నక్షత్ర పాద గణన - జ్యోతిష పాఠములు

నక్షత్ర పాద గణన

జన్మ నక్షత్రం మరియు నక్షత్ర పాదాన్ని ఎలా లెక్కించాలి?



నక్షత్ర పాద గణనగతపాఠంలో రాశి మరియు జన్మనక్షత్రాన్ని తెలుసుకోవటమెలాగో నేర్చుకున్నారు.  ఈ పాఠములో ముందుగా నక్షత్రపాదం లెక్కించటమెలాగో తెలుసుకుందాము. గత పాఠములో ఇచ్చిన రాశి, నక్షత్రాలు మీకు ఈపాటికి కంఠస్థమై ఉంటాయని భావిస్తున్నాను. ఒకవేళ వాటిని కంఠస్థం చేయక నిర్లక్ష్యం చేస్తే మీరు జ్యోతిషం నేర్చుకోవటం విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవలసి ఉంటుంది.ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. 27 నక్షత్రాలు 108 పాదాలుగా రాశిచక్రములో విభజింపబడ్డాయి. ఒక్కో పాదానికి ఒక్కో అక్షరం ఇవ్వబడింది. ముందు నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నోట్‌ పాడ్‌, కాలిక్యులేటర్‌ ఓపెన్‌ చేసుకొండి.ఉదా:- ఒక వ్యక్తి 05-04-2004 రోజున ఉదయం 10గంటలకు జన్మించాడనుకోండి. ఆరోజు పిడపర్తివారి పంచాంగానుసారం హస్తా నక్షత్రం సాయంత్రం 06గంటల39నిమిషాల వరకు ఉన్నది. గడిచిన రోజు రాత్రి 8 గంటల నాలుగు నిమిషాలకు ఆరంభమయ్యింది. నక్షత్రం ఆరంభమునుంచి అంత్యము వరకు గల సమయాన్ని లెక్కించండి. ఇవ్వబడిన నక్షత్ర ఆద్యంత సమయము 22 గంటల 35 నిమిషములు. దీనినే రుక్షాద్యంతము అని అంటారు.(రుక్షము అంటే నక్షత్రము అని అర్థము).ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాలు గడవటానికి పట్టిన సమయం 22గంటల 35 నిమిషాలు అయినప్పుడు ఒక పాదం గడవటానికి ఎంత సమయం అవుతుంది. ( 22 60 ్శ 35 / 4 ్స ? ) దాదాపు 5 గంటల 39 నిమిషాలు.నక్షత్ర ఆరంభ సమయం నుంచి జన్మ సమయం వరకు అయిన సమయాన్ని లెక్కించండి. 13 గంటల 56 నిమిషములు. దీనిలో రెండుపాదాల సమయం అంటే 11 గంటల 18 నిమిషాలు గడిచిపోగా ఇంకా 2గంటల 38 నిమిషాలు శేషం మిగిలిఉన్నది. అంటే జాతకుని జన్మ సమయానికి హస్తానక్షత్రము రెండు పాదాలు గడిచి మూడవపాదం నడుస్తున్నది. అంటే జాతకుడు హస్తానక్షత్రం 3వ పాదములో జన్మించాడని తెలుస్తున్నది.మళ్ళీ ఒకసారి గమనిస్తే ముందుగా జాతకుడు జన్మించిన నాటి నక్షత్ర ఆద్యంతాలను తీసుకొండి. దానిని 4చే భాగించండి. జాతకుడు జన్మిచిన సమయానికి ఎన్ని పాదాలు కొట్టుడుపోతున్నాయో గమనించండి. శేషం ఏ పాదములో పడుతున్నదో గమనించండి.అదే ఆ జాతకుని జన్మ నక్షత్రపాదం. తర్వాతి పాఠములో ప్రతి నక్షత్ర పాదానికి గల జన్మ నామాక్షరాలను, వాటికి వచ్చే పేర్లను తెలుసుకుందాం. శెలవు.


Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  


Success is a combination of hard work, determination, and perseverance.