార్పుకు ముఖ్యమైన కారణం మీ పనిలో సరైన నాణ్యత మరియు ఏకాగ్రత లేకపోవడం. ఈ మార్పులకు గురి కాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయండి. పేరు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా, ఎదురుగా ఉన్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆగిపోయిన లేదా ఎంతకూ పూర్తి కాని పనులను ఎక్కువ శ్రమతో ప్రయత్నించడం వలన పూర్తి చేయగలుగుతారు. శని దృష్టి ఒకటవ ఇంటి పైన, తొమ్మిదవ ఇంటిపైన మరియు నాలుగవ ఇంటి పైన ఉండటం వలన మీరు ఎంత విశ్రాంతి కోరుకున్నప్పటికీ, అది మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే ఒక్కోసారి చేసే పని పైన సరైన ఆసక్తి లేక పోవడం వలన, ఆ పని సరైన సమయానికి పూర్తి చేయక పోవచ్చు. ఈ సమయం మీ సహనానికి, మీలో ఉండే నైపుణ్యానికి, పరీక్ష సమయంగా మరియు మీలో ఉన్న లోపాలను సరిదిద్దుదునే సమయంగా భావించినట్లయితే మీలో ఉత్సాహం తగ్గకుండా చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో కొంత అనుకూలంగా లేనప్పటికీ సంవత్సరాంతంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ సోదరులు సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏప్రిల్ వరకు మీ జీవిత భాగస్వామికి, మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గురువు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య ద్వితీయ, చతుర్ధ స్థానాలను వీక్షిస్తాడు కాబట్టి మీ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి ఏప్రిల్ లోపు గాని సెప్టెంబర్ తర్వాత గాని అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అలాగే వివాహ విషయంలో చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం కొంత ప్రయత్నం మేరకు అనుకూల ఫలితాన్ని పొందుతారు. గురు దృష్టి ఏప్రిల్ నుంచి కుటుంబ స్థానంపై అలాగే చతుర్ధ స్థానం పై ఉండటం వలన కుటుంబంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అయితే గురు గోచారం ఎనిమిదవ ఇంటిలో అంత అనుకూలమైనది కాదు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు వలన కానీ, లేదా అవసరమైన సమయంలో మీ సహాయం మీ కుటుంబ సభ్యులకు అందకపోవడం వలన కానీ, వారితో మీకు అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి కానీ, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కానీ చేయడం వలన ఈ సమస్య నుంచి బయట పడతారు. ఈ ఏడాది పిల్లల ఆరోగ్యానికి సంబంధించి అంతగా అనుకూలమైన సమయం కాదు. ఐదవ ఇంటిలో కేతువు సంచారం వల్ల వారి ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, అయితే సెప్టెంబర్ 14 తరువాత గురుడు మళ్లీ ఏడవ ఇంటికి మారతాడు కాబట్టి వారి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ కాలం మీ రెండో సంతానానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

 

ఆర్థికస్థితి

 

కర్క రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు అనుకూలంగా ఉండటం, సంవత్సరమంతా రాహువు పదకొండవ ఇంటిలో సంచారం చేయడం వలన ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో గురు దృష్టి పదకొండవ ఇంటిపై, ఒకటవ ఇంటి పైన మరియు మూడవ ఇంటిపైన ఉండటం వలన మీరు ఆర్థిక సంబంధ పెట్టుబడుల విషయంలో లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు పెట్టిన పెట్టుబడులకు అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయం ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో లాభాలు వచ్చిన కారణంగా, గురువు అనుకూలంగా లేని ఈ సమయంలో అదే విధమైన సాహసాన్ని, తెగింపులను ఉపయోగించి పెట్టిన పెట్టుబడులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవడమే కాకుండా నష్టాలకు కూడా గురిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో వీలైనంతవరకు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా ఈ సంవత్సరం నవంబర్ మూడవ వారం నుంచి గురువు గోచారం తిరిగి ఎనిమిది ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని, ఆర్ధిక సమస్యల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. గురువు అష్టమ స్థానంలో సంచరించే సమయంలో మీకు నష్టం చేసే అవకాశాలే ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ సమయంలో తొందరపడి పెట్టుబడి పెట్టకుండా ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

