వృశ్చిక రాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

వృశ్చిక రాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల వృశ్చిక రాశిఫలాలు

ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం ఫలితాలు గోచారం ఆధారంగా



Vrischika Rashi April ఏప్రిల్ 2024
 రాశిఫలములువృశ్చిక రాశి, రాశి చక్రంలో ఎనిమిదవ రాశి. ఇది రాశియొక్క 210 వ ' 240వ డిగ్రీలను కలిగి ఉంటుంది. విశాఖ (4 వ పాదం), అనూరాధ (4 పాదాలు), జ్యేష్ఠా (4 పాదాలు) ల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు.

వృశ్చిక రాశి - ఏప్రిల్ నెల రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 4వ ఇల్లైన కుంభరాశి నుంచి, 5వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 5వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 6వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 4వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 5వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 5వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 6వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 6వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 7వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 4వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 5వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 11వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెల మీకు మంచి సమయం ఉంటుంది. వ్యక్తిగతంగా, మరియు కెరీర్ పరంగా మీరు కొంత ఎదుగుదలను చూస్తారు.
కెరీర్ పరంగా ఈ నెలలో మీరు మెరుగైన ఎదుగుదలను పొందుతారు. మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ, 3వ వారం నుంచి బుద్ధిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం వలన కొంత అసహనానికి గురవుతారు. ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. అయితే మూడో వారం నుంచి ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైన మార్పు జరగడం జరగడంతో వృత్తుల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీపై అధికారుల నుంచి ప్రశంసలందుకుంటారు.
ఆరోగ్య పరంగా ఈ నెల మంచి సమయం ఉంటుంది. అయితే ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ వారం నుంచి పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వలన మీరు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు.
ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఆదాయం, లాభాలు వస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్ధంకంటే ద్వితీయార్ధంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు మే 1 తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టడం మంచిది.
కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది మరియు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ మాసంలో స్థల మార్పు ఉంటుంది. మీ పిల్లలు కూడా ఈ నెలలో వారి, వారి రంగాల్లో రాణించడం వల్ల మీకు ఆనందం లభిస్తుంది
వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది మరియు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లయితే, మీరు ఈ నెలలో దీనిని చేయవచ్చు. మీ వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండటం వలన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు తమ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు మరియు విజయం సాధిస్తారు. బుధుని బలహీనత వల్ల మొదటి రెండు వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించడం జరుగుతుంది, తరువాత వీరికి మంచి సమయం ఉంటుంది.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  


Surround yourself with positivity and inspiration, it will keep you motivated.