Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Makara rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Makara Rashi in Telugu

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఒకటవ ఇంటిలో, 5వ ఇంటిలో వృషభ రాశిలో రాహువు, మరియు వృశ్చిక రాశిలో కేతువు పదకొండవ స్థానంలో ఈ సంవత్సరమంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 6న కుంభ రాశిలో రెండవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 1వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో రెండవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం వృత్తి పరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు మరియు శని చంద్ర రాశిలో కలిసి ఉండటం వలన వృత్తిలో హెచ్చుతగ్గులు, కొంత ఒత్తిడి ఉంటాయి. శని దృష్టి పదవ ఇంటిపై ఉండటంవలన, పనిలో కొంత నెమ్మదస్తులు గా మారుతారు. అంతేకాకుండా, చేసే పనిలో ఆటంకాలు ఎదురవటం, విమర్శలు రావటం వలన కొంత అసంతృప్తి లోనవుతారు. ఈ సమయం మిమ్మల్ని మీరు మరింతగా మెరుగు పరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. విమర్శలు వచ్చినప్పటికీ వాటిని మీకు మంచి చేస్తున్నవాటిగా గుర్తించగలిగితే మీరు మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతారు. కొన్నిసార్లు, మీరు చేసే పనిని కొత్తగా ఇతరులకు భిన్నంగా చేయాలని ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నంలో ఆటంకాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రయత్నించడం మంచిది, దాని వలన ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా, మీరు మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురు గోచారం రెండవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతి గురించి ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో వారు అనుకున్న విధంగా పదోన్నతి సాధిస్తారు. అంతేకాకుండా విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయములో అనుకూలమైన ఫలితం ఉంటుంది. మీ నైపుణ్యాన్ని మెరుగు పరచుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం వలన మీరు మీ వృత్తిలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. అదనపు బాధ్యతలు కానీ, మీకు ఇష్టం లేని పని కానీ, విశ్రాంతి లేకుండా చేసే పని వచ్చినప్పుడు చిరాకు పడకుండా దానిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇది భవిష్యత్తులో మీరు వృత్తిలో మరింతగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం కుటుంబ పరంగా ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం అనుకూలిస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురు, శని ఇద్దరు కలిసి ఉండటం వలన ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య లో కొంత అవగాహన రాహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఇంటిలో శాంతి మరియు సౌఖ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఐదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ తోబుట్టిన వారు కానీ, మీ మిత్రులు కానీ మనస్పర్థల కారణంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు గుర్తింపు లభించడమే కాకుండా, సన్మానాలు కానీ సత్కారాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో పంచమ స్థానం పై గురు దృష్టి కారణంగా మీ పిల్లలు చదువులో కానీ, వారి రంగాల్లో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వలన, అది మీ కుటుంబ సభ్యుల ఆనందానికి కారణం అవుతుంది. ద్వితీయార్ధంలో ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం జన్మ రాశిలో ఉండటం వలన ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు కొరకు వివిధ రకాల మార్గాల్లో ప్రయత్నించినా కూడా, అంతగా అనుకూలమైన ఫలితం ఉండకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు పొదుపుగా ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి డబ్బు ఖర్చు అయినా వాయిదా వేసే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు గోచారం రెండో ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించి తగినంత డబ్బు సమకూరుతుంది. అంతేకాకుండా మీ ఉద్యోగం గాని వ్యాపారం కానీ అభివృద్ధి చెంది దాని ద్వారా కూడా మరింత ఆదాయం లభిస్తుంది. అలాగే కోర్టు కేసులు కానీ వారసత్వ తగాదాలు కానీ మీకు అనుకూలమైన ఫలితం వచ్చి వాటి ద్వారా కూడా మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరమంతా ఐదవ ఇంటిలో రాహు సంచరించడం వలన షేర్ మార్కెట్ కానీ ఇతర స్పెక్యులేషన్ సంబంధించిన పెట్టుబడులకు కొంత సామాన్యంగా ఉంటుంది. తొందరపడి కానీ, ఇతరుల మాటలకు లొంగిపోయి పెట్టుబడులు పెట్టకండి. దాని కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇల్లు, వాహనం మొదలైన వాటిని కొనే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. లగ్నంలో గురు, శని కలయిక వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఒకటవ భావంలో శని ప్రభావం వల్ల మీ మనస్సులో నిర్మాణాత్మక ఆలోచనలు ఉంటాయి, అందువల్ల మానసికంగా సంతృప్తి చెందవచ్చు. మీరు ప్రతి పనిని ఒక క్రమబద్ధమైన మరియు నిర్మాణాత్మక రీతిలో చేస్తారు. పంచమ స్థానం పై గురు దృష్టి కారణంగా మీ ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పంచమంలో రాహువు గోచారము కారణంగా గ్యాస్టిక్ సంబంధ సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అలాగే తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి సరైన ఆహార నియమాలతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం మీకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా మానసిక ఆందోళన కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, యోగా, ప్రాణాయామం లాంటి ప్రాకృతిక ఆరోగ్య నియమాలు పాటించడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.
విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. లగ్నంలో మరియు రెండవ ఇంటిలో గురు గోచారం కారణంగా విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరీక్షలో అనుకున్న ఫలితాన్ని పొందటమే కాకుండా గుర్తింపు కూడా పొందుతారు. అయితే పంచమ స్థానంలో రాహువు గోచరము కారణంగా తమ విజయం పట్ల తాము కొంత గర్వానికి అహంకారానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. దాని వలన చదువు లో కొంత నిర్లక్ష్యం వహిస్తారు. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన పెద్దల వలన కానీ ఉపాధ్యాయుల వలన కానీ వారి గర్వం, అహంకారం దూరమై, సరైన మార్గంలో నడుస్తారు. కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న వారు ఎక్కువ కష్టపడాలి. అలాగే పరీక్ష సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ తొందరపాటు కారణంగా తెలిసి తప్పు చేసే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు. గురు గోచారం మధ్యమంగా ఉంటుంది. లగ్నంలో శని గోచారం కారణంగా ఆరోగ్య సమస్యలు రావడం వృత్తిలో సమస్యలు రావడం జరుగుతుంది. ఈ దోష నివారణ కొరకు శనికి పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజూ శని స్తోత్రం చదవడం కానీ, శని మంత్ర జపం చేయటం కానీ మంచిది. అలాగే హనుమద్ ఆరాధన చేయడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు శారీరక శ్రమ చేయడం, వృద్ధులకు పేదలకు సహాయం చేయడం వలన కూడా శని ఇచ్చే చెడు ఫలితం చాలా వరకు తగ్గుతుంది. పంచమ స్థానంలో రాహువు గోచరము కారణంగా ఆరోగ్య సమస్యలు రావడం, అలాగే సంతానానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతి రోజు రాహు పూజ కానీ, రాహు స్తోత్రం పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది.
Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read More
People living in other countries, contribute via PayPal.