onlinejyotish.com free Vedic astrology portal

తులారాశి - 2021 తెలుగు సంవత్సర రాశి ఫలములు


తులా రాశిఫలములు

2021 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2021 Rashi phalaalu


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Tula rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Tula Rashi in Telugu

తులారాశి జయ రాశి ఫలాలు

చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)

ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో నాలుగవ ఇంటిలో, రాహువు 8వ ఇంటిలో వృషభ రాశిలో , వృశ్చిక రాశిలో కేతువు రెండవ స్థానంలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభరాశిలో ఐదవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 4వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో ఐదవ ఇంటిలో ప్రవేశిస్తాడు.

వృత్తి

 

తులా రాశి వారికి, ఈ సంవత్సరం వృత్తి పరంగా మిశ్రమంగా ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులను మరియు పని ఒత్తిడిని ఎదుర్కుంటారు. మీరు చేసే కష్టానికి తగిన ఫలితం లభించకపోవడంతో కొంత నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కొన్ని సందర్భాలలో మీరు సెలవు పెట్టడానికి కూడా వీలులేనంత పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చేసే పని గాని, శ్రమ కానీ వ్యర్థం కాదు. ఇది ఒక రకంగా భవిష్యత్తులో మీకు అభివృద్ధిని ఇవ్వడానికి మీరు వేస్తున్న పునాదిగా భావించవచ్చు. ఇప్పుడు మీరు కష్టపడి చేసే ప్రతి పని భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి దోహదమవుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో, గురువు గోచారం అయిదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ఒత్తిడి గాని అధిక శ్రమ తగ్గుతుంది. మీరు చేస్తున్న శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పని ఒత్తిడి పూర్తిగా తగ్గినప్పటికీ, ప్రశంసలు లభించడం వలన ఉత్సాహంతో పని చేయగలుగుతారు. మీరు ఇచ్చే సలహాలు, మీరు చేసే సూచనలు కానీ విజయవంతం అవటం వలన మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగుల నుంచి కూడా సహాయ, సహకారాలు లభిస్తాయి. గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఉండటం వలన వృత్తిలో అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు కోరుకున్న చోటికి మారటం గాని, మీరు కోరుకున్న పదవి దక్కడం కానీ జరుగుతుంది. అయితే శని దృష్టి లగ్నం పై, పదవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు అనాలోచితంగా చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఏ పని అయినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే చేయడం మంచిది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో తిరిగి గురువు నాలుగవ ఇంటిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో అనాలోచితమైన పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో పొగుడుతున్నట్టు పైకి ప్రేమ చూపిస్తూ, మీరు చేసే ప్రతి పనిలో తప్పులు ఎత్తి చూపే వారు, మిమ్మల్ని అవమానించాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీ శ్రేయోభిలాషులు ఎవరో, మీకు నష్టం చేయాలని చూసే వారు ఎవరో మీకు తేటతెల్లమవుతోంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వీలైనంతవరకూ మీ పనులు మీరే చేసుకోండి.



కుటుంబం

కుటుంబం పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం, అలాగే శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం, రాహు,కేతువుల గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన సంవత్సర ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు పెరగడం కానీ, కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది. కేతు గోచారం రెండవ ఇంట్లో ఉండటం కారణంగా, కారణం లేకుండానే కుటుంబ సభ్యుల గురించి ఆందోళనకు గురవుతారు. దాని కారణంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం, కుటుంబ సభ్యులను ఒక పద్ధతిలో ఉంచాలను కోవడం జరుగుతుంది. దానివలన కుటుంబ సభ్యులకు మీపై గౌరవం తగ్గటం లేదా మీతో సరైన సంబంధాలు లేకుండా ఉండటం జరుగుతుంది. వీలైనంత వరకు అతి జాగ్రత్తకు, అతి భయానికి లోనుకాకుండా కుటుంబ సభ్యులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన, కుటుంబ విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. లగ్నం పై గురు దృష్టి కారణంగా మీ ఆందోళనలు, భయాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీ సంతానం మరియు తోబుట్టినవారు అభివృద్ధిలోకి వస్తారు. వివాహం గురించి కాని, సంతానం గురించి కానీ ఎదురుచూస్తున్న వారు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో అనుకూలమైన ఫలితం పొందుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. నూతన గృహానికి మారటం లేదా విదేశీ యానం చేయడం జరుగుతుంది.