ఆరోగ్యం

 

కర్కాటక రాశి లో జన్మించిన వారికి, ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు అలాగే గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాహువు ఈ సంవత్సరమంతా పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో అంతగా అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. గురువు దృష్టి రెండవ, నాలుగవ మరియు పన్నెండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో మరియు సరైన విశ్రాంతి తీసుకునే విషయంలో నియమిత పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. గురు దృష్టి రెండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవటంతో పాటు కొంత శారీరక శ్రమ చేయడం మంచిది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు అనుకూలంగా ఉండటం వలన వీరు చదువుపై శ్రద్ధ కలిగి ఉంటారు. అయితే సంవత్సరమంతా శని దృష్టి, ఒకటవ ఇంటిపై, పై నాలుగవ ఇంటిపై, అలాగే తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు చదువంటే నిరాసక్తత పెరగటం, ఏకాగ్రత లేకపోవడం అలాగే పరీక్షలు పాస్ అవ్వడానికి సులువైన మార్గాలు వెతకడం చేస్తారు. దీని వల్ల పరీక్షలలో అనుకున్న ఫలితం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వీరు సాధారణంగా తెలివితేటలు కల వారు అయినప్పటికీ, శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన బద్ధకస్థులుగా మారుతారు, అలాగే చదువును వాయిదా వేయటం చేస్తారు. అయితే రాహు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వీరికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొన్నట్లయితే వారు చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నిస్తున్న వారు అలాగే విదేశాల్లో విద్యాభ్యాసం కొరకు ప్రయత్నిస్తున్న వారు, గట్టిగా ప్రయత్నం చేయటం వలన వారు అనుకున్న ఫలితాలను పొందుతారు.

పరిహారాలు

 

ఈ సంవత్సరం మీకు శని, గురువు, మరియు కేతువు అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ మూడు గ్రహాలకు పరిహారాలు చేయడం మంచిది. గురు గోచారం, ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో అష్టమ స్థానంలో అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుండి బయట పడడానికి గురువుకు పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజు గురు జపం చేయడం కానీ, గురు స్తోత్రాలు ప్రతిరోజు చదవడం కానీ, గురు చరిత్ర పారాయణం చేయడం కానీ మంచి ఫలితాన్నిస్తాయి. ఈ సంవత్సరం అంతా శని ఏడవ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో, అలాగే వ్యాపారంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు తొలగిపోవటానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. శని జపం చేయటం లేదా ప్రతిరోజూ శని స్తోత్ర పారాయణం చేయటం వలన శని ప్రభావం తగ్గుతుంది. కేతువు ఈ సంవత్సరమంతా ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. దీని వలన పిల్లలకు ఆరోగ్య సమస్యలు అలాగే చదువులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కేతువుకు పరిహారం చేయడం వలన కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ప్రతిరోజు కేతు స్తోత్రం పారాయణం చేయటం, లేదా కేతు మంత్ర జపం చేయటం, లేదా గణపతి స్తోత్ర పారాయణం చేయటం, లేదా గణపతి పూజ చేయడం మొదలైన పరిహారాల వలన కేతువు ఇచ్చే సమస్యలు తొలగిపోతాయి.

 

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

వికారి నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2021 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2021 rashi phal
Gemini
Mithuna rashi, year 2021 rashi phal
Cancer
Karka rashi, year 2021 rashi phal
Leo
Simha rashi, year 2021 rashi phal
Virgo
Kanya rashi, year 2021 rashi phal
Libra
Tula rashi, year 2021 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2021 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2021 rashi phal
Capricorn
Makara rashi, year 2021 rashi phal
Aquarius
Kumbha rashi, year 2021 rashi phal
Pisces
Meena rashi, year 2021 rashi phal

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  


onlinejyotish.com requesting all its visitors to wear a mask, keep social distancing, and wash your hands frequently, to protect yourself from Covid-19 (Corona Virus). This is a time of testing for all humans. We need to be stronger mentally and physically to protect ourselves from this pandemic. Thanks