Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Kanya rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Kanya Rashi in Telugu

ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఆరవ ఇంటిలో, రాహువు 9వ ఇంటిలో వృషభ రాశిలో , వృశ్చిక రాశిలో కేతువు మూడవ స్థానంలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభరాశిలో ఆరవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 5వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో ఆరవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
కన్య రాశి వారికి, ఈ సంవత్సరం వృత్తి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు ఐదవ మరియు ఆరవ ఇళ్లలో సంచరించడం వలన ఈ సంవత్సరం వృత్తులలో అనుకూలమైన మార్పులుంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో, గురువు గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది. దీని వలన ఈ వృత్తిలో మీరు ఇచ్చే సలహాలు కానీ, చేసే పనులు కానీ, మీకు పేరును, వృత్తిలో అభివృద్ధిని ఇస్తాయి. మీరు ఇచ్చే సలహాల కారణంగా, మీ సహోద్యోగులు కూడా లాభాలు పొందుతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన, వృత్తిలో మార్పులు సంభవిస్తాయి. మీ ప్రమేయం లేకుండానే మీకు వేరే ప్రదేశానికి వెళ్లవలసి రావడం కానీ, లేదా ఉన్న ప్రదేశంలోనే అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం కానీ జరుగుతుంది. దీని వలన మీరు కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ తొందరలోనే దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీకు చెడు చేయడానికి లేదా మీ గురించి చెడుగా చెప్పడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అటువంటి రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఐదవ ఇంటిలో శని గోచారం వలన మీరు కొన్నిసార్లు బద్ధకంగా ఆలోచించడం కానీ లేదా పనుల విషయంలో వాయిదా వేసే స్వభావం అలవాటు చేసుకోవటం కానీ జరుగుతుంది. దాని వలన మీ వృత్తిలో కొంత ఇబ్బందికి లోనవటమే కాకుండా, పై అధికారుల దృష్టిలో పనులను వాయిదా వేసే వ్యక్తిగా గుర్తించబడతారు. ఏప్రిల్ మరియు సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీ మాట విషయంలో, అలాగే విదేశాల్లో పని చేసే విషయంలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. మీ మాట కారణంగా కానీ, లేదా మీరు చేసే పనుల కారణంగా కానీ అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే పని, మీ మాట రెండు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కానీ, లేదా సెప్టెంబర్ తర్వాత కానీ అనుకున్న ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం అంతా శని దృష్టి రెండవ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి చేసిన పనికి ఎక్కువ ప్రతిఫలం ఆశించకండి, దాని వలన అసంతృప్తికి లోనవుతారు. కాకపోతే చాలా సార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రతి ఫలాన్నే పొందుతారు.
కుటుంబపరంగా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం మే కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంతానం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయి అందరూ మీతో ప్రేమగా మెలుగుతారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య మీ తోబుట్టిన వారికి వారి ఉద్యోగం లో కానీ వారి ఆర్థిక ఈ స్థితిలో కాని మెరుగుదల ఉంటుంది. మీ తండ్రిగారి ఆరోగ్యం బాగుపడుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యన గురువు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. అయితే కుటుంబ స్థానంపై దృష్టి కూడా ఉండటం వలన మీ మాట తీరు కారణంగా లేదా మీరు కొన్ని విషయాల్లో ఆలస్యంగా స్పందించడం వలన మీ కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందికి గురవుతారు. వారి పట్ల మీ ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. గురువు దృష్టి పదవ ఇంటిలో ఉండటం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదవులు కానీ సన్మానాలు కానీ పొందుతారు. దాని కారణంగా కొంత గర్వం కానీ అహంకారం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. మీ స్థాయిని మించిన పనులు చేయకుండా జాగ్రత్త వహించండి. మీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారితో భేదాభిప్రాయాలు ఏర్పడటం గాని జరుగుతుంది. మీ మాట విషయంలో,ఇతరులతో మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ నిర్లక్ష్య ధోరణి కానీ, పట్టించుకోని స్వభావం కానీ ఎదుటివారిని ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ వృత్తి కారణంగా కుటుంబానికి కొంత కాలం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీ పిల్లల చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ బాధ పడే అవసరం లేదు. ఈ సంవత్సరం వారికి బాగా అనుకూలిస్తుంది.
