ధనూరాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

ధనూరాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల ధనూ రాశి జాతకం

April ఏప్రిల్ నెలలో ధనూ రాశి జాతకుల ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం గోచార ఆధార ఫలితాలు



Dhanu Rashi April ఏప్రిల్ 2024
 రాశిఫలములుధనూ రాశి. రాశి చక్రంలో తొమ్మిదవ రాశి, ఇది రాశి చక్రంలో 240 నుండి 270వ డిగ్రీల సంబంధం కలిగి ఉంటుంది. మూలా నక్షత్ర (4 పాదాలు), పూర్వాషాఢ నక్షత్ర (4 పాదాలు), ఉత్తరాషాఢ నక్షత్ర (1 వ పాదం) కింద జన్మించిన వారు ధనూ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి.

ధనుస్సు రాశి - మార్చినెల రాశిఫలాలు

ధనూ రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 3వ ఇల్లైన కుంభరాశి నుంచి, 4వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 4వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 5వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 3వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 4వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 4వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 5వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 5వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 6వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 3వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 4వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 10వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా కొంత ఒత్తిడి తో కూడిన సమయం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాల్లో ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది.
కెరీర్ పరంగా మీ సహోద్యోగుల కారణంగా అదనపు పనిభారం మరియు కొన్ని అపార్థాలు చోటు చేసుకునే విపరీత పనులు ఉంటాయి. మీ పై అధికారుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది, ఫలితంగా, మీ కార్యాలయంలో మీరు ఒంటరిగా ఉన్నట్లుగా భావించవచ్చు. అయితే మీరు మీ పోరాట పటిమ కారణంగా ఆటంకాలు వచ్చినప్పటికీ చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. 3వ వారం నుంచి, మీరు పొజిషన్ లో మెరుగైన స్థానాన్ని పొందుతారు మరియు కొంత మద్దతు మరియు తక్కువ పనిభారం పొందుతారు. ముఖ్యంగా ఈ నెలలో పేరుప్రతిష్ఠల కొరకు కాకుండా నిజాయితీగా పని చేయడం మంచిది అంతే కాకుండా మీ గురించి కానీ మీరు చేసే పనుల గురించి కానీ మీ పై అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ లేదా తప్పుడు సమాచారం అందించడం కానీ జరగవచ్చు. అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుటుంబ పరంగా ఈ నెల ప్రథమార్థం మిశ్రమ ఫలితాలనిస్తుంది ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీకు మీ జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కానీ లేదా తప్పుడు సమాచారం వినటం వల్ల కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ నిజాయితీ కారణంగా ఈ సమస్య నుంచి తొందరగా బయట పడగలుగుతారు. మూడవ వారం తరువాత మీ కుటుంబ జీవితంలో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఈ నెలలో మీ పిల్లల నుంచి కానీ మీ తోబుట్టువుల నుంచి కానీ లభించే సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. పొట్ట, ఛాతీ మరియు మూత్రాశయ సంబంధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. సరైన సమయానికి నియమిత ఆహారం మరియు రెస్ట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయటం వలన పార్శ్వపు నొప్పి లేదా మెడ సంబంధిత ఆరోగ్య సమస్యతో కూడా బాధించబడవచ్చు. ఈ నెలలో ప్రథమార్థంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెల సాధారణ సమయం ఉంటుంది. కష్టపడి పనిచేసిన తరువాత కూడా ఈ నెలలో మీ వ్యాపారంలో సాధారణ పురోభివృద్ధి పొందుతారు. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. మీ కస్టమర్ లతో అనవసరమైన వాగ్వివాదాలు పరిహరించడానికి ప్రయత్నించండి, దీని వల్ల మీ వ్యాపారానికి సంబంధించి వ్యతిరేక ప్రచారం పొందవచ్చు. అలాగే మీ వ్యాపార భాగస్వామితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని సార్లు సరైన సమాచారం అందక మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడడం కానీ లేదా సరైన ఏకాగ్రత కుదరకపోవడం కానీ జరగడం వలన కొంత చికాకుకు, అసహనానికి లోనవుతారు. అంతే కాకుండా పరీక్షల విషయంలో కానీ ఉన్నత విద్య కొరకై చేసి దరఖాస్తుల విషయంలో కానీ సమాచార లోపం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Kundali Matching

Free online Marriage Matching service in Telugu Language.

Read More
  

Monthly Horoscope

Check April Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Kundali Matching

Free online Marriage Matching service in Telugu Language.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


Lead by example, be a role model and watch your influence grow.  



Lead by example, be a role model and watch your influence grow.  



Listen with an open mind and speak with kindness, good communication brings understanding.  



Don't let time slip away, manage it wisely and achieve your goals faster.