మిథునరాశి మాస ఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

మిథునరాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల మిథునరాశి జాతకం

April ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి జాతక ఫలాలు - ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం



Mithuna Rashi April ఏప్రిల్ 2024

 రాశిఫలములుమిథున రాశి, రాశి చక్రంలోని మూడవ రాశి. ఇది రాశి చక్రంయొక్క 60-90 వ డిగ్రీలను కలిగి ఉంటుంది. మృగశిర నక్షత్ర (3, 4 పాదములు), ఆరుద్ర నక్షత్ర (4 పాదములు), పునర్వసు నక్షత్ర (1, 2, 3 పాదములు) కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు.

మిథునరాశి - మార్చినెల రాశి ఫలాలు

మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 9వ ఇల్లైన కుంభరాశి నుంచి, 10వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 10వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 11వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 9వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 10వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 10వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 11వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 11వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 1వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 9వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 10వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 4వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మీకు చాలా బాగుంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మరియు మీ పెండింగ్ పని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరీర్ లో మంచి మార్పు ను మీరు పొందుతారు. ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు మరియు ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అయితే కొన్నిసార్లు మీరు చేసే పనుల్ని మర్చిపోవటం లేదా ఒక పనికి బదులు ఇంకో పని చేయటం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. ఒకటికి రెండు పనులు ఒకేసారి చేయకుండా, ఒకటి పూర్తయ్యాక ఇంకోటి చేపట్టడం మంచిది. విదేశాల్లో ఉద్యోగం చేయటానికి ప్రయత్నిస్తున్న వారికి, లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ నెల అనుకూల ఫలితం లభిస్తుంది.
ఈ నెల ఆరోగ్యం పరంగా బాగుంటుంది. సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఆరోగ్య సమస్యలేవి ఈ నెలలో సూచించబడటం లేదు. అయితే బుధుడి గోచారం అనుకూలంగా లేని కారణంగా, మీరు పొట్ట మరియు నాడి వ్యవస్థకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధించబడవచ్చు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.
కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు. మిత్రులతో మీ అనుబంధం పెరుగుతుంది. ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. మంచి సంబంధం లేదా వివాహం కొరకు ఎదురు చూసే వారు ఈ నెలలో శుభ ఫలితం పొందుతారు. బంధువులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశముంటుంది కాబట్టి, శుభకార్యాల్లో అనవసర విషయాలో తలదూర్చక పోవటం మంచిది.
వ్యాపార పరంగా చూస్తే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీ పెట్టుబడులపై మంచి రాబడులు, సంపాదన పెరుగుతుంది. ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే, ఈ నెలలో మీరు దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు. మీరు మీ వ్యాపార అభివృద్ది విషయంలో లోన్లు లేదా ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తున్నట్లైతే ఈ నెలలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక సహాయం పొంది మీ వ్యాపారాన్ని అభివృద్ది పరుస్తారు.
ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఈ నెల 3వ లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. మొదటి రెండు వారాలు పెట్టుబడులకు మంచిది. ఆర్థిక సంస్థలనుంచి తగిన ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, ఇచ్చిన డబ్బులు కానీ లాభాలతో తిరిగి మీకు అందుతాయి.
విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. ఈ నెల మంచి ఏకాగ్రత, మంచి చదువు మీకు ఉంటుంది. మీ చదువును వాయిదా వేయకండి మరియు మీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయండి. బుధుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువు విషయంలో కన్ఫూషన్ కు గురయ్యే అవకాశముటుంది. ముఖ్యంగా పరీక్షలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


Aries
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, April 2024 rashi phal
Gemini
Mithuna rashi, April 2024 rashi phal
Cancer
Karka rashi, April 2024 rashi phal
Leo
Simha rashi, April 2024 rashi phal
Virgo
Kanya rashi, April 2024 rashi phal
Libra
Tula rashi, April 2024 rashi phal
Scorpio
Vrishchika rashi, April 2024 rashi phal
Sagittarius
Dhanu rashi, April 2024 rashi phal
Capricorn
Makara rashi, April 2024 rashi phal
Aquarius
Kumbha rashi, April 2024 rashi phal
Pisces
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Monthly Horoscope

Check April Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Monthly Horoscope

Check April Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  


Take care of your mind and body, they are the foundation of a healthy life.