 

ఆర్థిక స్థితి

 

ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచరము చతుర్ధ స్థానంలో అనుకూలంగా లేనందున ఖర్చులు పెరగడం రావలసిన డబ్బులు సమయానికి రాక పోవడం జరుగుతుంది. శని దృష్టి అరవ ఇంటిపై ఉండటం వలన డబ్బులు ఉన్నప్పటికీ సమయానికి అందకపోవడం వలన వేరే చోట అప్పు చేయాల్సి రావచ్చు. ఇల్లు, వాహనం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఎక్కువ డబ్బులు ఈ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు తక్కువగా వస్తాయి. రాహువు గోచరము అష్టమ స్థానంలో ఉండటం, కేతువు గోచారము ధన స్థానంలో ఉండడం వలన చాలా సార్లు డబ్బు గురించి ఎక్కువ ఆందోళనకు గురవుతారు. మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అనే భయంతో వేరే వారి దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటారు. వీలైనంతవరకూ ఓపిక గా ఉన్నట్లయితే మీ ఆర్థిక సమస్యలు ఎక్కువ శ్రమ లేకుండానే తగ్గిపోతాయి. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటంతో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురువు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, అలాగే పెట్టుబడుల నుంచి ఆదాయం పెరగటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురు దృష్టి ఒకటవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వల్ల సరైన సమయంలో ఆర్థిక లాభాలు జరగటం అలాగే అనుకోని విధంగా ధన లాభం జరగటం వలన గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.



ఆరోగ్యం

 

ఆరోగ్య విషయంలో, ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. గురువు, శని, రాహువు మరియు కేతువుల గోచారం సామాన్యం గా ఉండటం వలన జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం కానీ, ఊపిరితిత్తులు, నడుము, వెన్నెముక, కాలేయము మరియు మర్మావయవాల కు సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఆహారపు అలవాట్లు కానీ, శారీరక అలవాట్లు గానీ ఒక పద్ధతి ప్రకారం ఏర్పరచుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి గురు గోచారం అయిదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శని మరియు రాహు గోచారం ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు కాబట్టి వీలైనంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి కారణంగా కానీ, కుటుంబ సమస్యల కారణంగా కానీ మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి యోగా ప్రాణాయామం లాంటి వాటిని అలవాటు చేసుకోవడం, వీలైనంతవరకు మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవటం మంచిది.

చదువు

తులా రాశి లో జన్మించిన విద్యార్థులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఏప్రిల్ వరకు గురువు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువుపై ఆసక్తి తగ్గటం, వాయిదా వేసే స్వభావం పెరగటం జరుగుతుంది. చివరి నిమిషం వరకు చదువు వాయిదా వేస్తూ ఉండటం వలన చివరకు మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీలైనంతవరకూ వాయిదా వేసే స్వభావాన్ని తగ్గించుకోవటం మంచిది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో ఏకాగ్రత తిరిగి రావటం, ఆసక్తి పెరగడం జరుగుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న వారు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు.

 

పరిహారాలు

ఈ సంవత్సరమంతా శని, రాహువు మరియు కేతువు అనుకూలంగా ఉండరు. ఏప్రిల్ వరకు గురువు నాలుగవ ఇంటిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో గురువుకు, సంవత్సరమంతా శని, రాహు మరియు కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన, వృత్తిలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి దీనికి పరిహారం చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజూ శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ స్తోత్రం పారాయణం చేయటం కానీ, లేదా శని జపం చేయటం కానీ మంచిది. దీంతోపాటు పేదలకు కానీ అనాథలకు కానీ సేవ చేయటం మంచిది. వాటివలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. రాహువు సంవత్సరం అంతా అష్టమ స్థానం లో సంచరిస్తాడు కాబట్టి, ఈ సమయంలో అకారణంగా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం, చేపట్టిన పనులలో అడ్డంకులు ఎదురవటం, ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు రాహు పూజ చేయటం కానీ, రాహు స్తోత్రం చదవడం కానీ, దుర్గా పూజ చేయడం గానీ మంచిది. అంతేకాకుండా రాహు మంత్ర జపం చేయటం వలన కూడా సంవత్సరమంతా అనుకూల ఫలితాలు పొందుతారు. కేతువు ఈ సంవత్సరమంతా రెండవ ఇంటిలో సంచరించటం వలన కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏర్పడతాయి. చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కేతు స్తోత్రం పారాయణం చేయటం కానీ, కేతు పూజ చేయడం కానీ, గణపతి పూజ చేయడం కానీ చేయటం మంచిది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో, తిరిగి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురువుకు పరిహారాలు చేయటం మంచిది. ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయటం కానీ మంచిది. సంవత్సరమంతా శుభ ఫలితం ఇవ్వటానికి గురు మంత్ర జపం చేయటం మంచిది.



రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

వికారి నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2026 rashi phal
Gemini
Mithuna rashi, year 2026 rashi phal
Cancer
Karka rashi, year 2026 rashi phal
Leo
Simha rashi, year 2026 rashi phal
Virgo
Kanya rashi, year 2026 rashi phal
Libra
Tula rashi, year 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2026 rashi phal
Capricorn
Makara rashi, year 2026 rashi phal
Aquarius
Kumbha rashi, year 2026 rashi phal
Pisces
Meena rashi, year 2026 rashi phal

 

Kundali Matching

 

Free online Marriage Matching service in Telugu Language.

 Read More
  
 

Kundali Matching

 

Free online Marriage Matching service in Telugu Language.

 Read More
  
 

Telugu Panchangam

 

Today's Telugu panchangam for any place any time with day guide.

 Read More
  
 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

 Read More
  

Contribute to onlinejyotish.com

QR code image for Contribute to onlinejyotish.com
Contribute via UPI (For Indians)

People living in other countries, contribute via PayPal.

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.