వృషభ రాశి మాస ఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

వృషభ రాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల వృషభరాశి జాతకం

April ఏప్రిల్ మాసం లో వృషభ రాశి వారి గోచారఫలములు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారంVrishabha Rashi April ఏప్రిల్ 2024
 రాశిఫలములువృషభం రాశి చక్రంలో రెండవ రాశి. ఇది రాశిచక్రం యొక్క 30-60వ డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తిక (2, 3, 4 పాదములు), రోహిణి (4 పాదములు), మృగశిర (1, 2 పాదములు) కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు.

వృషభ రాశి - ఏప్రిల్ నెల రాశిఫలాలు

వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 10వ ఇల్లైన కుంభరాశి నుంచి, 11వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 11వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 12వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 10వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 11వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 11వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 12వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 12వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు రెండవ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 10వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 11వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 5వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ మాసం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.
కెరీర్ పరంగా చూస్తే మొదటి రెండు వారాల్లో మంచి వృద్ధి కనిపిస్తుంది. మీ పని గుర్తింపు ఉంటుంది మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో కొంత పనిభారం, విశ్రాంతి లేని జీవితం గడపవచ్చు. మీ గురించి కొన్ని అపార్థాలు లేదా వ్యతిరేక మాటలు మీ కార్యాలయంలో ప్రారంభం కావచ్చు. కాబట్టి, మీ ఆఫీసులో అందరితో మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే ఉత్తర, ప్రత్యుత్తరాల విషయంలో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు లోనవకుండా ఉండటం, గొప్పలు చెప్పుకోకుండా మాట్లాడటం చేయండి.
ఈ నెలలో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావచ్చు. 14వ తేదీ వరకు మంచి ఆరోగ్యం, ఉంటుంది. 14వ తేదీ తర్వాత కడుపునొప్పి, ఛాతీ నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీరు మీ కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కల్తీ లేదా అపరిపక్వ ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంటుంది.
ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. మొదటి రెండు వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది, మరియు 3 వ మరియు 4 వారాల్లో మీరు కొంత అనవసర ఖర్చును కలిగి ఉంటారు. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ నెల 14వ తేదీ లోపు దీనిని చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో, ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎదుటివారి మాటలు నమ్మి తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం, వస్తువులు కొనటం చేయకండి.
ఈ మాసంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి రెండు వారాలు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీ తండ్రి లేదా మీ బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య ఉంటుంది. మీరు మాట్లాడే తీరు కారణంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుచేసుకోవటం కానీ, మీమ్మల్ని తక్కువ చేయటం కానీ జరగవచ్చు కనుక మీరు మీ మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించవచ్చు, కాబట్టి, మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ ని నిర్వహించడానికి ప్రయత్నించండి.
వ్యాపారంలో ఉన్న వారికి మొదటి రెండు వారాల్లో మంచి వ్యాపారం ఉంటుంది. మూడవ వారం తరువాత కొంత ఆర్థిక నష్టాలు లేదా భారీ వ్యయం ఉండవచ్చు. ఈ నెలలో మీ వ్యాపారంలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టవద్దు. వ్యాపార ఒప్పందాల విషయంలో మొండి పట్టుదలకు పోకుండా శ్రేయోభిలాషుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. మీ నిర్లక్ష్యం లేదా పొరపాట్లకారణంగా సమస్యలు ఎదపర్కొనే అవకాశముంటుంది.
విద్యార్థులకు మంచి సమయం, మరియు వారు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రెండో వారం నుంచి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే చాలా సాధన చేయాలి. సహనంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే, బుధుని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన పరీక్షలు రాసేటప్పుడు కొంత గందరగోళానికి గురి కావొచ్చు.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


Aries
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, April 2024 rashi phal
Gemini
Mithuna rashi, April 2024 rashi phal
Cancer
Karka rashi, April 2024 rashi phal
Leo
Simha rashi, April 2024 rashi phal
Virgo
Kanya rashi, April 2024 rashi phal
Libra
Tula rashi, April 2024 rashi phal
Scorpio
Vrishchika rashi, April 2024 rashi phal
Sagittarius
Dhanu rashi, April 2024 rashi phal
Capricorn
Makara rashi, April 2024 rashi phal
Aquarius
Kumbha rashi, April 2024 rashi phal
Pisces
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


Effective communication is key, master it and watch your relationships flourish.