కుంభ రాశి మాసఫలములు - December డిసెంబర్ 2023 తెలుగు రాశి ఫలాలు


How is the transit effect of Rahu over Meen Rashi and Ketu over Kanya Rashi on your zodiac sign? Read article in
English, Hindi , and Telugu

Click here for Year 2023 Rashiphal (Yearly Horoscope) in
English, हिंदी తెలుగు, বাংলা , ಕನ್ನಡ, മലയാളം, मराठी,and ગુજરાતી
December, 2023 Horoscope in
English, हिंदी, मराठी, ગુજરાતી , বাংলা , తెలుగు and ಕನ್ನಡ

కుంభ రాశి December డిసెంబర్ 2023 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల కుంభరాశి జాతకం

డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములుKumbha Rashi (Aquarius sign) December డిసెంబర్ 2023
 రాశిఫలములుకుంభరాశి, రాశి చక్రంలోని పదకొండవ రాశి. ఇది రాశిచక్రం యొక్క 300-330th డిగ్రీలను కలిగి ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర (3 వ, 4 వ పాదాలు), శతభిష నక్షత్ర (4 పాదాలు), పూర్వాభాద్ర నక్షత్ర (1 వ, 2 వ, 3 వ పాదాలు) లో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశివారికి అధిపతి శని.

కుంభ రాశి - డిసెంబర్ నెల రాశి ఫలాలు

ఈ నెల మీకు మంచి గా ఉంటుంది, ఎందుకంటే మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ నెల విజయం మరియు ప్రశంసలు అందుకుంటారు. ఈ నెలలో మీ కెరీర్ లో కొంత మెరుగైన మార్పు ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ పని రంగానికి మీరు ఎంతో సహకారం అందించగలుగుతారు. మీరు నిజాయితీగా చేసిన పని కారణంగా మీ పై అధికారుల ప్రశంసలతో పాటు, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశముంటుంది. ఈ నెలలో వృత్తి పరంగా కొన్ని ప్రయాణాలు లేదా, ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేయటం వలన మీరు మీ కార్యాలయంలో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు.
ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీకు మంచి ఆదాయం ఉంటుంది. వృత్తిలో ప్రమోషన్ కారణంగా లేదా వ్యాపారంలో మంచి లాభాల కారణంగా మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఈ నెలలో ఎవరికి ఎటువంటి ఆర్థిక సంబంధ వాగ్దానాలు చేయకండి. దానివలన మీ మిత్రులతో లేదా బంధువులతో సంబంధాలు చెడిపోయే అవకాశముంటుంది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించ గలుగుతారు.
ఈ నెల మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వారి సాయం కారణంగా మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయ గలుగుతారు. మీ తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టగలరు, ఆయన సరైన సలహా తో మీరు సరైన మార్గాన్ని అనుసరించగలుగుతారు. మరియు మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. మీ స్నేహితులు మరియు బంధువులు సైతం మీకు మద్దతునిస్తారు.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. అధిక వేడి లేదా పిత్త కారణంగా వచ్చే వ్యాధులు మీకు సోకవచ్చు. ప్రమాదం కారణంగా మీరు రక్త రుగ్మతతో కూడా బాధించబడవచ్చు. కాబట్టి, ఏదైనా తీవ్రమైన సంక్లిష్టత రాకుండా నిరోధించడం కొరకు, మీరు మీ గురించి జాగ్రత్త వహించాలి.
వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఎదుగుదల ఉంటుంది, అయితే అదే సమయంలో ఆర్థికంగా, సంపాదన కంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్ లాంఛ్ చేయాలనే మీ ఆలోచనలలో ప్రగతి సాధిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంటారు. దాని కారణంగా వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమౌతుంది.
విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వారు రాసే పరీక్షలలో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. చదువుపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్యకొరకు ప్రయత్నిస్తున్నవారు అనుకూల ఫలితాన్ని పొందుతారు.

December, 2023 Month Rashifal in English, हिंदी, मराठी, ગુજરાતી , বাংলা , తెలుగు and ಕನ್ನಡClick here for December 2023 Rashiphal in English

Aries
Mesha rashi,December 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, December 2023 rashi phal
Gemini
Mithuna rashi, December 2023 rashi phal
Cancer
Karka rashi, December 2023 rashi phal
Leo
Simha rashi, December 2023 rashi phal
Virgo
Kanya rashi, December 2023 rashi phal
Libra
Tula rashi, December 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, December 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, December 2023 rashi phal
Capricorn
Makara rashi, December 2023 rashi phal
Aquarius
Kumbha rashi, December 2023 rashi phal
Pisces
Meena rashi, December 2023 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  


Every setback is an opportunity for growth and a step closer to success.  Surround yourself with positivity and inspiration, it will keep you motivated.  Lead by example, be a role model and watch your influence grow.  Achieving your goals is just the beginning, set new ones and keep growing.