కన్యారాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

కన్యారాశి April ఏప్రిల్ 2024 రాశి ఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల కన్యా రాశిఫలాలు

April ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం



Kanya Rashi April ఏప్రిల్ 2024
 రాశిఫలములుకన్యారాశి, రాశిచక్రంలో ఆరవ రాశి. కన్యారాశి రెండవ-అతి పెద్ద నక్షత్రసముదాయం. ఇది రాశిచక్రంయొక్క 150-180th డిగ్రీలను కలిగి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం (2, 3, 4 పాదాలు), హస్త నక్షత్రం (4 పాదాలు), చిత్తా నక్షత్రం (1, 2 పాదాలు) కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు.

కన్యా రాశి - ఏప్రిల్ రాశి ఫలాలు

కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 6వ ఇల్లైన కుంభరాశి నుంచి, 7వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 7వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 8వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 6వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 7వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 7వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 8వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 8వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 9వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 6వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 7వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 1వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ మాసం మీకు సామాన్యంగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుని సంచారం అనుకూలంగా ఉండదు. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు, ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది.
ఈ నెలలో మీకు పనిభారం ఎక్కువగా ఉండటం మరియు విశ్రాంతి తక్కువగా ఉంటుంది. దీని వల్ల చివరి రెండు వారాల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించక పోవటం లేదా ఇవ్వబడ్డ పనిని నిర్లక్ష్యం కారణంగా వాయిదా వేయటం చేయవద్దు, ఎందుకంటే ఇది మీ కెరీర్ లో ఏదో ఒక సమస్యకు దారితీస్తుంది. మీరు చేసే పనులతో పాటుగా అదనంగా మీ సహోద్యోగులు లేదా పై అధికారుల కారణంగా చెప్పే పనులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మీలో అసహనం ఎక్కువయ్యే అవకాశముంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు పని వాయిదా వేయకుండా పూర్తి చేయటం మంచిది.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. ఈ నెల రెండో వారంలో వేడి, ప్రైవేట్ భాగాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను మీరు ఎదుర్కొన వచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోక పోవటం లేదా అజీర్ణం కారణంగా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశముంటుంది. అంతే కాకుండా నరాలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పనితోపాటు విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వటం సమస్య తగ్గుముఖం పడుతుంది.
కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల, మీరు కుటుంబ సమస్యలపై తక్కువగా దృష్టి సారించవచ్చు, ఫలితంగా మీ జీవిత భాగస్వామితో మీకు మనస్పర్థలు ఏర్పడే అవకాశముంటుంది. అంతే కాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవటం కూడా మీరు మానసిక ప్రశాంతత కోల్పోయేలా చేస్తుంది. మీ సహనాన్ని కోల్పోకుండా ఓపికగా ఉండటం వలన సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. డబ్బు సమయానికి అందినప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ఆర్థికంగా ఈ నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి లేదా మిత్రుల కారణంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. ఆర్థిక సంబంధ పెట్టుబడులకు ఒక నెల ఆగటం మంచిది.
వ్యాపారంలో, మీరు మీ భాగస్వామితో కొంత సమస్య కారణంగా వ్యాపారంపై సరిగా దృష్టి పెట్టలేక పోతారు దాని కారణంగా తక్కువ వ్యాపార వృద్ధి ఉంటుంది. అంతే కాకుండా మీ వ్యాపారం గురించి తప్పుడు ప్రచారాలు జరగటం లేదా తప్పుడు సమాచారం ఇవ్వటం వలన కూడా ఈ నెల వ్యాపారం తక్కువగా ఉంటుంది. కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయటం మంచిది కాదు. అలాగే మిగతా విషయాలను పక్కనపెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఈ నెలలో అనవసర ఖర్చులు, వ్యాపార విస్తరణలను నివారించేందుకు ప్రయత్నించండి.
విద్యార్థులకు ఈ నెలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదువును వాయిదా వేయటం, చివరి నిమిషంలో చదివి పాసవుతామనే అతి విశ్వాసం కారణంగా సమయానికి సరైన విధంగా చదువు పూర్తికాకపోవటం వలన పరీక్షల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కృషి చేయాలి. చివరి రెండు వారాల్లో, విద్యా సంస్థలకు దరఖాస్తు చేసేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Kundali Matching

Free online Marriage Matching service in Telugu Language.

Read More
  


Spending time with family creates memories that last a lifetime.  



Your health is your wealth, prioritize it and watch your overall wellbeing improve.  



A positive attitude attracts positive outcomes, adopt one and watch your life improve.  



Work-life balance is essential, prioritize it and watch your stress levels decrease.