తులారాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

తులారాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల తులా రాశి ఫలాలు

ఏప్రిల్ నెలలో తులా రాశి జాతకుల కోసం ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు



Tula Rashi April ఏప్రిల్ 2024
 రాశిఫలములుతుల రాశి, రాశి చక్రంలోని ఏడవ రాశి. ఇది రాశి చక్రం యొక్క 180-210th డిగ్రీలను కలిగి ఉంటుంది. చిత్తా నక్షత్ర (3, 4 పాదాలు), స్వాతి నక్షత్ర (4పాదాలు), విశాఖా నక్షత్ర (1, 2, 3 పాదాలు) కింద జన్మించిన వారు తులా రాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు.

తులారాశి - ఏప్రిల్ రాశి ఫలాలు

తులా రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 5వ ఇల్లైన కుంభరాశి నుంచి, 6వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 6వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 7వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 5వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 6వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 6వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 7వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 7వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 8వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 5వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 6వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 12వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ వారీగా మీరు కొంత ఎదుగుదల మరియు మార్పులు మరియు ఆర్థికంగా సాధారణ సమయాన్ని చూస్తారు.
కెరీర్ పరంగా మొదటి రెండు వారాలు మంచి ఫలితాలను ఇస్తుంది. కెరీర్ మెరుగు కోసం ప్రయత్నించే వారికి మొదటి రెండు వారాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. తరువాత స్థానం లేదా పొజిషన్ లో ఊహించని మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని నెలల పాటు కొంత పని ఒత్తిడిని ఇస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో అనుకోని ప్రయాణాలు కానీ, వృత్తిలో మార్పులు కానీ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ నెలల ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. తప్పుడు సమాచారం వలన కానీ, సమాచారం సమయానికి అందక పోవటం వలన కానీ మంచి అవకాశం కోల్పోవటం జరగవచ్చు. పని విషయంలో వాయిదా వేయకుండా సమయానికి పూర్తయ్యేలా చూసుకోవటం మంచిది.
ఈ నెలలో మొదటి రెండు వారాలు ఆరోగ్యపరంగా బాగుంటుంది. తరువాత మీకు పొట్ట, ప్రైవేట్ భాగాలు మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే రక్తము లేదా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ నెలలో మీలో కోపం, అసహనం ఎక్కువయ్యే అవకాశముంటుంది కాబట్టి ప్రాణాయామం లాంటివి చేయటం మరియు సరైన విశ్రాంతి, ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
కుటుంబపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉండటమే కాకుండా గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెలలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. మీ అజాగ్రత్త, తొందరపాటు కారణంగా మొబైల్ లాంటి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశముంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో మీ తండ్రిగారి లేదా కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి రెండు వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది మరియు మిగతా రెండు వారాల పాటు ఊహించని ఖర్చులు ఉంటాయి. ఈ నెలాఖరు వరకే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్థిర చరాస్థులపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నెలాఖరులోగా వాటిని పూర్తి చేయటం మంచిది. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కుటుంబ విషయాల గురించి డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశముంటుంది.
వ్యాపారంలో ఉన్న వారికి మొదటి రెండు వారాల్లో మంచి సమయం లభిస్తుంది. మీరు మెరుగైన ఎదుగుదలను చూస్తారు. పెట్టుబడుల కోసం ఈ నెల 13వ తేదీ లోపు వీటిని చేయడం మంచిది. తరువాత మీ భాగస్వామితో కొన్ని ఆర్థిక నష్టాలు లేదా సమస్యలు ఉండవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కూడా ఈ నెలలో దానికి సంబంధించిన పనులు పూర్తి చేయటం మంచిది. వచ్చే నెల నుంచి ఒక సంవత్సరం పాటు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొత్తగా వ్యాపారం ప్రారంభించటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ అంతగా అనుకూలించదు.
విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది, వీరు ఆశించిన ఫలితాలు పొందుతారు మరియు మెరుగైన చదువును పొందుతారు. చివరి రెండు వారాల్లో మీకు కొన్ని అడ్డంకులు ఉంటాయి, అందువల్ల అనుకున్న ఫలితాలను పొందడం కొరకు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ సంస్థలతో కమ్యూనికేషన్ లోపం కారణంగా విద్యాలయాల్లో ప్రవేశం కొంత ఆలస్యమయ్యే అవకాశముంటుంది.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  


Success is a journey, not a destination. Keep pushing forward and it will come.  



Your children are your greatest accomplishment, love and guide them as they grow.  



Spending time with family creates memories that last a lifetime.  



The love you give your children will shape their future and bring joy to your life.