OnlineJyotish


Rashi Phalalu | ఈ రోజు రాశి ఫలాలు, తెలుగు రాశిఫలాలు, Rashi Phalam


ఈ రోజు రాశిఫలం - దిన ఫలాలు

Telugu Rashi Phalalu - రోజువారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu - తెలుగు రాశి ఫలాలు

అది దిన పత్రికలో అయినా లేక టీవీల్లో అయినా మన తెలుగు వారిలో చాలామందికి ప్రతిరోజు సూర్యోదయంతో పాటుగా రోజువారీ పంచాంగం మరియు రాశి ఫలాలు చూడటం చాలాకాలం నుంచి అలవాటైన పని. . మన సంప్రదాయం ప్రకారం రోజు సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. అందుకే మన ఆన్ లైన్ జ్యోతిష్ డాట్ కాం (onlinejyotish.com) లో ఇచ్చే రోజువారి రాశి ఫలాలు లేదా దిన ఫలాలు స్థానిక సూర్యోదయ సమయానికి ప్రతిరోజు అప్ డేట్ అవుతాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు, ఆ రోజు సూర్యోదయ సమయానికి ఉన్న రాశి, నక్షత్రం మరియు ఇతర గ్రహస్థితుల ఆధారంగా ఈ ఫలితాలు రాయబడ్డాయి. ఈ రాశిఫలాలు మీరు పుట్టిన రాశి ఆధారంగా రూపొందించబడ్డాయి. ఒక వేళ మీ రాశి ఏదో తెలియకుంటే ఇక్కడ క్లిక్ చేసి, మీ పుట్టిన తేదీ, సమయం మరియు జన్మస్థల వివరాల ఆధారంగా మీ రాశి, నక్షత్రం తెలుసుకోవచ్చు. మీ పుట్టిన తేదీ, సమయం వివరాలు తెలియకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీ పేరును బట్టి మీ రాశి ఏదనేది తెలుసుకోవచ్చు.


ఈ రోజు రాశి ఫలాలు, తేది: 12-12-2024


మేష రాశి
అశ్విని (4),
భరణి (4),  
కృత్తిక (1వ పాదం)

ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.


వృషభ రాశి
కృత్తిక (2,3, 4 పాదాలు),
రోహిణి (4),
మృగశిర (1, 2పాదాలు)

ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకొండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.


మిథునరాశి
మృగశిర (3,4 పాదాలు),
ఆరుద్ర(4),
పునర్వసు (1, 2, 3పాదాలు)

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.


కర్కాటక రాశి
పునర్వసు (4వ పాదం),
పుష్యమి (4),
ఆశ్లేషా (4)

ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


సింహ రాశి
మఖ(4)
పుబ్బ(4),
ఉత్తర(1st పాదం)

ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.


కన్యారాశి
ఉత్తర (2, 3, 4 పాదాలు),
హస్త (4),
చిత్త(1, 2 పాదాలు)

ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.


తులా రాశి
చిత్త (3,4పాదాలు),
స్వాతి (4),
విశాఖ (1, 2, 3 పాదాలు)

ఈ రోజు నూతన వ్యాపార ఒప్పందాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కాని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనటం కాని, మరమ్మత్తు చేయించటం కాని చేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తిలో అనుకూల పరిణామాలు ఏర్పడతాయి.


వృశ్చిక రాశి
విశాఖ (4వ పాదం),
అనురాధ (4),
జ్యేష్ట (4)

ఈ రోజు మీ వృత్తిలో అనుకోని మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతికాని, పదవిలో మార్పుకాని చోటుచేసుకుంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న మనస్పర్ధలు తొలగి పోతాయి.


ధనూరాశి
మూల (4),
పూర్వాషాఢ (4),
ఉత్తరాషాఢ (1 పాదాలు)

ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. మీ సంతానం లేదా మీకు ఇష్టమైన వారి ఆరోగ్య పరిస్థితి మీ ఆందోళనకు కారణమవుతుంది. మీరు పూర్తి చేస్తానన్న పనులు పూర్తి చేయకపోవటం వలన మీ పై అధికారులు మీపై అసహనం వ్యక్తం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో అనుకోని మనస్పర్దలు ఏర్పడవచ్చు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది.


మకర రాశి
ఉత్తరాషాఢ (2,3, 4పాదాలు),
శ్రవణం (4),
ధనిష్టా (1, 2పాదాలు)

ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం కారణంగా మానసిక అశాంతికి, ఆవేశానికి గురవుతారు. అనుకోని ఖర్చులు కాని, నష్టాలు కాని మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించటం వలన సమస్యలనుంచి బయటపడ గలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


కుంభరాశి
ధనిష్టా (3,4 పాదాలు),
శతభిషం (4),
పూర్వాభాద్ర (1, 2, 3పాదాలు)

ఈ రోజు మీ వృత్తిలో మార్పు కాని, అనుకోని ప్రయాణం కాని చోటు చేసుకుంటుంది. ఇతరుల బాధ్యతలను, పనిని మీరు చేయవలసి రావచ్చు. మీ పట్టుదలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మెలిగేప్పుడు జాగ్రత్త అవసరం, మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.


మీనరాశి
పూర్వాభాద్ర (4పాదాలు),
ఉత్తరాభాద్ర(4),
రేవతి (4)

ఈ రోజు మాట విషయంలో, ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసర వాదనల వలన మీ గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాలలో నష్టపోయే ప్రమాదముంటుంది. మానసికంగా స్థిరంగా ఉండటం, మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం వలన అన్ని విషయాల్లో ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.


రోజువారి రాశిఫలాలు ప్రతిరోజు మీరు నివసిస్తున్న ప్రదేశపు సూర్యోదయ సమయానికి అప్డేట్ అవుతాయి. రేపటి రాశి ఫలాల కొరకు ఈ పేజిని రేపు మళ్లీ సందర్శించండి. ప్రతిరోజు రాశి ఫలాలు చదవటానికి ఈ పేజ్ ని బుక్ మార్క్ చేసుకొండి (Ctrl+D) లేదా మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. ఇవి సూచనలు మాత్రమే అని గమనించగలరు. ఇవి వ్యక్తిగత ఫలితాలు కావు.



Free Astrology

Free Daily panchang with day guide

Lord Ganesha writing PanchangAre you searching for a detailed Panchang or a daily guide with good and bad timings, do's, and don'ts? Our daily Panchang service is just what you need! Get extensive details such as Rahu Kaal, Gulika Kaal, Yamaganda Kaal, Choghadiya times, day divisions, Hora times, Lagna times, and Shubha, Ashubha, and Pushkaramsha times. You will also find information on Tarabalam, Chandrabalam, Ghata day, daily Puja/Havan details, journey guides, and much more.
This Panchang service is offered in 10 languages. Click on the names of the languages below to view the Panchang in your preferred language.  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian, and  German.
Click on the desired language name to get your free Daily Panchang.

Newborn Astrology, Rashi, Nakshatra, Name letters

Lord Ganesha blessing newborn Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in  English,  Hindi,  Telugu,  Kannada,  Marathi,  Gujarati,  Tamil,  Malayalam,  Bengali, and  Punjabi,  French,  Russian, and  German. Languages. Click on the desired language name to get your child's horoscope.