Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2019 -20 Vikari samvatsara Dhanussu rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Dhanussu Rashi in Telugu

మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో రెండవ ఇంటిలో, రాహువు 6వ ఇంటిలో వృషభ రాశిలో, వృశ్చిక రాశిలో కేతువు పన్నెండవ స్థానంలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 6న కుంభ రాశిలో మూడవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 2వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో మూడవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం, మీకు వృత్తి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారం రెండవ ఇంటిలో ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో మీరు అనుకున్న స్థాయి ని పొందుతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి జనవరి మరియు ఏప్రిల్ మధ్యలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం మూడవ ఇంటిలో మధ్యమం గా ఉంటుంది. ఈ సమయంలో వృత్తిలో కానీ, ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ అనుకోని మార్పు ఉంటుంది. మీ గురించి వ్యతిరేక ప్రచారం కానీ, తప్పుడు ప్రచారం కానీ జరగటం లేదా చేయని తప్పు మీ పై పడటం వలన ఈ అనుకోని మార్పు జరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. రెండవ ఇంటిలో శని, మూడవ ఇంటిలో గురువు గోచారం కారణంగా కొంతమంది మీ మాటలను అపార్థం చేసుకుని ఈ విధమైన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మాట విషయంలో గాని, మీరు చేసే పని విషయంలో కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే రాహువు గోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీపై ఉన్న అపవాదులు కానీ, మీపై ఉన్న శత్రుత్వం కానీ తొందరలోనే తొలగిపోయి మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తప్పు తెలుసుకొని మిత్రులుగా మారుతారు. సెప్టెంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ పరంగా పదోన్నతి గాని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. గురువు గోచారం అనుకూలంగా ఉన్నంత వరకు వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రెండవ ఇంటిలో శని గోచారం సామాన్యం గా ఉండటం వలన మీరు చేసే పనులు కొన్ని సార్లు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు రెండవ ఇంటిలో గురు గోచారం ఉండటంతో కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి వివాహం అవటం కానీ, సంతానం కలగటం కానీ జరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావటానికి కానీ లేదా ఆర్థికంగా అభివృద్ధి కానీ జరుగుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండటం శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు విశ్రాంతిని, మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే గురువు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన వచ్చిన సమస్యలు తొందరగా తొలిగిపోతాయి. దానివలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురు దృష్టి సప్తమ స్థానంపై, భాగ్య స్థానంపై అలాగే లాభ స్థానంలో ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం మెరుగవుతుంది. మీ తోబుట్టువుల కారణంగా, లేదా మీ తండ్రిగారి కారణంగా మీకు అనుకోని సహాయం అందే అవకాశం ఉంటుంది. రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు చెడు చేయాలనుకునేవారు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు మీకు దూరంగా వెళ్ళిపోతారు. కోర్టు కేసులు గాని ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సంవత్సరం పిల్లల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. మీ పిల్లలు కష్టపడి పనిచేయడం లేదా చదవటం ద్వారా పురోగతి సాధిస్తారు మరియు వారి మానసిక సామర్థ్యాల ఆధారంగా వారి లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్నట్లయితే, వారు మంచి గుర్తింపు పొందిన సంస్థలో అడ్మిషన్ పొందుతారు.
ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. వృత్తిలో అభివృద్ధి కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. రెండవ ఇంటిలో సంవత్సరమంతా శని గోచారం ఉండటం వలన ఆర్థిక అభివృద్ధి తో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా లేనప్పటికీ కొన్నిసార్లు సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాహువు గోచారము సంవత్సరమంతా ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఇల్లు మరియు ఇతరత్రా స్థిరాస్తుల కొనుగోలుకు అవసరమైన డబ్బు కానీ లోన్ కానీ సమయానికి పొందుతుంది. కేతువు గోచారం సంవత్సరమంతా పన్నెండవ ఇంటిలో కొంత వ్యతిరేకంగా ఉండటం వలన అనుకోని ఖర్చులు పైన పడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన ఆర్థిక లాభాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. మీ తోబుట్టువుల ద్వారా కాని లేదా మిత్రుల ద్వారా గాని ఆర్థిక సహాయం అందుతుంది. అంతేకాకుండా పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తిపాస్తులు కానీ, న్యాయంగా మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు ధనం ఖర్చు పెడతారు. ఈ ఏడాది పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు రిస్క్ తో కూడిన వెంచర్లలో పెట్టుబడి పెట్టవద్దు.
ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో పెద్ద సమస్యలు రానప్పటికీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందిని పెడతాయి. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధ పడుతున్నట్లయితే, ఈ సంవత్సరం ప్రథమార్ధంలో దాని నుంచి బయటపడతారు. మీ ఆహారపు అలవాట్లతో పాటు మీ రోజువారీ దినచర్యపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట వ్యాయామాలు చేయడం తోపాటు యోగా సాధన చేయండి. నిర్మాణాత్మకంగా మీ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీ జీవనశైలిని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతుంది.
విద్యార్థులకు, ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. గురువు గోచారం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు. పరీక్షలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. చదువు కారణంగా మీకు గుర్తింపు లభిస్తుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం మధ్యమంగా ఉండడం వలన ఈ సమయంలో చదువుపై ఆసక్తి తగ్గటం, బద్ధకం పెరగడం జరుగుతుంది. గతంలో ఫలితాలు అనుకున్న విధంగా రావడంతో చదువు పట్ల నిర్లక్ష్యం పెరగడమే కాకుండా అహంకారానికి గురవుతారు. వీలైనంతవరకు నిర్లక్ష్యానికి, అహంకారానికి చోటివ్వకుండా చదువుపై దృష్టి పెట్టడం మంచిది. ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకున్న విధంగా విద్యాలయాల్లో ప్రవేశం దొరుకుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాసే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ఈ సంవత్సరం గోచార రీత్యా శని మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. రెండవ ఇంటిలో శని గోచారం కారణంగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, శని పరిహారాలు చేయటం వలన ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, శని మంత్ర జపం చేయడం కానీ మంచిది. దానితో పాటుగా హనుమాన్ స్తోత్రాలు చదవటం కానీ, ఆంజనేయుడికి పూజ చేయడం కానీ మంచి ఫలితం ఇస్తుంది. పన్నెండవ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేతువుకు పరిహారాలు చేయటం వలన ఈ సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు కేతు స్తోత్రం చదవడం కానీ, కేతు మంత్ర జపం చేయటం మంచిది. దానితో పాటుగా గణపతి స్తోత్రం చదవడం కానీ గణపతి పూజ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.
Check April Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read More
People living in other countries, contribute via PayPal.