సింహరాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

సింహరాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల సింహరాశి జాతకం

April ఏప్రిల్ నెలలో సింహ రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం



Simha Rashi April ఏప్రిల్ 2024
  రాశిఫలములుసింహ రాశి రాశిచక్రంలో ఐదవ రాశి. ఇది రాశిచక్రంలో 120-150 డిగ్రీలను కలిగి ఉంటుంది. మఖ (4 పాదాలు), పూర్వాఫల్ఘుని (పుబ్బ) (4 పాదాలు), ఉత్తర ఫల్గుని (1 వ పాదాలు) కింద జన్మించిన వ్యక్తులు సింహా రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు.

సింహ రాశి - మార్చిరాశి ఫలాలు

సింహ రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 7వ ఇల్లైన కుంభరాశి నుంచి, 8వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 8వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 9వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 7వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 8వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 8వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 9వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 9వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 10వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 7వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 8వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 2వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మరియు ఫైనాన్స్ పరంగా మీరు కాస్తంత క్లిష్టమైన సమయాన్ని మరియు వ్యక్తిగత జీవితంలో కాస్తంత మెరుగైన సమయాన్ని చూస్తారు.
కెరీర్ పరంగా ఈ నెల లో సాధారణ స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే మొదటి రెండు వారాల్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు, మరియు మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ నెల మొదటి రెండు వారాల్లో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ నిర్లక్ష్యం వల్ల మీ ఉద్యోగంలో కొంత సమస్య తలెత్తవచ్చు. చివరి రెండు వారాలు బాగానే ఉంటాయి, కానీ ఉద్యోగంలో అనుకోని మార్పులు జరగటం కానీ, ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి రావటం కానీ జరగవచ్చు. ఈ మార్పు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ, భవిష్యత్తుల వృత్తిపరంగా అభివృద్ధికి సాయపడుతుంది.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తల, కళ్లు, రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది కలిగించవచ్చు. మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. సమయానుకూలంగా భోజనం చేయక పోవటం లేదా అపరిపక్వ ఆహారం తీసుకోవటం వలన కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరియు సమయానికి ఆహారం మరియు సరైన విశ్రాంతి తీసుకోవాలి.
ఈ మాసంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ నెలలో తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా మాట్లాడటం జరుగుతుంది. అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు కనుక వారితో వాదించడానికి ప్రయత్నించకండి. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ, ఆర్థిక స్థితిలో అభివృద్ది కానీ కలుగుతుంది.
ఆర్థిక పరంగా ఈ నెలలో ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అంతే కాకుండా ఇతరుల మాటలు నమ్మి లేదా మోసపూరిత ప్రకటనలకు ఆకర్శితులయ్యి కూడా ఈ నెలలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశముంటుంది. మూడవ వారం నుంచి ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ నెలలో ఆర్థిక పరమైన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మీకు ఆత్మీయులమని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశముంటుంది.
వ్యాపారం పరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుంది, ఎందుకంటే వ్యాపారం తక్కువగా ఉంటుంది మరియు మరింత ఖర్చు సూచనలు ఉంటాయి. పెద్ద పెట్టుబడులకు మంచి నెల కాదు. మీ కస్టమర్లతో మీకు కొంత సమస్య ఉండవచ్చు, ఎందుకంటే మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు, దీని వల్ల మీపై నమ్మకం లోపిస్తుంది. వ్యాపార సంబంధ ఒప్పందాలకు కానీ, రాతకోతలకు కానీ ఈ నెల అంతగా అనుకూలించదు. తప్పనిసరి అయితే తప్ప ఏ రకమైన ఒప్పందాలు చేసుకోకపోవటమే మంచిది.
ఈ నెలలో మొదటి రెండు వారాల్లో విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. తరువాత వారు మెరుగైన సమయాన్ని చూస్తారు. మెరుగైన ఫలితాల కోసం వారు తమ చదువుపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు ఈ నెల మొదటి రెండు వారాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆవేశానికి, వివాదాలకు పోకుండా ఉండటం మంచిది. కొత్త విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసేవారు లేదా ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసే వారు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయటం మంచిది.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  


Make time for yourself, a balanced life leads to happiness and fulfillment.