కన్య రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి 11వ ఇంటిపై, రెండవ ఇంటిపై ఉండటం వలన ఆర్థిక వృద్ధి చాలా బాగుంటుంది. గడిచిన సంవత్సరంలో ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండడం వలన సరైన విధంగా పొదుపు చేయలేకపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఆ సమస్య తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి జరగడమే కాకుండా డబ్బు పొదుపు చేస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. గతంలో మీకు రావాల్సిన డబ్బులు కానీ, ఆర్థిక సహాయం కానీ సమయానికి అందుతుంది. శని దృష్టి కూడా సంవత్సరం అంతా పదకొండవ స్థానంపై ఉండటంవలన, కొన్నిసార్లు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం కానీ, లేదా పెట్టుబడులనుంచి అనుకున్నంత లాభం రాకపోవటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య ఈ విధమైన ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురు దృష్టి కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఉండదు. ఈ సంవత్సర ఆరంభంలో షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి మీరు డబ్బు సంపాదిస్తారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఆరోగ్యం విషయంలో ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లగ్నం పైన, లాభ స్థానం పైన ఉండటం వలన ఆరోగ్యం బాగుండడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం, అలాగే శని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హృదయము, కాలేయము, లేదా ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆరోగ్య అలవాట్లను పాటించటం, ఆహార నియమాలను పాటించడం వలన చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మిగతా సమయమంతా ఆరోగ్య విషయంలో ఆందోళన అవసరం లేదు. కేతువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయమయ్యే అవకాశం ఉంది.
విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గురు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన చదువుపై ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా, పరీక్షలు కూడా మంచి మార్కులు సాధిస్తారు. అయితే సంవత్సరమంతా శని ఐదవ ఇంటిలో ఉండటం విద్యార్థుల్లో బద్దకాన్ని, నిర్లక్ష్యాన్ని ఎక్కువ చేస్తుంది. తక్కువ చదివి ఎక్కువ మార్కులు ఆశించడం, లేదా తక్కువ శ్రమ చేసి ఎక్కువ ఫలితం ఆశించడం చేస్తుంటారు. అంతేకాకుండా, గురు దృష్టి పదవ ఇంటిలో ఉండటం వలన కొన్నిసార్లు అహంకారానికి లోనవుతారు. దానివలన రావలసిన దానికంటే తక్కువ ఫలితాన్ని పొందుతారు. వీలైనంత వరకు ఫలితంపై కాకుండా చేసే పని పై, చదువుపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కాంపిటీటివ్ పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుతారు.
ఈ సంవత్సరమంతా శని గోచారం మధ్యమంగా ఉండటం అలాగే ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో గురువు గోచారం కూడా కొంత సామాన్యంగా ఉండటం వలన ముఖ్యంగా ఈ రెండూ గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. ఐదవ ఇంటిలో శని గోచారం కారణంగా జరిగే చెడు ఫలితాలను తగ్గించడానికి శనికి తైలాభిషేకం చేయించడం, శని సంబంధ స్తోత్ర పారాయణం చేయటం, లేదా శని జపం చేయడం మంచిది. దీనివలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఆరవ ఇంటిలో గురు గోచారం కారణంగా కలిగే చెడు ఫలితాలు తగ్గించడానికి ప్రతిరోజు గురు స్తోత్రం చేయడం లేదా గురు మంత్ర జపం చేయటం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. దీనివలన ఫలితాలు తగ్గుతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా రాహువు గోచారము తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన కలిగే చెడు ఫలితాలు తగ్గించడానికి ప్రతి రోజు రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దానితో పాటుగా దుర్గా స్తోత్రం చదవటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read MoreCheck April Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read More
People living in other countries, contribute via PayPal.